రాజూ, అతని సామ్రాజ్యం

రాజు సాష్టాంగ పడ్డాడు
ఎవరు ముందు అనుకున్నారు?
భలేవారే!
ఇదేమైనా అడగాల్సిన ప్రశ్నా అసలు?
విరిగిన వెన్ను ముక్క ఉన్న సామ్రాజ్యం ఎప్పుడు నేల మీద పడిపోయి,
ముఖాల మీద దాకా పాకుతూ ఉంటుంది
**
వినండి అటు
రాజభవనం బయట కొంతమంది బీద ఆడపిల్లలు
న్యాయం కోసం ఏడుస్తున్నారు
రాజు మాత్రం వాళ్ళని ఎప్పటికీ వినడు
రాజు సైనిక పటాలం ఏడ్చే స్త్రీల వాళ్ళ గొంతుల్ని నొక్కేస్తుంది
రాజేమో ఏమి పట్టనట్టు దేవుళ్ళ ముందు కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడు
ఏ దేవుడయితే న్యాయాన్ని ఇష్టపడడో,
ఆ దేవుళ్ళ ముందు అన్నమాట
ఈ నక్క ధ్యానాలన్నీ
**.
ఆకలి దహించే అభాగ్య జీవులు అన్నం కోసం అడుగుతారు
రాజేమీ మరి రాణి కాదు కదా
రాజు చాలా దయగడవాడు
ఆకలిగొన్న వాళ్ళని కేక్ కాకుండా బ్రెడ్ తినమని చెప్తాడు లేదా మౌనంగా ఉంటాడు
ఆకలేసిన ప్రజలకి 2002 నుంచీ రాజు మౌనాన్ని తినిపిస్తూ ఉన్నాడు
మౌనం శక్తి ఏమిటో రాజుకు తెలుసు
అది బుల్లెట్ల కంటే తీవ్రంగా,
అత్యంత త్వరగా ఎక్కువ మందిని చంపుతుంది
**
అవును
రాజు సాష్టాంగపడ్డాడు
ఆకలి, దారిద్ర్యపు సూచిక అతన్ని లేచి నిలబడేలాగా చేయలేదు
మద్దతుదారుల వందిమాగదుల మంత్రులు
అతనికి శృతి పాడుతూనే ఉంటారు
**
నిలబడి ఉన్న స్త్రీలు దూరాన దూరాలను పాటించాల్సి వస్తోంది
మొదటి స్త్రీ రెజీనా హిల్స్ ని దాటలేకపోయింది(ఢిల్లీ పీఠాన్ని)
ఎప్పటిలా మగవాళ్ళ దళంలో స్త్రీలకి ఏ అవకాశం లేకుండా పోయింది
మద్దతుదారుగా లేదా రాజ్యాధికారిగా రెండు అవకాశాలూ స్త్రీలకి దక్కలేదు
**
చూడు మరి
రాజు ఇంకా సిగ్గు లేకుండా నేలను బడి పాకుతూనే ఉన్నాడు
అతన్ని జోకర్ గా మాత్రం పిలవకండి
జోకర్ మనల్ని కడుపుబ్బ నవ్వించడా ఏంటి?
కానీ చూడండి రాజ్యాంగం నెత్తురు కారుతోంది
ప్రజాస్వామ్యం మరణిస్తే మీరు నవ్వుతారా చెప్పండి?

  • మూలం : మౌమితా ఆలం
  • అనువాదం : గీతాంజలి

డా. భారతి : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. ర‌చ‌న‌లు: 1. ఆమె అడవిని జయించింది, 2. పాదముద్రలు, 3. లక్ష్మి (నవలిక), 4. బచ్ఛేదాని (కథలు), 5. ప‌హెచాన్‌ (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 6. పాలమూరు వలస బతుకు చిత్రాలు (కథా సంకలనం), 7. హస్బెండ్ స్టిచ్ (స్త్రీల విషాద లైంగిక గాథలు), 8. అరణ్య స్వప్నం (కవిత్వం), 9. ఇల్లొక రాజకీయం (రాజకీయ కవిత్వం).

2 thoughts on “రాజూ, అతని సామ్రాజ్యం

  1. Buchireddy gangula
    ===================
    All the countries are ruled by kings —ANY COUNTRY
    NICE ONE MADAM

Leave a Reply