మా నాన్న పుట్టింది తెనాలిలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో. చదివింది తెనాలి, గుంటూరు, విజయనగరం, కాశీలలో. తెనాలిలో విద్యార్థి దశలోనే గాంధీ…
Author: శాంత సుందరి
నాలుగు దశాబ్దాలకు పైగా అనువాద రంగంలో కృషి చేస్తున్నారు. కథ, కవిత, నవల, నాటకం, వ్యాసాలు, ఆత్మకథలు, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అన్ని ప్రక్రియల్లోనూ అనువాదాలు చేసి 76 పుస్తకాలు ప్రచురించారు. కొడవటిగంటి కుటుంబరావు వీరి తండ్రి. ఆయన రాసిన నవల 'చదువు'ని హిందీలోకి అనువదించారు. ఈమె చేసిన అనువాదాలలో, 'మహాశ్వేతాదేవి ఉత్తమ కథలు', ' అసురుడు', డేల్ కార్నెగీ రాసిన రెండు పుస్తకాలూ, 'బేబీ హాల్దార్ జీవిత చరిత్ర' వంటివి ముఖ్యమైనవి. ఇవికాక ఎన్నోకవితా సంపుటాలనూ, సంకలనాలనీ, కథా సంకలనాలనీ హిందీ-తెలుగు భాషల్లో అనువదించారు. వైరముత్తు కవితలని తెలుగులోకి అనువదించారు. సాహిత్య కుటుంబంలో జన్మించిన శాంత సుందరికి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. రెండు తెలుగు సినిమాల స్క్రిప్టుని హిందీలోకి అనువదించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు.