పుట్టింది శట్పల్లి గ్రామం కామారెడ్డి జిల్లా. 'కళ్లం' (సాహిత్య వ్యాసరాశి) వ్యాస సంపుటి ప్రచురించారు. ‘తెలంగాణ సాహిత్య గ్రంథసూచి’ ప్రధాన సంపాదకుడిగా, ‘నిత్యాన్వేషణం’, ‘శిలాక్షరం’ గ్రంథాలకు సంపాదకునిగా చేశారు. ‘మహాభారతంలో సంవాదాలు - సమగ్రపరిశీలన' అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తున్నారు. 'మూసీ సాహిత్య ధార' సంస్థ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
జననం: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. కవి, రచయిత, ఉపాధ్యాయుడు. ప్రపంచీకరణ, సామ్రాజ్యవాద వ్యతిరేక సాహిత్య సృజన వీరి ప్రత్యేకత. 'ఆవాహన','పారిపోలేం', కవితా సంపుటాలు వచ్చాయి. 'పిట్టలేనిలోకం', 'పర్యావరణ ప్రయాణాలు' అనే దీర్ఘకవితలు ప్రచురించారు. 'సీమెన్' కథా సంపుటి ముద్రించారు.
కవి, రచయిత, అనువాదకుడు, విమర్శకుడు. విప్లవ రచయితల సంఘం సభ్యుడు. రచనలు: 1. గెరిల్లా గుండె లయలు(1994), 2. నెత్తుటి రుతుపవనాలు. దీర్ఘ కవితలు: 1. ముఫ్పయి వసంతాాలు ముఫ్పయి శిశిరాల మీదుగా, 2. చరిత్ర రహదారుల్లో మొచిలిన పిచ్చి జిల్లేడు మొక్క, 3. కాసిని పద్యాల్ని మూటగట్టుకొని జిప్సీలా అతడు మనల్ని దాటిపోతాడు, 4. తెలంగాణా! ఈ యుద్ధ గానాన్ని ఆపొద్దు, 5. అతడు సామాన్యుల ప్రవక్త, 6. ఈ మౌనం ఖచ్చితంగా యుద్ధనేరమే, 7. తెలంగాణా! నీ గాయాలు వర్థిల్లనీ, 8. కొన్ని సీతాకోక చిలుకలు ఎగరగలవు. 9. ఇదేదో చాటుమాటు వ్యవహారమే. అనువాదాలు: 1. నైరుతి రుతుపవనాల కాలమిది, 2. తుఫానులకెదురు నడవరా! , 3. దఓిణ తూర్పు పవనాలతో ముఖాముఖం, 4. గంధకపు వాగొడ్డు ముసలోడా! నువు చెప్పిందే నిజం.
పుట్టింది విజయవాడ. కవి. నాగార్జున విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ (కామర్స్)పూర్తి చేశారు. ప్రస్తుతం దూరవిద్య ద్వారా ఎంఏ (తెలుగు) చదువుతున్నారు. 2014 లో మిత్రులతో కలిసి "తీరం దాటిన నాలుగు కెరటాలు" పేరుతో ఒక సంకలనం తెచ్చారు. రచనలు : 'ఎనిమిదో రంగు' (2017), 'స్పెల్లింగ్ మిస్టేక్' (2019)అనే కవితా సంకలనాలు ప్రచురించారు. వెబ్ మ్యాగజైన్ 'రస్తా'లో దివంగత రచయితల మీద 'స్మరణ' అనే కాలమ్ రాస్తున్నారు. ప్రస్తుతం ఓ ప్రయివేట్ సంస్థలో అక్కౌంట్స్ విభాగంలో పని చేస్తున్నారు.
పుట్టింది వరంగల్ జిల్లా హన్మకొండ. కవి, రచయిత. విద్యాభ్యాసం వరంగల్‌లో. బాల్యం నుంచే సాహిత్య- ఉద్యమాల ఆసక్తితో నాటి 'జై తెలంగాణ' ఉద్యమం మొదలు, మొన్నటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు వివిధ సాహిత్య, ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక ఉద్యమాలతో మమేకమవుతున్నారు. 12 స్వీయ రచనల గ్రంథాలు, 18 కు పైగా వివిధ సంకలనాలకు సంపాదకత్వం వహించారు. 'రుద్రమ ప్రచురణలు' 2012 నుండి నిర్వహిస్తున్నారు. గత దశాబ్ద కాలంగా 'ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక' లో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
కథా రచయిత, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్, స్క్రిప్ట్ రైటర్, ఆడియో ప్రెసెంటేటర్, వాయిస్ ఆర్టిస్ట్, వ్లాగ్ మేకర్. కాకతీయ యూనివర్సిటీ నుంచి కామర్స్ లో మాస్టర్స్ చదివారు. 150 కవితలు, పది కథలు రాశారు. వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. మిత్రులతో కలసి 'పొయ్యిరాళ్లు' పేరుతో ఛానెల్ ప్రారంభించారు. నాలుగు షార్ట్ ఫిల్మ్స్ రాసి దర్శకత్వం వహించారు. ఫైనాన్షియల్ సెక్టర్ లో జోనల్ మేనేజర్ గా పనిచేశారు. ప్రస్తుతం హన్మకొండలో ఉంటున్నారు.
కవయిత్రి. కథా రచయిత. కృష్ణాజిల్లా కేసరపల్లి గ్రామం. కవిత్వం, కథలంటే ఆసక్తి. వివిధ వెబ్ పత్రికల్లో కవిత్వం రాస్తున్నారు.
పుట్టింది పోతారం, హుస్నాబాద్ మండలం, సిద్ధిపేట జిల్లా. కవి, రచయిత. పంచాయతీరాజ్ శాఖలో సీనియర్ సహాయకుడు. రచనలు తొవ్వ, నడక, మంకమ్మతోట లేబర్ అడ్డా, వరి గొలుసులు, బువ్వకుండ(దీర్ఘకవిత)లాంటి కవితా సంకలనాలు ప్రచురించారు. వివిధ పుస్తకాలకు సంపాదకత్వం వహించారు.
పుట్టింది బెజవాడలో. కవయిత్రి, రచయిత్రి. జర్నలిస్టు. కొంతకాలం పాటు పిల్లలకు హిందీ పాఠాలు బోధించారు. వివిధ పత్రికల్లో 12ఏళ్లపాటు ప్రూఫ్ రీడర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. 2008 నుంచి ఆల్ ఇండియా రేడియోలో క్యాజువల్ అనౌన్సర్ గా పనిచేస్తున్నారు.
పూర్తి పేరు మహమ్మద్ అమ్జద్ అలి. స్వస్థలం ఖమ్మం. ఖమ్మం గవర్న్మెంట్ కాలేజీలో డిగ్రీ చదివారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ భోపాల్ విశ్వవిద్యాలయం నుంచి ఎమెస్సి, ఎమ్మే, ఎఎల్ బి. మైసూర్ నుంచి సెరికల్చర్ డిప్లోమా. వృత్తిరీత్యా సౌది అరేబియాలో గత ముప్పయ్ ఐదేండ్లకు పైగా ఉంటున్నారు. ప్రస్తుతం కింగ్ అబ్దుల్ అజీజ్ యూనివర్సిటీ జెద్దా, ప్రాజెక్ట్స్ డిపార్ట్మెంట్ లో లీడ్ ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్ట్ /సీనియర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు.
తెలుగు చదవడం, రాయడం చిన్ననాటి నుంచే హాబీగా ఉంది. మొదట్లో కవితలు, తర్వాత కథలు, నవలలు ఆ తర్వాత అనువాదాలు (ఇంగ్లీష్, హింది, ఉర్దూ భాషలలోనుంచి కథలు), సాహిత్య, రాజకీయ వ్యాసాలు రాస్తున్నారు. ఇంతవరకు రెండు నవలలు, ఒక కథా సంకలనం, కవితా సంకలనం, ఉర్దూలోనుంచి అనువదించిన కథా సంకలనం, ప్రపంచ భాషల నుంచి కథా సంకలనం ప్రచురితమయ్యాయి.
"నెత్తురోడుతున్న పదచిత్రం", "కవిత్వంలో ఉన్నంతసేపూ...." అనే రెండు కవితా సంపుటల వయసున్న కవి. సామాజిక వ్యాఖ్యానం, యాత్రా కథనాల్లోనూ వేలు పెట్టే సాహసం చేస్తుంటాడు.
కర్నూలు జిల్లా, ఆలూరు మండలం మొలగపల్లిలో నిరుపేద దళిత కుటుంబంలో 1955 జూలై 1న పుట్టిండు. ఆయన అసలు పేరు సత్యం. విప్లవ సాంస్కృతిక ఉద్యమంలో భాగంగా అరుణోదయ రామారావుగా పరిణామం చెంది పాటకు పర్యాయ పదంగా నిలిచిండు. చివరి శ్వాస వరకు ప్రజా కళలను ప్రజల కోసం దేశంలో విస్తృతంగా ప్రచారం చేయడంలో అరుణోదయ సాంస్కృతిక సేనానిగా ముందుకు నడిచిండు. హైదరాబాదులో మే 5, 2019న గుండె పోటుతో చనిపోయిండు.
పుట్టింది కరీంనగర్ జిల్లా, జగిత్యాల. కవి, చిత్రకారుడు. ఫొటో గ్రాఫర్. విరసం సభ్యుడు. జగిత్యాల జైత్రయాత్ర వెల్లువలో విప్లవోద్యమాన్ని ప్రేమించాడు. 1979లో విప్లవ రచయితల సంఘంలో సభ్యుడయ్యాడు. అద్భుతమైన సాహితీ సృజనచేసి, తెలుగు సాహిత్యంపై చెరగని ముద్రవేశాడు. రచనలు : ఎర్ర పావురాలు (1977), మంటల జెండాలు (1979), చురకలు (1981), రక్త రేఖ (1985), సంక్షోభ గీతం (1990), సిటీ లైఫ్ (1992), మరణం నా చివరి చరణం కాదు. తీవ్ర అనారోగ్యంతో 1993 జనవరి 12న చనిపోయాడు.
పుట్టింది గాజుల పల్లి, మంథని తాలూకా, కరీంనగర్ జిల్లా. నవలలు: 'కొలిమంటుకున్నది', 'ఊరు', 'అగ్నికణం', 'కొమురం భీమ్'(సాహుతో కలసి), 'వసంత గీతం', 'టైగర్ జోన్'. కథా సంపుటాలు : 'సృష్టికర్తలు', 'తల్లి చేప', 'అతడు'. 100కు పైగా కథలు, కొన్ని కవితలు, పాటలు, వ్యాసాలు, అనువాదాలు, 4 నాటకాలు రాశారు. 1979 నుంచి విప్లవ రచయితల సంఘంలో సభ్యుడిగా కొనసాగుతున్నారు.
పుట్టింది చారకొండ (పాలమూరు). పెరిగింది అజ్మాపూర్ (నల్లగొండ). సామాజిక శాస్త్ర విద్యార్థి, ప్రజా ఉద్యమాల మిత్రుడు. అమెరికాలో అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా పనిచేస్తున్నాడు.
పత్రికా రచయిత, కవి. స్వగ్రామం-కడవెండి. ఉస్మానియాలో వృక్షశాస్త్రం, తత్వశాస్త్రం లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. వృత్తి- ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సమ్మక్క సారక్క తాడ్వాయి, ములుగు జిల్లా. సామాజిక సాహిత్య విద్యా పాఠశాల గా నడిపించే దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు. తెలంగాణ ఇంటర్ విద్య గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. సామాజిక కార్యకర్తగా, పోటీ పరీక్షల శిక్షకుడిగా పని చేస్తున్నారు.
పుట్టింది సిరిసిల్ల. తొమ్మిదో తరగతి వరకు చదివారు. కవి, నేత కార్మికుడు. పవర్ లూమ్ నేత వృత్తి కార్మికుడిగా పని చేస్తూ కవిత్వం రాస్తున్నారు. రచనలు: 1. 'రాత్ పైలీ దివస్ పైలీ', 2. 'సిరిసిల్ల నానీలు' కవితా సంపుటాలు ప్రచురించారు. 'కామ్ గార్' కవిత్వం త్వరలో రానుంది.
కడప జిల్లా. కవయిత్రి, కథా రచయిత. ఎం.ఏ., ఎం.ఏ., ఎంఇడి., ఎల్.ఎల్.బి., పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చదివారు.
రచనలు : చెదిరిన పిచ్చుక గూడు (కథాసంపుటి), మా తుఝే సలాం (కథా సంపుటి), అనువాదాలు : అమలు కాని హామీల చరిత్ర, తలకిందులలోకం, హలో బస్తర్. కవితలు, పుస్తక పరిచయాలు, అనువాదాలు. కొన్ని వ్యాసాలు.
పుట్టిన ఊరు కొల్లాపూర్ - వరిదేలవీధి(1960లో), ఇప్పటి నాగర్ కర్నూల్ జిల్లా. నేపథ్యం: దోయబడ్డ బాల్యం, కష్టాలు కన్నీళ్లు, ఆకలి అవమానాలే తోబుట్టువులు. చెమట సౌరభాల మడి అమ్మవడే బడిగా... తలాపున నల్లమల అడవే ఆట మైదానంగా... ఎలుగెత్తి పారే కృష్ణా నది చేతికందే దూరంలో ఉండీ గొంతు తడవని దాహంతో ఏళ్లకేళ్లు కురవని మేఘాలతో పరుగు తీసే మేకలతో, చెట్టు పుట్టలతోచెట్టా పట్టాలేసుకు సాగిన సాహచర్యం. వృత్తి: న్యాయవాదం. ప్రవృత్తి : సాహిత్య అధ్యయనం. 1978 నుండి కవిత్వం, పాట, వ్యాసం, కథా, చిత్ర, నాటిక రచన, నటన. రచనలు : 1. 'స్పందన'( కవితా సంకలనం) 1985 గద్వాల్ విరసం రాష్ట్ర సభల్లో ఆవిష్కరణ. 2. 'సేద్యం' (కవితా సంకలనం), 3. 'కఫన్' (కథా సంకలనం), 4. సాంగ్ ఆఫ్ ఫర్రోస్ (కవిత్వం) ( ఆంగ్లానువాదం: అర్విణి రాజేంద్రబాబు గారిచే), 5. 'రాహేc', 6. 'జాబిలి ఖైదు', 7. 'దగ్ధ స్వప్నం' (కవితా సంకలనాలు ప్రచురించారు.)
పుట్టింది ఖమ్మం జిల్లా. రాజకీయ విశ్లేషకుడు, వక్త, ఎమర్జెన్సీలో విప్లవ రాజకీయ రంగప్రవేశం. 1977-81 మధ్య ఎమర్జెన్సీ తర్వాత రాష్ట్ర విప్లవ విద్యార్థి ఉద్యమ (పీడీఎస్ యూ) నిర్మాతల్లో ఒకరు. 1981లో ఏలూరు జూట్ మిల్ కేంద్రంగా విప్లవ కార్మికోద్యమ ప్రవేశం. 1991లో నెల్లిమర్లలో జరిగిన చారిత్రాత్మక జూట్ కార్మికోద్యమాన్ని నిర్మించారు. ప్రస్తుతం విజయవాడ కేంద్రంగా ఇఫ్టూ జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
ముచర్ల గ్రామం, ఖమ్మం జిల్లా. 2014 నుంచి కవిత్వం రాస్తున్నారు. 'ఇప్పుడేది రహస్యం కాదు' కవితా సంపుటి ప్రచురించారు. 2019 విమల శాంతి పురస్కారం, 2019 ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం అందుకున్నారు.
జననం: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల. విశ్రాంత ఆంగ్లోపన్యాసకుడు. కవితా సంకలనాలు: పాట సంద్రమై(2008), కాలిబాట(2014), నదిలాంటి మనిషి(2018). కథా సంకలనాలు: అమ్మను చూడాలె(2006), ఆఖరి కుందేలు(2011), దోసెడు పల్లీలు(2017). నాటకం: నేను గౌరీ(2017).
విజయవాడ. వృత్తి రీత్యా ఎల్ఐసిలో Administrative Officerని. పుస్తకాలు చదవడం ఇష్టం. నచ్చిన భావాలను స్నేహితులతో పంచుకోవడం ఇష్టం. ఏ ఇజాన్నీ అనుసరించలేక పోవడం, ఏ చట్రం లోనూ ఇమడ లేక పోవడం. నా బలం నా బలహీనతా ఇవే.
కడవెండి, జనగామ జిల్లా. ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు. సామాజిక, రాజకీయార్థిక విశ్లేషకుడు.
సాహిత్య విమర్శకుడు. తెలుగు కన్నడ రాష్ట్రాల్లో ముప్ఫై ఏదేళ్లపాటు సంస్కృతం – తెలుగు పాఠాలు చెప్పి రిటైర్ అయ్యారు. ‘తెలుగులో మాండలిక కథాసాహిత్యం’ పై పరిశోధన చేసి అదే పేరుతో ప్రచురించారు. స్త్రీ వాద కథలు, నిషేధ గీతాలు, డక్కలి జాంబ పురాణం, రెండు దశాబ్దాలు కథ , జానపద చారిత్రిక గేయగాథలు, బయ్యారం ఖ ‘నిజం’ ఎవరిది?, కన్నీటి సాగరాలొద్దురా మల్లన్నా, నోబెల్ కవిత్వం, అదే నేల (ముకుందరామారావు), తొవ్వ ముచ్చట్లు (జయధీర్ తిరుమల రావు ), యుద్దవచనం (జూలూరి గౌరి శంకర్), పాపినేని శివశంకర్ కథలు, తాడిగిరి పోతరాజు కథలు, రాయలసీమ : సమాజం సాహిత్యం (బండి నారాయణస్వామి), బహుళ - సాహిత్య విమర్శ : సిద్ధాంతాలు, ప్రమేయాలు, పరికరాలు (పర్స్పెక్టివ్స్), 50 యేళ్ల విరసం : పయనం - ప్రభావం … వంటి పుస్తకాలకి సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ‘వేమన దారిలో’ పేరున ఎంపిక చేసిన వేమన పద్యాలకు వ్యాఖ్యానం చేసారు. ‘సమకాలీనం’ పేరుతో కథా విమర్శ పై వ్యాస సంపుటి వెలువరించారు. ప్రగతిశీల ఉద్యమ సాహిత్యాన్ని ప్రేమించే ప్రభాకర్ అస్తిత్వ ఉద్యమాలు శకలాలుగా కాకుండా ఏకోన్ముఖంగా సాగుతూ అంతిమంగా పీడిత జన విముక్తికి దారి తీయాలని కోరుకుంటున్నారు.
జననం: కరీంనగర్ జిల్లా గోదావరి లోయ ప్రాంతం. అసలు పేరు ఎం. శ్రీనివాసరావు. ఎంఎస్ఆర్, కరుణాకర్, ప్రభాకర్ అనే కలం పేర్లతో రచనలు చేశాడు. ఇంజనీరింగ్ చదివేటపుడు విప్లవ సాహిత్య సాంస్కృతికోద్యమానికి చేరువయ్యాడు. హైదరాబాద్ లోని వాసవీ ఇంజనీరింగ్ కాలేజీలో బి.ఇ ఎలక్ట్రానిక్స్ రెండో సంవత్సరంలో విప్లవోద్యమంలోకి పూర్తికాలం కార్యకర్తగా వెళ్లాడు. పటాన్ చెరు పారిశ్రామిక వాడల్లో విప్లవకారుడిగా కార్మికోద్యమ నిర్మాణం చేశాడు. 3 సెప్టెంబర్, 1992న పోలీసులు పట్టుకొని కాల్చిచంపారు. తాను డైరీలో రాసుకున్న కవితలు, సినిమా రివ్యూలు, జ్ఞాపకాలను విరసం 'కాగడాగా వెలిగిన క్షణం' పేరుతో పుస్తకం ప్రచురించింది.
పుట్టింది చిత్తూరు జిల్లా మదనపల్లె దగ్గర బురుజు మాదిగపల్లె. కథా రచయిత్రి. వ్యవసాయ కూలీ కుటుంబం. ప్రధాన వృత్తి వ్యవసాయం. రచనలు వీరి వ్యావృత్తి. ముప్పై కథలతో 'ఎదారి బతుకులు' కథా సంపుటి ప్రచురించారు. ఇప్పటివరకు అరవై కథలు రాశారు. గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 'నవోదయం' మాస పత్రిక నిర్వహిస్తున్నారు.
పుట్టింది వరంగల్ జిల్లా రాజారం. కవి, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు, పత్రికా రచయిత, వక్త, రాజకీయార్థిక శాస్త్ర విద్యార్థి, తెలుగు రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక వీక్షణం సంపాదకుడు.
రచనలు: 'సమాచార సామ్రాజ్యవాదం', 'కల్లోల కాలంలో మేధావులు - బాలగోపాల్ ఉదాహరణ', 'అమ్మకానికి ఆంధ్రప్రదేశ్', 'కథా సందర్భం', 'కడలి తరగ', 'పావురం', తెలంగాణ నుండి తెలంగాణ దాకా, విచ్ఛినమవుతున్న వ్యక్తిత్వం, 'పోస్ట్‌మాడర్నిజం', 'నవలా సమయం', 'రాబందు నీడ', 'కళ్లముందటి చరిత్ర', 'పరిచయాలు', 'తెలంగాణ - సమైక్యాంధ్ర భ్రమలు, అబద్ధాలు, వాస్తవాలు', 'శ్రీశ్రీ అన్వేషణ', 'లేచి నిలిచిన తెలంగాణ', 'ప్రతి అక్షరం ప్రజాద్రోహం - శ్రీకృష్ణ కమిటీ నివేదిక', 'రాబందు వాలిన నేల', 'ఊరి దారి- గ్రామ అధ్యయన పరిచయం', 'విద్వేషమే ధ్యేయంగా విశాలాంధ్ర మహారభస', 'కవిత్వంతో ములాఖాత్', 'సమాజ చలనపు సవ్వడి', 'కాషాయ సారం', 'విద్వేషాపు విశ్వగురు', 20కి పైగా అనువాదాలు.
సంపాదకత్వం: 'Fifty Years of Andhrapradesh 1956-2006', 'Telangana, The State of Affairs', '24గంటలు', 'హైదరాబాద్ స్వాతంత్య్ర సంరంభం', 'జన హృదయం జనార్దన్', 'సమగ్ర తెలంగాణ' పుస్తకాలకు సంపాదకత్వం వహించారు.
పుట్టింది జనగామ జిల్లా నర్మెట్ట. పలు సామాజిక ఉద్యమాలతో మమేకమై పనిచేస్తున్నరు. వృత్తి రిత్యా సైన్స్ స్కూల్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా జనగామ పట్టణంలో పనిచేస్తున్నారు.
పుట్టిన ఊరు పెద్దపొర్ల, నారాయణపేట జిల్లా. విద్యార్థి సంఘ నాయకుడు. బీఎడ్, పీజీ (జర్నలిజం) చదివారు.
దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా హక్కుల రంగంలో పని చేస్తున్నారు. మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడుగా ఉన్నారు. డిగ్రీ కాలేజీలో ఆంగ్ల ఉపన్యాసకుడిగా పని చేశారు. వరంగల్ నివాసి. ప్రస్తుతం హైదరాబాదు లో ఉంటున్నారు.
పుట్టింది హన్మకొండ మండలం ఇనుగుర్తి. " గ్లోబల్ ఖడ్గం" సంకలనానికి సహ సంపాదకత్వం (2001), "దుఃఖానంతర దృశ్యం" కవితా సంపుటి (2014), ఈ కవితా సంపుటికి రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం లభించింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు.
కవి, రచయిత. పుట్టింది శ్రీకాకుళం జిల్లాలో బడగాం అనే మారుమూల పల్లె వ్యవసాయ కుటుంబంలో. చదువు: M.A.(English), M.A.(Telugu), B.Sc., B.Ed. వృత్తి: ఉపాధ్యాయ వృత్తి. రచనలు: 1) వలస పక్షుల విడిది - తేలినీలాపురం (2005) 2) కొంగా! నా గోరు మీద పువ్వెయ్యవా...(నానీ సంపుటి) (2010). ఇంకా వివిధ పత్రికల్లో వందకు పైగా వచన కవితలు, కొన్ని సాహితీ వ్యాసాలు, సమీక్షా వ్యాసాలు ప్రచురించబడ్డాయి. గత రెండు దశాబ్దాలుగా సాహిత్యంతో అనుబంధం.
కరీంనగర్ పట్టణంలో నివాసం. చేనేత జౌళి శాఖ లో ఉప సంచాలకులు గా పని చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. హైదరాబాద్ విశ్వ విద్యాలయం నుండి MA; MPhil. చెరబండరాజు నవల మీద MPhil, కట్టెపలక కవిత సంపుటి వెలువడింది. సాహిత్యం అధ్యయనం, కవిత్వం, వ్యాస రచనా, సాహిత్యంలో సమాజం అభిమాన విషయాలు.
మహిళా సంఘం కార్యకర్త. ఉపాధ్యాయిని. పుట్టిన ఊరు విశాఖపట్నం. ప్రభుత్వ ఉపాధ్యాయినిగా పనిచేసి, రాజీనామా చేశారు. నలభై రెండేళ్లుగా మహిళా సంఘం కార్యకర్తగా పనిచేస్తున్నారు. మహిళల సమస్యలపై పనిచేయడం వలన కలిగిన అనుభవాలను రికార్డ్ చేస్తున్నారు.
పుట్టింది కర్నూలు. కవయిత్రి, కథా రచయిత, అధ్యాపకురాలు. శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ నుంచి ఎం.ఏ(తెలుగు), ఎం.ఫిల్ (కళ్యాణసుందరీ జగన్నాథ్ కథలు - ఒక పరిశీలన), ఎం.ఈడీ(అన్నామళై యూనివర్సిటీ) చదివారు. వివిధ పత్రికల్లో కవితలు, కథలు ప్రచురితమయ్యాయి. 13కథలు రేడియోలో ప్రసారమయ్యాయి. ప్రస్తుతం కర్నూలులో ఓ ప్రైవేట్ పాఠశాలలలో ప్రధానోపాధ్యాయినిగా పనిచేస్తున్నారు.
పుట్టింది విశాఖపట్నం. చదువు ఎం. ఏ. ఇంగ్లిష్. విశ్లేషణాత్మక వ్యాసాలు, కథ, నవల, సినిమాలపై సమీక్షలు రాస్తున్నారు.
చిత్తూరు జిల్లా మదనపల్లె. అసలు పేరు డా. డి. శ్రీనివాసులు. తెలుగు అధ్యాపకుడు. వాల్మీకి పురం(వాయల్పాడు) ఎన్టీయార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు.
జననం: గుంటూరు జిల్లా, తెనాలి. నివాసం : హైదరాబాద్. ఎం.ఏ (హిందీ), ఎం. ఏ(ట్రాన్సలేషన్ స్టడీస్ ఇన్ హిందీ), బీఈడీ. 'జైనేంద్ర కుమార్ నవలల్లో స్త్రీ పాత్రల మనో వైజ్ఞానిక చిత్రణ' అంశంపై ఎం.ఫిల్ చేశారు. 'కృష్ణా సొబతి& మమతా కాలియాల కథా సాహిత్యంలో స్త్రీ ల జీవితాలు' అంశంపై పీహెచ్‌డీ(ఉస్మానియా యూనివర్సిటీ) చేస్తున్నారు. సొంత రచనలు : 1. పోరాడితేనే రాజ్యం, 2. ముగింపు మాటలా ..., 4. అభాగ్య జీవనాల భాగ్య నగరం. అనువాదాలు : 1. వైజ్ఞానిక భౌతికవాదం (రాహుల్ సాంకృత్యాయన్ ), 2. మధు పురి (రాహుల్ సాంకృత్యాయన్).
రాయటం కన్నా చదవటం ఇష్టం. రాయాలన్న తపన ఉంది. ఇంట్లో కాని, వీధిలో కాని తగిన ప్రోత్సాహం లేక రాసినవి కూడా దాసుకున్న.
వృత్తి, ప్రవృత్తి పిల్లల కు పాఠాలు చెప్పటం, వాళ్ళు చెప్పే కబుర్లు, జోక్స్, పాటలు ఎంజాయ్ చేయటం.
ప్రకాశం జిల్లా పౌరహక్కుల, ఉపాధ్యాయ, గుళ్ళకమ్మ రచయితల, చైతన్య మహిళ సంఘం జిల్లా బాధ్యురాలిగా కొంత కాలం.
రచనలు:- అరుణతార లో వాడగోడు (యదానిక), దేవరగద్దె, నెత్తుటి నీరెండకు చేయడ్డు పెట్టుకొని కథలు, అర్ధరాత్రి ప్రయాణికుడు, పృథ్వి అమ్మల కోసం వచ్చేయి కవితలు, శ్రీపాద, కన్నగి మొదలగు పుస్తకాల పరిచయం.
మాతృక లో, కలల్ని ఇంకిపోనియ్యకు కథ, వృత్తి కి సంబంధించిన కొన్ని స్కిట్లు, పాటలు.
మహిళా మార్గం లో ఓ గల్పిక, ఓ కవిత, ఓ కథ.
'ఆమె చూపు ఎర్రజెండా వైపే', వేటపాలెం వెంకాయమ్మ జీవితం పుస్తకం. రెడీగా ఉన్న మరో మూడు కథలు.
నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగారు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలుగు సాహిత్యంలో పిఎచ్.డి చేశారు. సాహిత్యం, సామాజిక శాస్త్రాల అధ్యయనంలో, ముఖ్యంగా సాహిత్య విమర్శలో ఆసక్తి. మిత్రులతో కలిసి "చూపు" పత్రికను కొంతకాలం నిర్వహించారు. సాహిత్య, సాహిత్యేతర గ్రంథాల అనువాదం, రచన వంటి అంశాల్లో కృషి చేస్తున్నారు.
కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28 పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.
కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28 పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.
కాకినాడలో నివాసం. వృత్తి రీత్యా వైద్యురాలు. రంగరాయ మెడికల్ కాలేజీ లో ఫాకల్టీగా పనిచేస్తున్నారు. 'నవ నవలా నాయికలు' పుస్తకం లో రాసిన వ్యాసంతో మొదటి సారి అచ్చు లోకి అడుగు పెట్టారు. 'చినుకు' మాసపత్రిక, 'కౌముది', 'సారంగ', 'సంచిక' వెబ్ మాగజైన్స్, 'విపుల'లో కథలు ప్రచురితమయ్యాయి. అమెజాన్ లో "Interludes" అనే నవలిక (ఇంగ్లీషు) ఉన్నది. మానవ జీవితంలోని వైరుధ్యాల మధ్య దూరం తగ్గించే మార్గంలో కథ పాత్రలను అన్వేషించే ప్రయత్నంలో ఉన్నారు.
జననం: రంగారెడ్డి జిల్లా. సాహిత్య విద్యార్థిని, కథా రచయిత్రి. 'శతపత్ర మంజరి' అనే కలం పేరుతో రచనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎనిమిది కథలు రాశారు. బీబీసీలో ఫ్రీలాన్సర్. పరిశోధన: 'నవల - కథానిక' అనే అంశంపై. తెలుగు లెక్చరర్ గా పనిచేస్తున్నారు.
పుట్టినదీ, పెరిగినదీ, చదువుకున్నదీ హైదరాబాదు లో. 'వచన కవితా పితామహుడు' కుందుర్తి ఆంజనేయులు గారి మనవరాలు. ఫ్రీవెర్స్ ఫ్రంట్ బాధ్యతను కొనసాగించిన కుందుర్తి సత్యమూర్తి గారి కూతురు. బాల్యం నుంచీ ఫ్రీవెర్స్ ఫ్రంట్ పురస్కార సమావేశాలకు వెళ్ళటం, ప్రముఖులైన కవులతో, వారి పుస్తకాలతో సంబంధబాంధవ్యాల వలనా, కవిత్వం రాయాలనే తపనతో గత కొంతకాలంగా కవిత్వం రాస్తున్నారు. పదిహేను వరకూ వివిధ అంతర్జాల పత్రికలలో ప్రచురితమయ్యాయి. M.Com, MBA, PGDCA చదివారు. ప్రస్తుతం సింగపూర్ లో నివాసం. migrant workers welfare కోసం పని చేసే ఒక NGO లో పని చేస్తున్నారు. రంగవల్లికలు వేయడం, బొమ్మలు గీయడం, పెయింటింగ్ హాబీలు. త్వరలో తొలి వచన కవితా సంపుటి వస్తోంది.
కవయిత్రి, కథా రచయిత్రి. నగర జీవనంలో స్త్రీల సంఘర్షణల్ని కథల్లోకి తీసుకువచ్చారు. తొమ్మిది కథల సంపుటాలు, మూడు నవలలు, ప్రేమ లేఖలు, మ్యూజింగ్స్ వెలువరించారు. 'వార్త' దినపత్రికలో దశాబ్దకాలం పాటు 'మైదానం' కాలమ్ నిర్వహించారు. రచనలు: మనసుకో దాహం, సాలభంజిక, మంచుపూల వాన, వాన చెప్పిన రహస్యం, 'మసిగుడ్డ', 'ముక్త', 'ఇన్స్టంట్ లైఫ్', ద లాస్ ఆఫ్ యిన్నోసెన్స్, కుప్పిలి పద్మ కథలు, ముక్త, మంత్రనగరి సరిహద్దుల్లో, పొగమంచు అడివి, 'నెమలీకలు పూసే కాలం' (కవిత్వం), 'మంత్రనగరి సరిహద్దుల్లో (ప్రేమ కథలు), 'పొగమంచు అడవి', 'మోహనదీ తీరంలో నీలి పడవ' (కవిత్వం) సంకలనాలుగా వచ్చాయి.
పుట్టింది వడ్డిచర్ల, జనగామ జిల్లా. నెల్లుట్లలో పెరిగాడు. జనగామలో సదివిన మట్టి పెడ్డ. వరంగల్లు నగరంలో వలస బతుకు మనుగడ. ఉపాధ్యాయ బోధన విద్యలో నల్లబల్ల మీద అక్షరాలకు అభద్ర కూలీ గొంతుకవుతాడు. చాయ్ నీళ్లు లేకున్నా సాహిత్య సాన్నిహిత్యాన్ని కోరుకుంటాడు. కవి, రచయిత, జర్నలిస్ట్, పరిశోధకుడు, అధ్యాపకుడు. ప్రముఖ తెలుగు పత్రికల్లో పాత్రికేయుడిగా పని చేశాడు. ప్రస్తుతం ఉస్మానియా యునివర్సిటీలో 'తెలుగు సాహిత్యంలో చేనేత వృత్తి జీవనచిత్రణ'పై పరిశోధన చేస్తున్నాడు.
జననం: విజయనగరం జిల్లా పార్వతీపురం. విరసం సభ్యుడు. తనను తాను వ్యక్తీకరించుకునే సాధనంగా కవిత్వం తన జీవితంలో భాగంగా మారిందని నమ్మిన కవి. ఇప్పటివరకు 'వెన్నెలదారి', 'రెప్పల వంతెన', 'కాగుతున్న రుతువు' కవితా సంపుటాలు వచ్చాయి.
స్వగ్రామం మద్దికుంట, కరీంనగర్ జిల్లా. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంఏ(తెలుగు సాహిత్యం). అచ్చయిన తొలి రచన: "మన జాతికే వెలుగంట(కవిత). రచనా ప్రక్రియలు: పద్యం, వచన కవిత్వం , వ్యాసం, పాట, కథ, నానీలు. ముద్రితాలు: 1."మేలుకొలుపు"వచన కవితాసంపుటి, 2. చదువులమ్మ శతకం, 3.పల్లె నానీలు, 4."ఎర్రగాలు వచన కవిత్వం. 5."ఆరుద్ర పురుగు"వచన కవిత్వం. సంపాదకత్వం: 1."నల్లాలం పూలు(బడి పిల్లల కవిత్వం) 2."సోపతి" ఎన్నీల ముచ్చట్లు ఐదేండ్ల పండుగ. 3."ఎన్నీల ముచ్చట్లు"కవితా గాన సంకలనాలు -10. ప్రస్తుతం తెలుగు భాషోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.
కవి, రచయిత. జర్నలిస్ట్, సామాజికోద్యమాల కార్యకర్త. ట్రెయినర్, అకడమిక్ కౌన్సిలర్, సామాజిక తత్వవేత్త.
పుట్టింది కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా). కవయిత్రి, అధ్యాపకురాలు. ఎం.ఏ, ఎం.ఎడ్ చదివారు. పాలకుర్తి (జనగామ జిల్లా) సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పి.జి.టిగా పనిచేస్తున్నారు.
జననం: కార్మూరివారి పాలెం, గుంటూరు జిల్లా. 1967 నుంచి వివేకవర్ధిని డిగ్రీ కళాశాల(హైదరాబాద్)లో ఆంగ్లోపన్యాసకులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. రచనలు: 'రక్తం సూర్యుడు', 'ఆసుపత్రి గీతం', 'మోహనా ఓ మోహనా', 'అంతర్జనం'... 25 కవితా సంకనాలు ప్రచురించారు. 1970-72మధ్య రెండేళ్ల పాటు 'వేకువ' అనే సాహిత్య పత్రిక నడిపారు. కేంద్ర సాహిత్య అకాడమీ, సరస్వతీ సమ్మాన్ అవార్డులు పొందారు.
రచయిత్రి, అనువాదకురాలు. ఇండిపెండెంట్ జర్నలిస్ట్, సంపాదకురాలు. మహిళా ట్రాన్స్ జెండర్ సంఘాల ఐక్య కార్యాచరణలో భాగంగా బాధిత సమూహాల హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు. పర్యావరణ విధ్వంసానికి దారితీసే యురేనియం, వ్యవసాయ విధానాల వంటి సమకాలీన రాజకీయ అంశాలపై మహిళలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు ఎదుర్కుంటున్న వివిధ సమస్యలపై నాలుగు దశాబ్దాలుగా ఉద్యమిస్తున్నారు. ఆయా సమస్యలపై వివిధ పత్రికలలో కాలమిస్టుగా విస్తృతంగా వ్యాసాలు రాస్తున్నారు. వాటిని 'ప్రవాహం', 'రైతుల ఆత్మహత్యలు-మనం’ పేరిట రెండు సంకలనాలుగా ప్రచురించారు. స్త్రీలు ఎదుర్కుంటున్న ఆరోగ్య సమస్యలపై 'సవాలక్ష సందేహాలు' పుస్తకానికి కె.లలితతో, 'స్త్రీవాద రాజకీయాలు - వర్తమాన చర్చలు' పుస్తకాన్ని ప్రొఫెసర్ రమా మెల్కోటెతో కలిసి సంపాదకత్వం వహించారు. భాషా సింగ్ రచించిన ‘UNSEEN’ పుస్తకాన్ని 'అశుద్ధ భారత్'గా, ప్రొఫెసర్ జంగం చిన్నయ్య పరిశోధనాత్మక రచన ‘DALITS AND THE MAKING OF MODERN INDIA' ని 'ఆధునిక భారతదేశ నిర్మాణంలో దళితులు' పేరిట తెలుగులోకి HBT కోసం అనువదించారు. 'కేరింగ్ సిటిజెన్స్ కలెక్టివ్' కమిటీ తరపున రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల జీవన భద్రత కోసం పని చేస్తున్నారు.
పుట్టింది నల్లగొండ జిల్లా. కవి, అధ్యాపకుడు. విరసం సభ్యుడు. రచనలు: 'లాంగ్ మార్ఛ్', 'దండకారణ్యం ఒక ఆకుపచ్చని కల'
కేతవరపు వేంకట రామకోటి శాస్త్రి 1931 డిసెంబర్ 26 న అప్పటి గుంటూరు జిల్లా రంగశాయపుర అగ్రహారంలో పుట్టారు. కన్నతల్లి తెలికేపల్లి వెంకమ్మ ,దత్తు తీసుకొని విద్యాబుద్ధులు చెప్పించిన తల్లి కేతవరపు సావిత్రమ్మ. హైస్కూల్ చదువు వినుకొండలో ఇంటర్మీడియేట్ గుంటూరు లో హిందూ కాలేజీలో చదివి కొంతకాలం సత్తెనపల్లిలో టీచర్ గా పనిచేసి అక్కడి నుండి విశాఖపట్నం వెళ్లి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బిఎ ఆనర్స్ పూర్తి చేసి 1954 లో గుడివాడ ANR కాలేజీలో లెక్చరర్ గా చేరారు . 1957 లో ఉద్యోగం మానేసి ఉస్మానియావిశ్వవిద్యాలయం లో బిరుదురాజు రామరాజుగారి పర్యవేక్షణలో తిక్కన కావ్యశిల్పంపై డాక్టరేట్ పట్టా పొందారు. 1960 నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకులు. 1968 లో వరంగల్లు పిజి సెంటర్ కు బదిలీ అయివచ్చి కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగువిభాగం అభివృద్ధికి నిలబడ్డారు. ఉద్యోగజీవితం మరో అయిదారు నెలల లో ముగుస్తుందనగా రోడ్డు ప్రమాదంలో 1991 అక్టోబర్ 28 న ఆయన జీవితమే ముగిసింది.
ఇంటర్మీడియట్ చదువ్వుతున్న కాలంలోనే ఆయనలో సాహిత్య సృజనవిమర్శన శక్తుల వికాసం మొదలైంది. జంధ్యాల పాపయ్యశాస్త్రి ప్రభావంతో పద్యాలు వ్రాయటం మొదలు పెట్టారు. విశ్వనాథ సాహిత్య అభిమాని అయినారు. మహాభారతం వంటి సంప్రదాయ సాహిత్యాన్ని ఎంత గాఢంగా అధ్యయనం చేశారో విశ్వనాథ రామాయణ కల్పవృక్షాన్ని ఎంత పారాయణ చేశారో ఆధునిక సాహిత్యాన్ని కూడా అంతశ్రద్ధగా చదివారు. 1968 లో వరంగల్లుకు తిరిగిరావటం ఆయన జీవితంలో పెద్ద మలుపు. అక్కడనుండి మార్క్సిస్టు తత్వశాస్త్ర అధ్యయనం , అవగాహన ఆయన సాహిత్య కృషిని విప్లవాత్మకంగా మార్చాయి. సమాజ సాహిత్య సంబంధాలగురించి రాజకీయార్థిక దృక్పథంతో చేస్తున్న చింతనను సంభాషణగా మార్చటానికి 1986-87 విద్యాసంవత్సరం లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ వారి జాతీయఉపన్యాస కార్యక్రమం ప్రాజెక్ట్ కింద దేశంలోని వివిధ విశ్వవిద్యా లయాలలో ప్రసంగించటానికి ఎంపిక అయిన సందర్భాన్నిచక్కగా ఉపయోగించుకున్నారు. అధ్యయనం, బోధన, విమర్శన, రచన ఆయన ఆచరణ. పరిశోధనలో నూతన సత్యాలకై అన్వేషించే జిజ్ఞాస ఆయనది. వందకు పైగా పరిశోధనా పత్రాలు ప్రచురించారు. మెదడులో సుళ్ళు తిరిగే ఆలోచనలను కాగితం మీద పెట్టి చూసుకొనటం సమానభావాలు, స్పందనా లక్షణం ఉన్న సాహిత్య జిజ్ఞాసువులైన స్నేహితులతో సంభాషణలో నిగ్గు తేల్చుకొనటం ఆయన ప్రవృత్తి.
ఆనందచేతన(1958), అంగహేల, శత్రుంజయము (1963) గీతాంజలి అనువాదం(1962) శాస్త్రి గారు బ్రతికిన కాలపు కవిత్వ రచనలు. ఆయన జీవితకాలంలో వచ్చిన విమర్శ గ్రంధాలు నైమిశము(1961), సమీక్షణ (1963) తిక్కన కావ్య శిల్పం ( 1973),భారతము- తత్వ దర్శనము (1976) తిక్కన హరిహరనాథ తత్వము (1976) పోతన్నగారి వైచిత్రి (1987).
మరణానంతర ప్రచురణలు- ఒకే ఇద్దరం (1996) చిచ్చేతన (2006) శ్రీకృష్ణ దూత్యము మరికొన్ని ముక్తకాలు- ఖండికలు( 2009) కవిత్వం. మళ్ళీ కన్యాశుల్కం గురించి (1992), నాటక విశ్లేషణ (1993), విశ్వనాథ వైఖరి( 1994),మహిళా సమాజవాడ సాహిత్యం (1995) అభ్యుదయవాద సాహిత్య విమర్శనా దృక్పథం (1996)కవిత్వం- సమాజం క్రిస్టోఫర్ కాడ్వెల్ విశ్లేషణ (1998) భారతీయ సాహిత్య శాస్త్రం - భిన్న దృక్పథాలు (1999)నాచన సోముడు (2000) తెలుగు కవిత ఉద్యమాలు (2001) భాషా సాహిత్యాలు - సామాజిక భావనలు (2002) పురాణేతిహాసాలు - విశేష విశ్లేషణలు (2003) సంఘర్షణ - సంవాదం (2004) దృష్టి - దృశ్యం (2005) కావ్య జిజ్ఞాస (2007)సాహిత్య సామాజికతా వాదం - కొన్ని ప్రతిపాదనలు (2008) ఒక రత్నము - ఒక మంత్రము , శృంగార నైషధ కావ్య జిజ్ఞాస( 2010) సాహిత్య సంభావన( 2011)శాస్త్రీయ సమీక్షలు - ముందుమాటలు( 2013) కవిత్వం : అనుభవం - అవగాహన( 2014) నవలాలోకనం (2015) విమర్శ గ్రంధాలు.
ప్రత్యామ్నాయ సాహితీ, సాంస్కృతిక ఉద్యమాలపట్ల ఆసక్తి. తత్వశాస్త్ర అధ్యాపకుడు. "దళిత ఉద్యమం, వెలుగునీడలు" (వ్యాససంపుటి), "పొలిటికల్ ఫిలాసఫీ ఆఫ్ అంబేద్కర్," థీయరిటికల్ అండర్ స్టాండింగ్ ఆఫ్ దళిత్ మూవుమెంట్" రచయిత. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తుంటాడు.
పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లాలోని సీతారామపురం. ఎం.ఏ ( పొలిటికల్ సైన్స్) చదివారు. రచయిత్రి, సోషల్ ఏక్టివిస్ట్. స్త్రీ వాద పత్రిక 'భూమిక' ఎడిటర్. 2000 లో తహసీల్దార్ ఉద్యోగానికి రాజీనామా చేసి భూమికలో పూర్తి కాలం పని చేస్తున్నారు. మహిళల కోసం 24/7 హెల్ప్ లైన్ (టోల్ ఫ్రీ నం # 18004252908) నడుపుతున్నారు.
‘మన మంచి పుస్తకం’ యూ ట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడు. హైదరాబాద్ హైకోర్టులో న్యాయవాద వృత్తిలో ఉన్నారు.
పుట్టింది హైదరాబాద్అ. బాల్యం , విద్యాభ్యాసం విజయవాడలో గడిచాయి. 1977 లో విజయవాడ మేరీ స్టెల్లా కాలేజీలో బి.ఎ. డిగ్రీ చదివారు. వృత్తిరీత్యా విలేకరి. ప్రవృత్తిరీత్యా సృజనాత్మక రచయిత్రి. ఒక వాదానికి బలమయిన ప్రతినిధిగా వస్తు వైవిధ్యంలోనూ, భావ గాంభీర్యంలోనూ ఒక ప్రత్యేక ముద్ర కోసం కృషి చేశారు. 1978 లో ఆంధ్రజ్యోతి పత్రిక సంపాదక శాఖలో కెరీర్ ప్రారంభించి దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ప్రచురణ , ప్రసార, అంతర్జాల మాధ్యమాల్లో సబ్ ఎడిటర్ , ప్రోగ్రామ్ ప్రెజెంటర్ , కంటెంట్ ఎడిటర్ స్థాయిలో పనిచేశారు. రచనలు: సందిగ్ధ సంధ్య (1988), నడిచేగాయాలు(1990), బాధా శప్తనది(1994), మల్టీనేషనల్ ముద్దు(2001), కథాసంపుటాలు: శత్రుస్పర్శ (1998), ఎచటికి పోతావీ రాత్రి(2019). 2000 లో అభివృద్ధి రంగంలో అడుగుపెట్టి ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ లో జండర్, అండ్ కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్ గా పని చేశారు. అన౦తరం అర్బన్ డెవలప్ మెంట్ , వెలుగు ప్రాజెక్టులకు న్యూస్ లెటర్ ఎడిటర్ గా, కొంతకాలం అధికార భాషా సంఘంలో వ్యవసాయ , పాలనా అంశాలకు సంబంధి౦చిన నిఘంటువు రూపకల్పనలో పాత్ర వహించారు. ప్రస్తుతం జండర్ సమాచార రంగాల్లో శిక్షకురాలుగా , పాఠ్యా౦శాల రచయితగా , అనువాదకురాలుగా వున్నారు. గ్రీన్ థాట్ పేరుతో thematic poetry వీడియోలు రూపకల్పన చేస్తున్నారు. కవుల కవిత్వంతో ఫోటోషాప్ , గ్రాఫిక్ బొమ్మలు visul poetry అనే వినూత్న ప్రక్రియ చేపట్టి కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు.
సూర్యాపేట. అధ్యాపకుడు. బీఎస్సీ, బీఈడీ. ఎంఏ(తెలుగు సాహిత్యం) చదివారు. ప్రాథమిక విద్య దశ నుండి నాన్నపాఠశాలలో తెలుగు బోధించడం వల్ల తెలుగు సాహిత్యం పట్ల అభిరుచి ఏర్పడింది. కళాశాల దశ నుండీ అభ్యుదయ దృక్పథం కలిగిన వారి పరిచయం వల్ల ప్రగతిశీల సాహిత్యంపట్ల ఆసక్తి. కొన్ని కవితలు, పుస్తక సమీక్షలు రాశారు. అవి అధ్యాపక జ్వాలలో ప్రచురితమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలో గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. ఈనాడు, వార్త, మన తెలంగాణ తదితర దినపత్రికలలో పనిచేసి రిటైర్ అయ్యారు. 2014లో ’సగం సగం కలసి‘ కవితా సంపుటిని, 2020లో ’కరోనా@లాక్ డౌన్. 360 డిగ్రీస్‘ పేరుతో వ్యాస సంపుటి ప్రచురించారు. ప్రస్తుతం తెలంగాణ శాసనసభ నియోజకవర్గాల వారీగా సాంఘిక, భౌగోళిక, రాజకీయ చరిత్ర రాస్తున్నారు.
పుట్టింది, పెరిగింది వరంగల్ లో. హైదరాబాద్ లో నివాసం. నాలుగు కవితా సంపుటులు (వాతావరణం, ఆక్వేరియం లో బంగారు చేప, అనంతరం, ఒక రాత్రి మరొక రాత్రి) వెలువడినాయి. కొన్ని కథలు, పుస్తక సమీక్షలు, సాహిత్య వ్యాసాలు కూడా.
మర్లపాలెం, గన్నవరం మండలం కృష్ణా జిల్లా. కవయిత్రి. మనసు స్పందించినప్పుడల్లా అక్షర ప్రయాణంలో ఆనంద విహారం చేయడం ఇష్టం. కవిత్వం వివిధ పత్రికల్లో అచ్చయింది. సాంస్కృతీ సమాఖ్య సంస్థ నుండి ఉగాది వెలుగు, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం నుండి జ్ఞాన జ్యోతి, ఉషోదయ సాహితీ వేదిక నుండి గుర్రం జాషువా సాహిత్య సేవా పురస్కారం, నెల్లూరు గ్రీన్ ఇండియా ట్రస్ట్ నుంచి అడవి బాపిరాజు స్మారక ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు.
పుట్టింది నల్లగొండ జిల్లా నక్రేకల్. పాత్రికేయుడు. విరసం సభ్యుడు. రచనలు: కలత నిద్దురలో (కవితా సంకలనం), అనగనగా అడవిలో - హిడ్మే మరికొందరు (వ్యాస సంకలనం).
పుట్టింది విజయనగరం జిల్లా కొమరాడ మండలం దళాయిపేట. ఎం.ఏ, బి.ఇడి చదివారు. కవి, కథా రచయిత, అధ్యాపకుడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా రిటైరయ్యారు. ప్రస్తుతం పార్వతీపురంలో వుంటున్నారు. 'ఏటిపాట', 'ఒకరాత్రి రెండుస్వప్నాలు' (కథా సంపుటాలు), 'నది నిదానం చేసాక', 'ఎగిరిపోతున్న పిట్టల కోసం'(కవితా సంపుటాలు), 'నాగేటి చాలుకు నమస్కారం', 'నాగలి' (దీర్ఘ కవితలు),'పాడుదమా స్వేచ్ఛాగీతం', 'ప్రియ భారత జననీ'(గేయ సంపుటాలు), 'నాగావళి అలల సవ్వడి', 'ఉన్నమాట' (పద్య సంపుటాలు), 'మనసు పలికే' (గజల్ గీతాలు) ప్రచురించారు. మిత్రులతో కలిసి 'స్నేహ కళాసాహితి'(1992 ) సంస్థను నడుపుతున్నారు.
పుట్టిన ఊరు వరంగల్ జిల్లా ఘన్‌పూర్ స్టేషన్. కవయిత్రి, ఉపాధ్యాయురాలు. M.Sc (Physics), M.A.(Sociology), B.Ed. చదివారు. రచనలు : ఆమె తప్పిపోయింది(కవితా సంపుటి). స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్)గా పనిచేస్తున్నారు. వివిధ పత్రికలు, వెబ్ మేగజీన్ లలో కవిత్వం అచ్చయింది.
కరీంనగర్ జిల్లా వాసి. ప్రభుత్వ ఉపాధ్యాయుడు. కవి, రచయిత, గాయకుడు. "మట్టి సరిగమలు" (కవిత్వం), "నెత్తుటి గాయాలు" తెలంగాణ ఉద్యమ గేయాల సీడీ, కొన్ని కథలు, వ్యాసాలు ప్రచురించారు. తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు.
హైదరాబాద్ లో బీ. కామ్ చదివారు. ప్రస్తుతం Synchrony Financial కంపనీలో సీనియర్ కస్టమర్ సర్వీస్ రిప్రెసెంటేటివ్ గా పని చేస్తున్నారు. కవిత్వం, ముఖ్యంగా ప్రేమ కవిత్వం ఆమె ఆసక్తి.
డా. భారతి : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. రచనలు: 'ఆమె అడవిని జయించింది', 'పాదముద్రలు'. లక్ష్మి (నవలిక). 'బచ్ఛేదాని' (కథా సంకలనం). 'పహెచాన్' (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 'పాలమూరు వలస బతుకు చిత్రాలు' (కథా సంకలనం), 'హస్బెండ్ స్టిచ్' (స్త్రీల విషాద లైంగిక గాథలు) 'అరణ్య స్వప్నం' (కవితా సంకలనం) సెప్టెంబర్ 2019 లో విడుదల అవుతుంది.
పుట్టింది జనగామ జిల్లా లింగాల ఘన్పూర్ మండలం నెల్లుట్ల. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ఎం.ఎస్సీ., ఎం. ఏ. బి.ఎడ్. చదివారు. పిహెచ్‌డి చేస్తూనే (భౌతిక శాస్త్రం) స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. ఇరవయేళ్లుగా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ లో పని చేస్తున్నారు. కవిత్వం చదవడం, రాయడం అభిరుచి. సమాజంలో ప్రగతిశీల భావజాల వ్యాప్తికి కృషి. పీడన లేని నూతన సమాజం ఆవిర్భవించాలని ఆకాంక్ష. బాలికలు, స్త్రీల సమస్యల పట్ల అవగాహకు కృషి చేస్తున్నారు. మానవీయత, స్నేహపూర్వకమైన మానవ సంబంధాలు నెలకొనాలనే అభిలాష.
పరిశోధకుడు, సాహిత్య విద్యార్థి. పుట్టింది సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి మండలం, రామన్నగూడెం తండ. తెలుగు సాహిత్యం, ఆదివాసీ సంస్కృతీ సాహిత్యాల గురించి అధ్యయనం చేయడం ఇష్టం. ఇటీవలే కథా రచనలోకి వచ్చాడు.
రచయితగా, ప్రజాగాయకుడిగా తెలంగాణ సమాజానికి సుపరిచితుడు గూడ అంజయ్య. ఆయన ఆదిలాబాదు జిల్లా దండేపల్లి మండలం లింగాపురంలో గూడ లక్ష్మయ్య, లక్ష్మమ్మ దంపతులకు నవంబరు 1న, 1954లో జన్మించారు. హైదరాబాదులో బీఫార్మసీ చదివి, ఉట్నూరులో ఫార్మసిస్టుగా ప్రభుత్వ ఉద్యోగం లో చేరారు. అంజన్న రాసిన 'ఊరు మనదిరా' పాట దేశవ్యాప్తంగా గ్రామీణులను ఉర్రూతలూగించింది. ఆ పాట పదహారు భాషల్లోకి అనువాదమైంది. 'అయ్యోనివా నువ్వు...అవ్వోనివా' అంటూ ఆంధ్ర పెట్టుబడి వర్గాల మీద రాసిన పాట తెలంగాణ ఉద్యమంలో భావసంచలనం రగిలించింది. ఇలాంటి ఎన్నో గొప్ప పాటలు విప్లవోద్యమం, తెలంగాణ ఉద్యమంలో యువతను ముందుకు నడిపించాయి. పొలిమేర (నవల), దళిత కథలు(కథా సంపుటి) ప్రచురించారు. జూన్ 21, 2016లో రంగారెడ్డి జిల్లా రాగన్నగూడలోని స్వగ్రుహంలో అనారోగ్యంతో తదిశ్వాస విడిచారు.
కవి, రచయిత, విమర్శకుడు, అనువాదకుడు. జర్నలిస్టు. రచనలు: 1. నైఋతి ఋతుపవనాల కాలమిది!(అనువాద కవిత్వం), 2. తుఫానులకెదురు నడవరా!(అనువాద కవిత్వం)
పుట్టింది ప్రకాశం జిల్లా జె. పంగులూరు. కవి, అధ్యాపకుడు. ఎంఏ (ఇంగ్లిష్)- అన్నామలై యూనివర్సిటీ, ఎంఏ(హిస్టరీ)- నాగార్జున యూనివర్సిటీ, ఎంఈడీ -(అన్నామలై యూనివర్సటీ) చదివారు. రచనలు: మనం కాసేపు మాట్లాడుకుందాం...(2018), అద్దంకి సాహితీ స్రవంతి బాధ్యుడిగా ఉన్నారు. మేదరమెట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. వివిధ పత్రికల్లో కవితలు అచ్చయ్యాయి.
ఊరు యర్రగొండ పాలెం, ప్రకాశం జిల్లా. కథా రచయిత, ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్. నాగార్జున యూనివర్సిటీలో M.A. (జర్నలిజం అండ్ మాస్ కమ్యూనకేషన్) చేశారు. తెలుగు వెలుగు, బాల భారతం పత్రికల్లో కొంతకాలం ఆర్టిస్ట్ గా పని చేశారు. కథలకి, పుస్తకాలకి ముఖచిత్రాలు గీసారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ గా, సినిమాల్లో రచయితగా పని చేస్తున్నారు. ఇప్పటికి 13 కథలు, కొన్ని వ్యాసాలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. తన కథ 'కేరాఫ్ బావర్చి' కథా సాహితీ వారి ' కథ19 ' లో వచ్చింది. మంచి పేరు తెచ్చింది.
ఖమ్మం జిల్లా. అధ్యాపకురాలు, కవయిత్రి, కథా రచయిత. ఎం.ఏ(హిందీ) చదివారు. 30 ఏళ్లగా ఖమ్మం జిల్లాలోని వివిధ పాఠశాలల్లో హిందీ అధ్యాపకురాలిగా పనిచేసి 2010 లో పదవీ విరమణ పొందారు. కథలు, కవితలు రాయడం ప్రవృత్తి.
పూర్వపు నల్లగొండ జిల్లా. కవి, కథకుడు, విమర్శకుడు. అధ్యాపకుడు. రచనలు: మా నాయిన (2006), నల్ల చామంతి (2017), వెలుతురు మొలకలు(2019) కవితా సంకలనాలు ప్రచురించారు.
చారిత్రక పరకాల పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో గల రంగయ్యపల్లి స్వగ్రామం. రేగొండ మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా. కవి, రచయిత, అధ్యాపకుడు. ఎంఏ(ఎకనామిక్స్), ఎంఈడీ కాకతీయ యూనివర్సిటీలో చదివారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తి, సాంఘిక శాస్త్ర బోధన. సమకాలీన అంశాల మీద తక్షణ స్పందనగా "చిలువేరు చురకలు" వారం వారం రాస్తూ సమాజాన్ని మేల్కొలపాలనే సామాజిక బాధ్యతతో కవిత్వ ప్రయాణం. "అమ్మచెక్కిన అక్షరం" తొలి కవితా సంపుటి. విద్యా విధానం మీద పది వ్యాసాలు, నాలుగు కథలు, వందకు పైగా కవితలు నిరంతర కవిత్వ సాగు. ప్రజాతంత్ర భావజాలంతో మమేకమవుతూ ప్రజా పోరాటాలలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.
అసలు పేరు బద్ధం భాస్కర్‌రెడ్డి. పేద రైతు కుటుంబంలో పుట్టాడు. హైదరాబాద్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఆరుగురు దిగంబర కవుల్లో ఒకరు. 'నన్నెక్కనివ్వండి బోను'తో కవితాకాశంలో సూర్యుడిలా పొడుచుకొచ్చాడు. విరసం వ్యవస్థాపక కార్యవర్గ సభ్యుడు. 1971-72లో విరసం కార్యదర్శిగా పనిచేశాడు. శ్రమజీవుల జీవితాలపై ఎన్నెన్నో పాటలు రాశాడు. విరసం మీద ప్రభుత్వం బనాయించిన సికింద్రాబాద్ కుట్రకేసులో ముద్దాయి. కవితా సంపుటాలు: 'దిక్సూచి', 'ముట్టడి', 'గమ్యం', 'జన్మహక్కు'. నవలలు: ప్రస్థానం, మా పల్లె. గంజినీళ్లు(నాటిక), చిరంజీవి, మరికొన్ని కథలు రాశారు. . ప్రభుత్వం చెరబండరాజుని నిరుద్యోగానికీ, అనారోగ్యానికీ గురిచేసి బలితీసుకుంది. మెదడు క్యాన్సర్‌తో మరణించాడు.
పుట్టింది సూర్యాపేట. పెరిగింది నాగార్జున సాగర్. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్ మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్. విద్యార్థి దశలో ఎస్. ఎఫ్. ఐ. లో పని చేశారు. సామాజిక ఆర్థిక సమస్యలను కవితా వస్తువులు గా తీసుకుని కవిత్వం రాస్తున్నారు. వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.
పుట్టింది హైదరాబాద్. పెరిగింది మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో. వైద్య విద్య కె. ఎం. సీ, వరంగల్. ‘ప్రజాకళ’ (2006-2007), ‘ప్రాణహిత’ (2007-2010) వెబ్ పత్రికల ఎడిటోరియల్ టీం మెంబర్. వృత్తి - వైద్యం. అభిరుచి - సాహిత్యం. ప్రస్తుతం అమెరికాలోని ఇండియనాపోలిస్ లో ఫామిలీ ఫిజీషియన్ గా ప్రాక్టీస్ చేస్తోంది.
పాక జయమ్మ. పుట్టింది నల్లగొండ జిల్లా, హాలియా మండలం, రంగుండ్ల గ్రామం. అధ్యాపకురాలు. చైతన్య మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. 'మహిళా మార్గం' వర్కింగ్ ఎడిటర్. కుటుంబం నల్లగొండ జిల్లా, పెద్ద అడిశర్లపల్లి మండలం, పోతిరెడ్డిపల్లి గ్రామానికి వలస వచ్చింది. రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ మండలం, వెల్జెర్లలో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.
పుట్టింది, పెరిగింది హైదరాబాద్. అశోక యునివర్సిటీ నుండి లిబరల్ స్టడీస్ లో పోస్ట్-గ్రాజుయెట్ డిప్లొమా పొందింది. ఆర్కిటెక్ట్ గా పని చేస్తోంది. చిన్నప్పటినుండీ చదవడం, రాయడం అంటే ఆసక్తి. 2016 లో తన కవిత్వ సంపుటి 'Quill' ప్రచురించింది.
జాషువా జెన్నిఫర్ ఎస్పీనోజా ఒక ట్రాన్స్ విమెన్. అమెరికన్ పోయెట్. డిసెంబర్ 17 ,1987 లో జన్మించారు. ఆమె కాలిఫోర్నియాలో రివర్సైడ్ లో ఆక్సిడెంటల్ కాలేజీలో ఇంగ్లీష్ లో విసిటింగ్ ప్రొఫెసర్. ఎస్పీనోజా కవితల్లో వస్తు వైవిధ్యం చాలా ఉంటుంది. మానసిక అనారోగ్యం, లైంగిక వైరుధ్యాలు, స్త్రీగా మారడంలోని బాధ ఆనందం, ప్రేమ, మోపమ్ దుఖం, అందం లాంటి సార్వత్రిక థీమ్ లను ఎస్పీనోజా ఎన్నుకుంటుంది. ఎస్పీనోజా రచనలు : ఐ యాం అలైవ్/ఇట్ హార్ట్స్/ఐ లవ్ ఇట్ (2014), దేర్ షూడ్ బి ఫ్లవర్స్ (2016), ఐ డోంట్ వాంట్ టు బీ అండర్స్ట్యూడ్ (2024).
జి.ఎన్ సాయిబాబా అమలాపురంలో పుట్టి హైదరాబాద్‌లో చదువుకున్న ప్రపంచ ప్రఖ్యాతి పొందిన విప్లవ మేధావి. వైద్యశాస్త్ర పరిభాషలో 90 శాతం అంగవైకల్యం ఉన్నప్పటికీ, సునిశితమైన మేధతో తెలుగు సీమలోనూ, దేశవ్యాప్తంగానూ ప్రజా ఉద్యమాలకు బుద్ధిజీవుల సంఘీభావాన్ని సమీకరించడంలో అగ్రభాగాన ఉన్నారు. భారతీయాంగ్ల నవలల మీద పి ఎచ్ డి చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్ ప్రొఫెసర్. మధ్య భారత అరణ్యాలలో భారత ప్రభుత్వం సాగిస్తున్న ఆపరేషన్ దమనకాండను నిరసించినందుకు తప్పుడు కేసులో యావజ్జీవ శిక్షకు గురై ప్రస్తుతం నాగపూర్ సెంట్రల్ జైలులో అండా సెల్ లో ఉన్నారు.
కవి, రచయిత, విమర్శకుడు. నాటక కర్త. విప్లవ రచయితల సంఘం సభ్యుడు. రచనలు: 1. కాలం (కవిత్వం), 2. అంటరాని వసంతం(నవల), 3. నేనేమడిగానని(కథలు), 4. తెలుగు నాటక రంగ మూలాలు, 5. ఆఖరి మనిషి అంతరంగం.
కవి, సాహిత్య విర్శకుడు, సామాజిక విశ్లేషకుడు, దళిత బహుజన సాహిత్య ఉద్యమకారుడు. తెలుగు దళిత బహుజ సాహిత్య సిద్ధాంతాన్ని రూపొందించి, పెంపొందించడానికి కృషిచేశారు. 'చిక్కనవుతున్న పాట'(1995), 'పదునెక్కిన పాట'(1996) కవితా సంకలనాలు తీసుకురావడానికి కృషిచేశారు. దళిత బహుజన కవిత్వంలో అంబేద్కరిజం వ్యక్తమైన తీరును విశ్లేషిస్తూ దళిత బహుజన సాహిత్యం దృక్పథం రాశారు. 'The Essence of Dalith Poetry' అనే ఆంగ్ల గ్రంథాన్ని ప్రచురించారు. ఇటీవలే 'కవితా నిర్మాణ పద్ధతులు', 'సామాజిక కళా విమర్శ' అనే పుస్తకాలు ప్రచురించారు. తెలుగు సాహిత్య అకాడమీ అవార్డు(1995), ఇటీవల కలేకూరి, శంబూక, గిడుగు రామ్మూర్తి అవార్డులు వచ్చాయి.
జననం: కర్నూలు జిల్లా. కవి, రచయిత, కథకుడు, విమర్శకుడు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సహకార శాఖ లో డిప్యూటీ రిజిస్ట్రార్. ఇప్పటి వరకు నాలుగు కవితా సంపుటాలు, రెండు దీర్ఘ కవితలు, మూడు కథా సంపుటాలు, సాహితీ విమర్శ వ్యాసాలు ప్రచురించారు. కథలోనైనా, కవిత్వం అయినా రాయలసీమ గ్రామీణ ప్రాంత జీవితాన్ని బలంగా చిత్రించడానికే ప్రాధాన్యత యిస్తారు. అభ్యుదయ, బహుజన వాద మేలుకలయికగా సాహిత్య సృజన చేస్తున్నారు.
కవితా సంపుటాలు: 1. లోగొంతుక (2000), 2. దున్నేకొద్దీ దుఖ్ఖం (2005), 3. కొన్ని రంగులూ ఒక పద్యం (2010), 4. చినుకు దీవి (2016). దీర్ఘ కవితలు: 1. నదీ వరదా మనిషి (2009), 2. హంద్రీ గానం (2015). కథాసంపుటాలు: 1. గరుడ స్థంభం (2005), 2. చిలకలు వాలిన చెట్టు (2010), 3. దేవరగట్టు (2017).
పుట్టింది బొమ్మాయిపల్లి, నల్లగొండ జిల్లా(పూర్వపు). రచయిత, జర్నలిస్టు, అనువాదకుడు, రైతు. వివిధ పత్రికల్లో ఫ్రెంచ్ అనువాదాలు ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం కృతి వ్యవసాయం చేస్తున్నారు.
పుట్టింది కరీంనగర్ జిల్లా తంగళ్ళపల్లి గ్రామం. కవి. కోపరేటివ్ విద్యుత్ విభాగంలో సూపరింటెండెంట్ గా పనిచేసి పదవీ విరమణ చేశారు. రచనలు: చిలుక రహస్యం, తారంగం, ఒకరోజు పది గాయాలు, పిడికెడు కన్నీళ్లు దోసెడు కలలు, పాతాళ గరిగె, ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గంగడోలు, వాస్కోడిగామా డాట్ కామ్, బొడ్డుతాడు, తల్లి కొంగు, రాజపత్రం, చెట్టుని దాటుకుంటూ, పస, ఊరు ఒక నారు మడి.. 14 కవితా సంపుటాలు, 'వైఫణి'( నైపుణ్యం) కథల సంపుటి ప్రచురించారు.
కవయిత్రి, కథా రచయిత్రి. పుట్టింది దామరంచె పల్లె, వరంగల్ జిల్లా. కాకతీయ యూనివర్సిటీ నుండి తెలుగు సాహిత్యంలో ఎం. ఏ, ఎం. ఫిల్ చేశారు. 'మట్టిపూల రచయిత్రుల వేదిక' వ్యవస్థాపక సభ్యురాలు. రచనలు: నల్లరేగటిసాల్లు (2006), సంగతి (తమిళ్ నుండి తెలుగు), కైతునకల దండెం (2008), అయ్యయ్యో దమ్మక్క (2009), చంద్రశ్రీ యాదిలో... (2013),
రాయక్క మాన్యం (2014). తెలంగాణా సెక్రటేరియట్ లో పని చేస్తున్నారు.
పుట్టింది ఉమ్మడి నల్గొండ జిల్లా, దత్తాయపల్లి(ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా). పరిశోధకుడు, కవి, గాయకుడు.
M.P.A, M.A చదివాడు. వివిధ పత్రికలు, అంతర్జాల పత్రికల్లో కవితలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి.
వరంగల్. కవి, రచయిత, అధ్యాపకుడు. మార్క్సిస్టు సాహిత్య విమర్శకుడు. 'సృజన' ఆధునిక సాహిత్య వేదికను నిర్వహించే 'సాహితీ మిత్రుల'తో కలసి పనిచేశారు. 1969లోనే 'ఫ్రీ - ఫ్రాంక్ వర్స్ - ఆధునికత', 'ఆధునికత - తెలుగు వచన కవిత' లాంటి లోతైన విమర్శ వ్యాసాలు రాశారు. 'జేసీ' పేరుతో 1980లలో అద్బుతమైన కవిత్వ విమర్శ వ్యాసాలు రాశారు. ఈ వ్యాసాలన్నీ 1991లో 'కవిత్వం - గతితార్కికత' పేరుతో ప్రచురించారు. సునిశిత విమర్శతో మూడు దశాబ్దాల పాటు యువతరాన్ని ప్రభావితం చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్ ఫ్రొఫెసర్ గా పనిచేశారు. రెండు దశాబ్దాల క్రితం రిటైరయ్యారు. అనంతరం అమెరికా వెళ్లారు. 30 మే, 2021న బ్రాంకైటిస్ తో అక్కడే చనిపోయారు.
పుట్టిన ఊరు సికింద్రాబాద్. రచయిత్రి, అధ్యాపకురాలు. హిందీ సాహిత్యంలో పీహెచ్డీ చేశారు. ఆసక్తి: పుస్తకాలు, సినిమాలు. తార్నాకలోని Spreading light అనే బుక్ క్లబ్ లో ఎనిమిదేళ్లుగా ప్రతి శనివారం పుస్తక పరిచయాలు నిర్వహిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో 'నచ్చిన పుస్తకం', 'నచ్చిన సినిమా' గ్రూపుల్లో 1000 పుస్తకాలు, 1500 పైగా సినిమాలను పరిచయం చేశారు. రైల్వే జూనియర్ కాలేజీ(తార్నాక)లో హిందీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు.
జననం: ఖమ్మం జిల్లా, గార్ల మండలం పెద్ద కిష్టాపురం. విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయిని. కవయిత్రి. రచనలు: కాలాన్ని జయిస్తూ నేను-2007(కవిత్వం), సుదీర్ఘ హత్య-2009(కవిత్వం), ఆత్మాన్వేషణ -2011(కథలు), అగ్ని లిపి-2012(తెలంగాణ ఉద్యమ కవిత్వం), జ్వలితార్ణవాలు- 2016(సాహిత్య సామాజిక వ్యాసాలు), సంపాదకత్వం: పరివ్యాప్త-2007(స్త్రీవాద కవిత్వం), రుంజ - 2013(విశ్వకర్మ కవుల కవిత్వం), ఖమ్మం కథలు - 2016(1911-2016వరకు 104 సంవత్సరాల, ఖమ్మం జిల్లా 104రచయితల 104కథలు), అక్షర పుష్పాలు-భావ సౌరభాలు - 2016 (ఖమ్మం బాల కవుల రచనల సంకలనం), ఓరు - 2017(జ్వలిత సాహిత్య సంక్షిప్త సమాలోచన). పనిచేసిన సాహితీ సంస్థలు: 'మట్టిపూలు', 'రుంజ', 'అఖిల భారత రచయిత్రుల సంఘం', 'దబరకం', 'తెలంగాణ విద్యావంతుల వేదిక'. ప్రస్తుతం సాహితీవనం మిద్దెతోట సాగు చేస్తున్నారు.
కవి, రచయిత, అనువాదకుడు. మొదటి కథ 'దోమాయణం' లీలా రాఘవయ్య గారి 'జ్యోతి' 1989 దీపావళి ప్రత్యేక సంచికలో అచ్చవడంతో రచనా వ్యాసాంగం మొదలైంది. ఇప్పటికి రెండు తెలుగు నవలు (‘సహజీవనం’, ‘లాకర్ నెంబరు 112’) (విహంగ, కౌముది) వెబ్ మ్యాగజైన్లలో ప్రచురితమయ్యాయి. తమిళ రచయిత్రి శివ శంకరి నవల 'ది బిట్రేయల్', అపూర్వ పురోహిత్ 'ఓ లేడీ యు ఆర్ నాట్ ఎ మాన్' అనే పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. 'పియర్సన్ ఇండియా' వారి ఐదు పర్సనాలిటీ డెవలప్మెంట్(రిచర్డ్ టెంప్లార్ రాసినవి) పుస్తకాలను తెలుగులోకి అనువాదం చేశారు. అద్భుతమైన ప్రతిభా పాటవాలు కలిగినా, రావాల్సినంత పేరు రాని, దేశ విదేశాల్లోని స్త్రీ మూర్తుల గురించి తొమ్మిది వ్యాసాలు “విహంగ” వెబ్ మ్యాగజైన్ లో ప్రచురితమయ్యాయి. ఇప్పటి దాకా పందొమ్మిది కథలు రాశారు. ఒక ఇంగ్లిష్ సస్పెన్స్ నవల రాస్తున్నారు. రెండు తెలుగు కవిత్వం పుస్తకాలు అచ్చు వేశారు. మరొక తెలుగు కవిత్వం పుస్తకం, ఒక ఇంగ్లిష్ కవిత్వ పుస్తకం ప్రింట్ కావాల్సి వుంది.
స్వస్థలం: కడపజిల్లా ముద్దనూరు మండలం, యమవరం గ్రామం. కవి, విమర్శకుడు. తెలుగు సాహిత్యంలోె ఎం.ఏ., పీ హెచ్ డీ చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తూ 2013 లో పదవీ విరమణ చేశారు. రచనలు: 'మరోప్రపంచం కోసం'(1978), 'దివ్యదృష్టి', 'జ్వలనమ్', 'తుఫాను ముందటి ప్రశాంతి', 'ఈ కన్నీటికి తడిలేదు', 'క్షతగాత్రం', 'మగ్గం బతుకు', 'అవిశ్రాంతం' సంపుటాలు వచ్చాయి. విమర్శకుడిగా 8 పుస్తకాలు. 'కవిత్వం ఓ సామాజిక స్వప్నం'(మొదటి సంపుటి), 'కవిత్వం ఓ సామాజిక సంస్కారం'(రెండవ సంపుటి), 'కవిత్వం ఓ సామాజిక సత్యం'(మూడవ సంపుటి), 'కవిత్వం ఓ సామాజిక చైతన్యం'(నాల్గవ సంపుటి. )అవగాహన-1 , మూడుపదులు ముప్పై కావ్యాలు, వివేచన- 2 త్వరలో రానున్నాయి. ''మగ్గం బతుకు'' దీర్ఘ కావ్యం ఆంగ్ల, హిందీ భాషల్లో కి అనువాదమైంది.
జననం: నల్లగొండ. 'ఆధునిక కవిత్వంలో అస్తిత్వ వేదన', 'అంతర్ముఖీన కవిత్వం' అనే అంశాలపై ఎం.ఫిల్, పీహెచ్‌డీ పరిశోధన చేశారు. ప్రాథమిక తరగతి నుండి డిగ్రీ స్థాయి తెలుగు పాఠ్య పుస్తకాల రూపకల్పనలో కీలకమైన సభ్యుడిగా, రచయితగా, సంపాదకుడిగా బాధ్యతలు నిర్వహించారు. అనేక కవితలు, సమీక్షలు, ముందుమాటలు, పరిశోధనా వ్యాసాలు రాశారు. పలు పురస్కరాలు అందుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ తెలుగు శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. 'జీవన లిపి'(కవిత్వం), 'సమన్వయ'(సాహిత్య వ్యాసాలు) రచనలతో పాటు వివిధ గ్రంథాలకు సంపాదకత్వం వహించారు.
పాపయ్యపేట, మండలం చెన్నారావుపేట, వరంగల్ జిల్లా. కవయిత్రి, విమర్శకురాలు, అధ్యాపకురాలు. ఎం.ఏ., పి. హెచ్.డి, ఎం.ఏ, సంస్కృతం చదివారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి 'తెలుగు సాహిత్య విమర్శ : స్త్రీల కృషి' (2012)పై పరిశోధన చేశారు. రచనలు: 'తెలుగు సాహిత్యంలో స్త్రీవాద విమర్శకులు' (వ్యాస సంపుటి)-2015, 'వ్యాస శోభిత' (వ్యాస సంపుటి) - 2015, 'తెలుగు సాహిత్య విమర్శ : స్త్రీల కృషి' - 2018. కాకతీయ విశ్వవిద్యాలయం పీజీ మహిళా కళాశాల, వరంగల్ లో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.
జననం: రెడ్లవాడ గ్రామం, నెక్కొండ మండలం, వరంగల్ జిల్లా. రచయిత్రి, విమర్శకురాలు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్. రచనలు: ఆర్య సమాజ సాహిత్యం మహిళాభ్యుదయం, 2. ముదిగొండ శివప్రసాద్ చారిత్రక నవలానుశీలనం సమగ్ర పరిశీలన, 3. అఓర రసాలు, 4. వ్యాస తోరణం. సంపాదకత్వం: జిగర్(తెలంగాణ విశిష్ట కవిత్వ సంకలనం, 2. యువ సాహితి(మిత్రులతో కలసి).
రచయిత్రి. గాయని. భాషా నిపుణులు. “నెచ్చెలి” అంతర్జాల వనితా మాస పత్రిక వ్యవస్థాపక సంపాదకులు. కాలిఫోర్నియాలో నివాసం. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఫీల్డు లో "తెలుగు భాషా నిపుణురాలి" గా పనిచేస్తున్నారు. ద్రవ భాష(2001), శీత సుమాలు(2006), శతాబ్ది వెన్నెల (2013) , సెలయేటి దివిటీ (2017) కవితా సంపుటాలు, సిలికాన్ లోయ సాక్షిగా(2018) కథా సంపుటి, వెనుతిరగని వెన్నెల (2021) నవల ప్రచురింపబడ్డాయి. వివిధ పత్రికల్లో, సంకలనాల్లో కవిత్వం, కథలు, కాలమ్స్, ట్రావెలాగ్స్, వ్యాసాలు అనేకం ప్రచురింపబడ్డాయి. కవిత్వంలో అజంతా అవార్డు, దేవులపల్లి అవార్డు, కుందుర్తి అవార్డు మొ.న ప్రతిష్టాత్మక పురస్కారాలు ఎన్నో పొందారు. వీరి రచనలు ఇంగ్లీషు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లోకి అనువాదం అయ్యాయి.
పుట్టింది చిన్న పెండ్యాల, వరంగల్. కవయిత్రి, రచయిత్రి, వ్యాఖ్యాత, ఉపన్యాసకురాలు. ఎం.ఏ. తెలుగు, టి.పి.టి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్.డీ (ఒద్దిరాజు సోదరులు, జీవితం, సాహిత్యం) పరిశోధన చేశారు. 20ఏళ్లు తెలుగు ఉపాధ్యాయినిగా పనిచేశారు. రచనలు: 1. అర్ర తలుపులు, 2. నిర్నిద్ర గానం, 3.ఎనిమిదో అడుగు(కవితా సంకలనాలు). జీవిత చరిత్రలు: (తెలుగు అకాడమీ)1. చిత్రకళాతపస్వి కొండపల్లి శేషగిరిరావు, 2. పెండ్యాల రాఘవరావు (నా ప్రజా జీవితం), 3. ఒద్దిరాజు సోదరులు, అమెరికాలో ఆరునెలలు(యాత్రా చరిత్ర). వ్యాసహారిక, సృజన రంజని(సాహిత్య విమర్శ), తెలంగాణ వేగుచుక్కలు- ఒద్దిరాజు సోదరులు (పరిశోధన గ్రంథం), ప్రస్తుతం 'తెలంగాణ సాహిత్యంలో స్త్రీల సాహిత్యం' పై పరిశోధనాత్మక రచన చేస్తున్నారు.
వరంగల్ ఏ.యస్.యం. మహిళా కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పదవీ విరమణ పొందారు. వివిధ సంకలనాలు, పత్రికలలో వీరి కవితలు, వ్యాసాలు, సమీక్షలు, కథలు, ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక తెలంగాణ శాఖ సమన్వయ కర్తగా, రుద్రమ ప్రచురణలు, వరంగల్ వ్యవస్థాపక సభ్యురాలుగా కొనసాగుతున్నారు.
