రచయితలకు సూచనలు

‘కొలిమి’ ప్రజల వైపు నిలబడే, ప్రజాస్వామిక విలువలను ప్రతిఫలించే రచనలను ప్రచురిస్తుంది. ఆ  రచనలలో సామాజిక బాధ్యతతో పాటు ఉన్నతమైన సాహితీ విలువలు ఉండాలని మా కోరిక.

మీ రచనలను సంపాదకవర్గం సమీక్షించి తదుపరి సంచిక ప్రచురించే లోపు మీకు నిర్ణయం తెలియజేస్తుంది.

ఇంతకుముందు వేరే పత్రికలో కానీ వెబ్ లో కానీ ప్రచురితమైన/ ప్రచురణకు పరిశీలనలో ఉన్న రచనలు ‘కొలిమి’ కి పంపకపోతే బాగుంటుంది.

రచన ప్రచురణకు తీసుకునే విషయంలో తుది నిర్ణయం ‘కొలిమి’ సంపాదకవర్గానిదే.

మీ రచనలను ప్రతి నెలా 25వ తారీకు లోపు పంపించండి. 25 తర్వాత వచ్చిన రచనలు, తర్వాతి సంచిక కోసం పరిశీలిస్తాం.

‘కొలిమి’లో ప్రచురించిన వారం రోజులవరకు మీ రచనని మీ సొంత బ్లాగుల్లో, ఫేస్ బుక్ లాంటి వాటిలో ప్రచురించుకోదలచుకుంటే ‘కొలిమి’ లింక్ ద్వారా మాత్రమే షేర్ చేసుకోవాలని మా విజ్ఞప్తి.

మీ రచనని యూనీకోడ్ లో టైప్ చేసి పంపించాలి. అచ్చుతప్పులు లేకుండా ప్రూఫ్ రీడింగ్, సక్రమమైన  ఫార్మాటింగ్ జాగ్రత్తలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి.

మీ రచనలను kolimimag@gmail.com కు పంపించండి.

మీ రచనకు సరిపోయే ఫొటోలు, చిత్రాలు మీ దగ్గర ఉన్నట్టయితే రచనతో పాటు వాటిని పంపండి. అవి ఆమోదయోగ్యంగా ఉన్నట్టయితే వాటిని మీ రచనతో ప్రచురిస్తాం.

మొదటి సారి ‘కొలిమి’ కి మీ రచనని పంపుతున్నట్టయితే మీ ఫొటో, చిన్న బయోడేటా (7-8 వాక్యాల్లో పుట్టిన ఊరు, విద్య, వృత్తి, సాహిత్య కృషి) పంపించండి.

‘కొలిమి’కి మీ రచనలే కాదు, మీ అభిప్రాయాలూ, సూచనలూ కూడా చాలా అవసరం. ‘కొలిమి’లో ప్రచురితమయిన రచనలపై మీ అభిప్రాయాలని తప్పక తెలియజేయండి. ఇతర సూచనలు లేదా ప్రశ్నలు kolimimag@gmail.com కు ఈమెయిల్ చేయండి.