పుట్టింది మేడ్చెల్ జిల్లా హాజీపూర్. ''చిందు కళాకారుల జీవన చిత్రణ - సాహిత్యానుశీలనం''పై ఉస్మానియా యూనివర్సిటీలో పరిశోధన చేశారు. రచనలు: 'చిందు ఎల్లమ్మ చిందుల హంస', 'నేను చిందేస్తే', 'కొంగవాలు కత్తి'(తొలి తెలుగు చిందు నవల), 'అతడు అబ్రహాం' లాంటి రచనలు చేశారు. ప్రస్తుతం కోఠి మహిళా కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు.
ఒంగోలు, ప్రకాశం జిల్లా. కవయిత్రి, సోషలిస్ట్. వింగ్స్ ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్ గా ఉన్నారు.
పాలమూరు జిల్లా అంబట్ పల్లి. కవి, రచయిత, సామాజిక, రాజకీయ విశ్లేషకుడు. విరసం సభ్యుడు. రచనలు: పొలమారిన పాలమూరు, గుత్తికొండ, మానాల(దీర్ఘ కవితలు), నేను తెలంగాణోన్ని మాట్లాడుతున్న, తెలంగాణ ఉద్యమాలు-పాట, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ-సామాజిక న్యాయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు-విద్రోహ రాజకీయాలు, తెలంగాణ సాహిత్యం, రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలు; అగ్రకులత్వం, టీఎస్ఎఫ్ చరిత్ర, కాగితం మీద అక్షరానికి కమిటైన కవి, అకడమిక్ అన్ టచ్ బులిటీ. ఇరవయేళ్ల కవిత్వమంతా ''కాశీం కవిత్వం (1994 -2014)'' పేరుతో సమగ్ర సంకలనం ప్రచురించారు. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ తెలుగుశాఖలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.
కవయిత్రి, కథా రచయిత, విమర్శకురాలు, పరిశోధకురాలు. పూర్వ పాలమూరు జిల్లా ఆత్మకూరులో పుట్టారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ.(తెలుగు సాహిత్యం) చదివారు. పీఎచ్‌డీ పరిశోధన చేశారు. రచనలు : ఇప్పటి వరకు 10 నవలలు, 70 కథలు, వందలాది వ్యాసాలు, కవితలు రాశారు. అవార్డులు : 1. తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించే ‘కీర్తి పురస్కారాన్ని 2015 సంవత్సరానికి సంబంధించి ‘వాసిరెడ్డి రంగనాయకమ్మ’ స్మారక అవార్డు (నవలా విభాగంలో) పొందారు. 2. తెలంగాణ సారస్వత పరిషత్తు నుండి ధర్మనిధి పురస్కారం. పాకాల యశోద రెడ్డి అవార్డు (2023). ప్రస్తుత నివాసం హైదరాబాద్.
అనంత పద్మనాభ(డిగ్రీ) కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా 34ఏళ్ల అనుభవం. ప్రిన్సిపల్‌గా పదవీ విరమణ పొందారు. 'తెలంగాణ విమోచనోద్యమ నవలల్లో స్త్రీచైతన్యం'పై పరిశోధన. ఇటీవల 'బతుకమ్మ పాటల్లో స్త్రీల మనోభావాలు - పాటల పరిణామ క్రమం' పుస్తకం ప్రచురించారు. పలు సంకలనాల్లో వ్యాసాలు, కవితలు, కథలు ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం 'ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక' తెలంగాణ శాఖ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.
జననం: పేర్ణమిట్ట, ప్రకాశం జిల్లా. అధ్యాపకుడు, పాత్రికేయుడు. MA, M.Phil, PhD, (LLB) చదివారు. చలం, కొకు పై , బహుజన తాత్వికత పై పరిశోధన చేశారు. సంపాదకత్వం: నువ్వే లేకపోతే( అంబేద్కర్ విగ్రహ విధ్వంస నిరసన కవిత్వం), పరివర్తన నిజం-మత మార్పిడి అబద్ధం( కంధమాల్ దళిత క్రైస్తవుల హత్యల నిరసన కవిత్వం), తెగిపడిన చోట తెగబడటమే( లక్ష్మీపేట దళిత నరమేధం నిరసన కవిత్వం) సంకలనాలకు సంపాకత్వం వహించారు.
జననం: నల్లగొండ. కవి, కథకుడు, విమర్శకుడు. రెండు దశాబ్దాలుగా ఆధునిక సాహిత్యంలోని అనేకానేక అంశాలపై రచనలు చేస్తున్నారు. 'జంగం కథ - ఒక పరిశీలన' అనే అంశంపై పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఎంఫిల్, 'సమకాలీన తెలుగు వచన కవిత్వం-ప్రాంతీయతా ద్రుక్పథాలు' అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్ డీ చేశారు. రచనలు: మొగురం(సాహిత్య వ్యాసాలు). ప్రస్తుతం హైదరాబాద్ లోని నిజాం కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.
ఊరు హన్మకొండ. రచయిత్రి, కవయిత్రి, అసిస్టెంట్ ప్రొఫెసర్. ఎకనమిక్స్ లో డాక్టరేట్. కలంపేరు శ్రావణసంధ్య. దాదాపు 1500 కవితలు, యాభై కథలు, ఇరవై వ్యాసాలు, వంద పాటలు, రెండు వందల మినీ కవితలు రాశారు. కొద్దిరోజుల్లో రెండు పుస్తకాలు రానున్నాయి.
ఆధునిక దళిత జీవితాన్ని అక్షరీకరిస్తున్న పదునైన కలం డా.పసునూరి రవీందర్. కవిత్వం, కథ, విమర్శ, పరిశోధన ప్రక్రియల్లో బహుజన దృక్పథంతో రాణిస్తున్నారు. తన అవుటాఫ్ కవరేజ్ ఏరియా కథా సంపుటితో తెలంగాణ నుండి కేంద్ర సాహిత్య అకాడెమి యువపురస్కారం అందుకున్న తొలి రచయిత. 'లడాయి', 'ఒంటరి యుద్ధభూమి', 'తెలంగాణ ఉద్యమపాట', 'గ్లోబలైజేషన్ సాహిత్య విమర్శ', 'ఇమ్మతి', 'పోటెత్తిన పాట' వంటి పలు పుస్తకాలు వెలువరించారు.
సొంతూరు శాఖపట్నం దగ్గర లోని గనివాడ గ్రామం. ఎంబీఏ, పీఎచ్ డీ చేశారు. బిజినెస్ మేనేజ్మెంట్ లో రిటైర్డ్ ప్రొఫెసర్. హైదరాబాద్ నివాసం. ప్రస్తుతం USA లోని క్లీవ్లాండ్ లో ఉంటున్నారు.
జననం: తూర్పుగోదావరి జిల్లా- మన్యప్రాంతం రాజవొమ్మంగి మండలం గదవరం గ్రామం. కథకురాలు, సత్యాన్వేషి. తెలుగు సాహిత్యంలో ఎంఏ, పీహెచ్‌డీ చేశారు. కాకినాడలో పెండా సత్యనారాయణ మూర్తి సంస్కృత కళాశాలలో, పి.వి.ఆర్. ట్రస్ట్ డిగ్రీ కళాశాలలో తెలుగు రీడర్‌గా పనిచేసి రిటైరయ్యారు. కథా సంకలనాలు : 'వెన్నెల ముగ్గు' (1980) కథతో కథారచయిత్రిగా సాహిత్య జీవితం ప్రారంభించి 'ఉత్సవ సౌరభం' (1996), 'కొండఫలం' (2009), 'కిటికీ బయటి వెన్నెల' (2014). సాహిత్యవ్యాసాలు: ‘సాహిత్యానుభవం' (2005), ‘ఆకులో ఆకునై' (2003). చలం సాహిత్యంపై చేసిన డాక్టరల్ పరిశోధన 'సత్యాన్వేషి చలం' (2007) పేరిట వెలువరించారు.
పుట్టింది వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండల కేంద్రం. పద్మశాలి ఆశ్రిత కులాల సాహిత్యం పై కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పరిశోధన చేసి, సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించాడు. తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠం వరంగల్లు కేంద్రంలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ, పీఠం ప్రచురించిన పరిశోధనాత్మక గ్రంధాల్లో సహ సంపాదకులుగా, సంపాదక మండలి సభ్యులుగా వ్యవహరించాడు. జానపద గిరిజన విజ్ఞాన అధ్యయనంపై పలు పత్రికల్లో వ్యాసాలు రాశాడు.
పుట్టింది యాదాద్రి భువనగిరి జిల్లా బొందుగుల. మెడికల్ కాలేజీ జీవితం నుంచి సీరియస్‌గా కవిత్వం రాస్తున్నారు. రచనలు: 'జలపాత శబ్దంలోకి' (1997), 'ఎన్నాద్రి' (2008), 'ఇడుపు కాయితం' (2015), వైద్య వృత్తి మీద రాసిన 'అందని చందమామ' (దీర్ఘ కవిత 2008), 'ఇరువాలు' (తెలంగాణ సాహిత్య వ్యాసాలు (2013) ప్రచురించారు. ప్రస్తుతం హైదరాబాదులో పిల్లల వైద్యుడిగా పని చేస్తున్నారు.
కవి, రచయిత, అధ్యాపకుడు. రచనలు: లంబా హై సఫర్( సమగ్ర కవిత్వం), కొండా... కోనల్లో...(కథలు), దూరాల చేరువలో.
పుట్టింది నార్సింగి, చేగుంట మండలం మెదక్ జిల్లా. హైదరాబాద్ అల్వాల్ లో ఉంటున్నారు. "మెదక్ జిల్లా రచయితల సాహిత్య కృషి - వివిధ ధోరణులు" అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి చేశారు. రచనలు 1) ఒక వేకువ కోసం (కవిత్వం ) 2) తెలంగాణ విస్మృత వీరుడు కేవల్ కిషన్ 3) పల్లె పూలవాన బాల్యం బతుకు కథలు 4) అక్షర శిల్పి వేముగంటి 5) గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ మోనోగ్రాఫ్ 6) మెదక్ జిల్లా సాహిత్య చరిత్ర 7) మెతుకు కథలు (సంపాదకీయం) 8) తొలినాళ్ళ సోయి (సంపాదకీయం) 9) నూరు పూలు నందిని సిధారెడ్డి పీఠికలు (సంపాదకీయం) ముద్రించారు. ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు.
జననం: పాలమూరు జిల్లా. కవి, రచయిత, పరిశోధకుడు. "మహబూబ్ నగర్ జిల్లా తెలుగు సాహిత్య వికాసం" అనే అంశంపై పరిశోధన చేశారు. రచనలు: పాలమూరు కవిత, సోది (తెలంగాణ హైకూలు), బతుకమ్మ నానీలు, మొగ్గలు, పసిడి నానీలు వంటి పుస్తకాలను వెలువరించారు. తెలుగు సాహిత్యంలో "మొగ్గలు" అనే నూతన కవితా ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.
అనంతపురం. రచయిత్రి, అధ్యాపకురాలు. ఎం.ఎస్సి., పిహెచ్.డి. చదివారు. వృత్తి: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర బోధన. సాహిత్య కృషి: విజ్ఞాన శాస్త్ర బోధన, పరిశోధన నాకు వృత్తిగతమైతే, సాహిత్యం అత్యంత ప్రియమైన ప్రవృత్తి. హైస్కూల్లో చదువు తున్నప్పుడు చిన్నగా కవిత్వం మొదలైంది. కాలేజీ రోజుల నుంచి ఈనాటి వరకూ విజ్ఞాన దాయకమైన, సామాజిక, సాహితీ అంశాల గురించి వివిధ పత్రికలలో వ్యాసాలు రాశారు. ఆకాశవాణి ద్వారా ప్రసంగాలు చేశారు. 2013 నుంచి కథా రచన మొదలయింది. మొదటి కథ సాహిత్య ప్రస్థానం పత్రికలో ప్రచురించిన మరణ వాంగ్మూలం. ఇంతవరకూ దాదాపు 35 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమైనాయి. 18 కథలతో ‘కోయిల చెట్టు’ పేరుతో కథాసంకలనం ప్రచురితమైంది.
పుట్టింది,పెరిగింది కొత్తగూడెం టౌన్. వైద్య విద్య చదివింది,వృత్తి సాగిస్తున్నది హైదరాబాదు నగరం లో. విద్యార్ధి దశ నుండి ప్రజాసాంస్కృతిక ఉద్యమ గమనంలో పాలు పంచుకుంటున్న వేకువ పూలు నవల, ఖలీల్ గిబ్రాన్ రచనల అనువాదాలు- ప్రవక్త, తిరుగు బాటు స్వరాలు కథలు, సోవియట్ సాహిత్య భాస్కరులు పుస్తక రూపం లో వెలువడ్డాయి. సామాజిక సాంస్కృతిక అంశాల పై అనేక వ్యాసాలు. మన తెలంగాణ, ఆంధ్రజ్యోతి, సాక్షి తదితర దిన పత్రికలలోనూ, ఉపాధ్యాయ ప్రగతి, ట్రెండింగ్ తెలుగు న్యూస్, కౌంటర్ కరెంట్ వంటి వెబ్ పత్రికలలోనూ తరచుగా కనిపిస్తాయి. సాహిత్య విశ్లేషణ అభిమాన పాత్ర మైన అంశం;. జ్వాల ప్రచురణల సంపాదక సభ్యునిగా ప్రముఖ విప్లవకవి జ్వాలాముఖి రచనలను ఐదు సంపుటాలుగా వెలువరించటం సంతృప్తి కలిగించిన అంశం.
జననం: గోనెపల్లి, సిద్ధిపేట జిల్లా. కవి, రచయిత, ఉపాధ్యాయుడు. 'మా తొవ్వ'(కవిత్వం), 'బతుకు పాఠం'(కవిత్వం), 'తప్ష'(కథ) ప్రచురించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 'తెలంగాణ పాటల్లో సామాజిక చిత్రణ' అనే అంశంపై పరిశోధన చేశారు. ప్రస్తుతం వేములఘాట్ ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్(తెలుగు)గా పనిచేస్తున్నారు.
పుట్టింది పెద్ద గూడూరు; తల్లి తండ్రులు: శ్రీహరి, పుష్పలీల; చదువు: ఎం.ఎ, బిఎడ్, (పిహెచ్.డి); ఉద్యోగం : స్కూల్ అసిస్టెంట్, తెలుగు; పాఠశాల పేరు : జిల్లాపరిషత్ సెకండరీ పాఠశాల వి.ఎస్ లక్ష్మీపురం. ప్రస్తుత నివాసం: మహబూబాబాద్. సెల్: 8978439551. రచనలు : 1. నీటి దీపం (కవిత్వం) 2. ఇన్ బాక్స్ (కవిత్వం). ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సుంకిరెడ్డి నారాయణరెడ్డి కవిత్వం, విమర్శ- పరిశీలన అనే అంశంపై డా.ఎస్.రఘు గారి పర్యవేక్షణలో పరిశోధన చేస్తున్నాడు.
ప్రభుత్వ ఉపాధ్యాయులు. గ్రామం - దాచారం, మం. బెజ్జంకి, జిల్లా - సిద్దిపేట( కొత్తది) కరీంనగర్ (పాతది)
మహబూబాబాద్ జిల్లాకు చెందిన తొర్రూరులో నివాసం. ప్రధానంగా వ్యవసాయ కుటుంబం. 2007 నుండి కవితలూ, కథలూ రాస్తున్నారు. 2007లో 'మనో నేత్రం' కవితా సంపుటినీ, 2008లో మరో కవితా సంపుటి 'నేల కంటి రెప్పల కదలిక' ని ప్రచురించారు. వందకు పైగా కథలు వివిధ పత్రికలలో వచ్చాయి. 2010లో 'బతుకు గోస' కథా సంపుటినీ, 2019లో 'మాతృవందనం' కథా సంపుటిని ప్రచురించారు. పదిహేను కథలకు బహుమతులు పొందారు.
జననం: నల్లగొండ జిల్లా. అసలు పేరు పద్మ మిర్యాల. బీఎస్సీ(B.Z.C), PG Diploma in Journalism. వృత్తి: జర్నలిస్టు. మొదట్లో 'కరుణ' పేరుతో కథలు రాశారు. 23ఏండ్ల వయసులో 'తాయమ్మ' కథ రాశారు. ఇది కరుణ మొట్టమొదటి కథ . రాసిన మూడేండ్ల తర్వాత 1996లో 'మహిళా మార్గం'లో అచ్చయింది. ఈ కథ పేరుతో 'కరుణ' '- 'తాయమ్మ కరుణ'గా మారింది. ఆంధ్రప్రభ, సాక్షి, ప్రస్తుతం 'నవతెలంగాణ'లో. మొదటి కథల సంపుటి 'తాయమ్మ మరికొన్ని కథలు' 2009లో, 2వ కథల సంపుటి 'జీవితం' 2018లో ప్రచురితమయ్యాయి. కవితలు, వ్యాసాలు అచ్చయ్యాయి. 13 ఏండ్లు విప్లవోద్యమంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పని చేశారు.
ఆలేరు, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ. కవి, సాహిత్య విశ్లేషకుడు, జర్నలిస్టు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ చదివారు. రచనలు: వెలుతురు వాహకం (కవిత్వం), జానపదం (పరిశోధన వ్యాసాలు) రచించారు.
జననం: కోవెలకుంట్ల, కర్నూల్ జిల్లా. ప్రభుత్వ ఉపాధ్యాయుడు, కవి. రచనలు: శిథిల చిత్రాల జాతర (వచన కవితా సంపుటి : 2013). బనగానపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.
పుట్టింది కరీంనగర్ జిల్లా కోహెడ మండలం, నాగసముద్రాల. కవి, రచయిత, ప్రభుత్వ ఉపాధ్యాయుడు. రచనలు: పునాస, ఎర్రమట్టి బండి(కవితా సంకలనాలు). చిక్కనవుతున్న పాట, పొక్కిలి, మత్తడి, మునుం, ఎడపాయలు, మొగులైంది, దూదిపూల దు:ఖం, నూరు అలల హోరు(ప్రజా సాహితి)లాంటి సంకలనాల్లో పలు కవితలు ప్రచురితమయ్యాయి.
జననం: సిద్ధిపేట. విశ్రాంత ఉపాధ్యాయుడు. రచనలు: 'గోరుకొయ్యలు', 'పట్టు కుచ్చుల పువ్వు', 'విరమించని వాక్యం' (కవితా సంపుటాలు). మంజీరా రచయితల సంఘం సభ్యుడు.
పుట్టింది అనంతారం(అనంతవరం), నల్లగొండ జిల్లా. కవి, సామాజిక కార్యకర్త. కులవృత్తి చేస్తూ సామాజిక నేపథ్యంతో కవిత్వం రాస్తున్నారు. రచనలు: వన్నె(2007), డాకలి దీర్ఘకవిత (2014), పుటం(2018) కవితా సంకలనాలు ప్రచురించారు. డెబ్భై మంది విశ్వకర్మ కవులతో 'రుంజ', 'అంకిలి' కవిత్వ సంకలనాలకు సంపాదకుడిగా పని చేశారు. "ఎరుక" సాహిత్య సాంస్కృతిక వేదికలో పని చేస్తున్నారు.
పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. సొంతూరు తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం. కవి, జర్నలిస్టు. గీతా విద్యాలయం(శ్రీకాకుళం)లో మొదలు పెట్టి ఎస్ఎమ్‌యుపి స్కూల్లో ప్రాథమిక విద్య. ఏడు రోడ్ల జంక్షన్‌లోని ఎం.హెచ్.స్కూల్లో ఉన్నత విద్య. ఆముదాల వలస, మందసల్లో ఇంటర్ తొలి, మలి సంవత్సరాలు. బారువాలో బి.కాం. డిగ్రీ చదివారు. ఉద్యోగ విరమణ అనంతరం తల్లిదండ్రులు స్థిరపడిన విశాఖలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడంతో, పొట్ట చేతబట్టుకుని 1995లో హైదరాబాద్ చేరిక. జర్నలిస్ట్ గా ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్, డిజిటల్ మీడియాల్లో పని. రచనలు: ‘ఒకేఒక్క సామూహిక స్వప్నావిష్కరణ’(2000), ‘దుర్గా పురం రోడ్’(2019) కవితా సంకలనాలు వెలువడ్డాయి. ‘దుర్గాపురం రోడ్’ కవితా సంపుటికి ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు, పాతూరి మాణిక్యమ్మ జాతీయ స్థాయి స్మారక సాహిత్య స్ఫూర్తి పురస్కారం ప్రకటించారు. తరచుగా కవిత్వం, అరుదుగా కథలు, అలవోకగా పుస్తక పరిచయాలు, అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు, అనువాదాలు, వ్యాసాలు రాస్తుంటారు.
పుట్టిన ఊరు వింజమూరు, నల్లగొండ జిల్లా. కవి, సామాజిక కార్యకర్త. ఎనిమిదో తరగతి నుంచే కవిత్వం రాస్తున్నాడు. ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం ప్రాచ్య కళాశాల(నల్లకుంట, హైదరాబాద్)లో డిగ్రీ చదువుతున్నాడు.
పుట్టిన ఊరు ఒంగోలు. అసలు పేరు కరిముల్లా ఖాన్. కలం పేరు నబి కరీంఖాన్. కార్మికుడు, సామాజిక కార్యకర్త, కవి. పదో తరగతి వరకు చదువుకున్నారు. కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టారు. CPMలో కొంత కాలం క్రితం వరకు సభ్యునిగా ఉండి పార్టీ ప్రజా సంఘాలైన యువజన, మైనారిటీ ప్రజా సంఘాలలో పనిచేశారు. అనారోగ్యంతో మరణించిన తన పెద్దన్నయ్య నబిఖాన్ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించేందుకు, తన క్షరాలలొ అన్న బతికే వుండాలని ఆకాంక్షతో వారి పేరును కలం పేరుగా పెట్టుకున్నారు. రచనలు: నిషిద్దాక్షరాలు(కవితా సంకలనం. రఫీ అనే మిత్రుడితో కలిసి 2003లో), వేకువకోసం (దీర్ఘ కవిత. 2007లో), ధోకా (దీర్ఘ కవిత. అముద్రితం). ఐదు కథలు రాశారు. అవి కథామినార్, మాతృక, ప్రియదత్త, ఆకాశవాణిలో ప్రసారం, ప్రచురితమయ్యాయి. 'గుజరాత్ గాయం' సంకలనం(2002) నుండి 'ముఖామి'(2017) వరకు అనేక ముస్లింవాద కవితా సంకలనాలలో నబి కరీంఖాన్ కవిత్వం ప్రచురితమైంది.
పుట్టింది ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కేవీ పాలెం. కథా రచయిత, విరసం సభ్యురాలు. గుంటూరు ఉమెన్స్ కాలేజీలో చదివారు. అక్కడే విద్యార్థి సంఘాలతో పరిచయం. రచనలు: జీవన స్పర్శ, గీతలకావల, నెగడు (కథా సంపుటాలు), పరామర్శ, జ్ఞానం అందరిదీ (వ్యాస సంకలనాలు), నర్రెంక సెట్టు కింద, ఒండ్రు మట్టి, నిషిధ, మేరువు (నవలలు) రాశారు.
పుట్టింది ములుగు జిల్లా అబ్బాపూర్. కవి, రచయిత, సామాజిక కార్యకర్త. అధ్యాపకుడు. ప్రస్తుతం హన్మకొండ లో నివాసం ఉంటున్నారు. కవిత్వం, పాటలు, కథలు రాస్తారు. యువకవులు, రచయితలను ప్రోత్సహించే లక్ష్యంతో 2007లో వరంగల్ రచయితల సంఘం స్థాపించారు. వివిధ సామాజిక అంశాలపై ప్రచురించిన పదిహేడు పుస్తకాలకు సంపాదకుడిగా ఉన్నారు. "ఆశయాల పందిరి" (కవిత్వం), "చావైనా రేవైనా"(వీధి నాటిక) స్వీయ సృజన రచనలు ముద్రించారు.
మహబూబ్ నగర్ జిల్లా. కవి, రచయిత, అధ్యాపకుడు. రచనలు : పక్షులు (దీర్ఘ కవిత), అతను వ్యాపిస్తాడు
(కవితాసంకలనం). జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇప్పటూర్(మహబూబ్ నగర్ జిల్లా)లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతానికి చెందినవారు. నివాసం హైదరాబాద్. జర్నలిజంలో పి.జి. చేశారు. వివిధ ప్రముఖ పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు. ప్రస్తుతం 'తెలంగాణ పవర్' అనే దినపత్రికకు, 'సమీక్ష' అనే మాసపత్రికకు ఎడిటర్ గా పని చేస్తున్నారు. 'ౙఖ్మీ' కవితా సంపుటి ప్రచురించారు. ముస్లిం జీవితాల్లోని సంఘర్షణలను ఆవిష్కరించేలా కథలు రాస్తున్నారు.
కవయిత్రి, కథా రచయిత. అధ్యాపకురాలు. పుట్టింది పూర్వ కరీంనగర్ జిల్లా, హుస్నాబాద్ మండలం పోతారం గ్రామం. ఎంఏ, బీఈడీ చదివారు. రచనలు: నెమలీకలు (నానీల సంపుటి) 2006, 'మట్టి నా ఆలంభన'(కవితా సంపుటి) 2009, 'మట్టి నానీలు'(నానీలు) 2015 ప్రచురించారు. వివిధ పత్రికల్లో కవిత్వం, కథలు అచ్చయ్యాయి.
లక్ష్మీపురం, పరకాల మండలం, వరంగల్ రూరల్ జిల్లా. జర్నలిస్టు. ఎంఏ(జర్నలిజం), ఎల్ ఎల్ బీ చదివాడు. ఓ దినపత్రికలో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నాడు.
వరంగల్ జిల్లా నెల్లికుదురు నివాసం. కవి, గాయకుడు. ఎం. కామ్, బీఎడ్ చదివారు. రచనలు: 'అలలు', 'పూలు రాలిన చోట', 'గెద్దొచ్చే కోడిపిల్ల' అనే పేర్లతో మూడు కవితా సంకలనాలు ప్రచురించారు. 1996 నుండి విరసం సభ్యుడిగా ఉన్నారు. ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. అప్పుడప్పుడూ సమీక్షలూ, పాటలు రాస్తున్నప్పటికీ ప్రధానంగా కవిత్వమే ప్రధాన వ్యాపకం.
పుట్టింది సిద్ధిపేట, చదివింది జిల్లా పరిషత్ హై స్కూల్ లచ్చపేట, సర్వేల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, జేఎన్‌టీయూ, ఓ యూ. వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో పదకొండేళ్లు అధ్యాపకునిగా, అమెరికాలో గత 20 ఏండ్లుగా ఐటీలో, 14 ఏండ్లు విరసం సభ్యుడు. మూడు కవితా సంకలనాలు 'కల్లోల కలల మేఘం', 'సందుక', 'వానొస్తదా'?, ఒక కవితా ప్రయాణ జ్ఞాపకాలు 'నడిసొచ్చిన తొవ్వ' – ఇప్పటిదాకా ప్రచురణలు. 'ప్రజాకళ', 'ప్రాణహిత'లతో సన్నిహిత సంబంధం.
పుట్టింది మంగలి పల్లె, గోదావరి ఖని. ఫ్రీలాన్స్ రైటర్. 2012నుంచి కవిత్వం, కథ, విమర్శ రాస్తున్నారు.
సామాజిక కార్యకర్త. గాయని. బుర్రకథ కళాకారిణి. ఇండిపెండెంట్ జర్నలిస్ట్. ఎం.ఏ (ఆర్థిక శాస్త్రం), ఎల్.ఎల్. బీ. చదివారు. ఆకాశవాణిలో పదేళ్ల పాటు casual announcer గా పని చేశారు. TV 9, Vanitha TV, 10TV ల్లో జర్నలిస్ట్ గా పనిచేశారు. యూనిసెఫ్, లాడ్లీ మీడియా అవార్డులతో పాటు, ఎలక్ట్రానిక్ మీడియా విభాగంలో ఉత్తమ జర్నలిస్ట్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మిషన్ భగీరథ అవార్డు అందుకున్నారు. Center for Sustainable Agriculture లో Krishi TV (వ్యవసాయ) యూట్యూబ్ ఛానల్ నిర్వహించారు. ప్రసుతం Voice of the People పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నారు. ఆరేళ్లుగా పిల్లల కోసం ' కథల ప్రపంచం ' పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నారు.