చెట్టు కూలిన రేయి 

అగ్ని సరస్సు ఒడ్డున
పెరిగిన ఎర్ర పూల చెట్టు
ఎరుగదు నాగరికం
స్వచ్ఛంగా పెరిగి
అలాగే రాలిపోతుంది
ఆకాశాన్ని చూస్తూ లేస్తుంది
కూలిపోతూ భూమాతనే తలుస్తుంది
దానికి కారణం నిత్య రణం
వేటగాడి గొడ్డలి దెబ్బ తెలుసు
ఎందుకు పెరిగి ఒరిగి పోయిందో
దానికి తెలుసు
నీరు పోసిన తల్లి కి తెలుసు
దాని నీడలో కూచుని తిని
సాగిపోయే బాటసారులకు
అది కేవలం ఒక చర్చకు తానం
అది పిడుగు పడి కూలిన రేయి
ఒక్క తడి కన్నీటి చుక్క రాలలేదు
మేఘాల మెరుపు వెలుగులో
ప్రకృతి మాత్రం అలిగి ఉరిమింది !!

జె. రవీంద్రనాథ్  యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో  డాక్టరేట్ డిగ్రీ పొంది తరువాత విశాఖపట్నంలో గాయత్రి ఇంజినీరింగ్ కాలేజీ లో ఇంగ్లీషు ప్రొఫెసర్ గా చేసి 2022 లో రిటైర్ అయ్యారు.  వివిధ  జర్నల్స్, పుస్తకాలలో 35 వ్యాసాలు ప్రచురించారు.  ఇండియన్ సోషల్ సైన్స్ అకాడమీ నుంచి బసంత్ సర్కార్ మెమోరియల్ గోల్డ్ మెడల్ అవార్డు అందుకున్నారు.ఎనిమిది  సృజనాత్మక రచనలు -- Sow the Spring, Dove and the Mother Earth , Suburban Sparrows , Empathy as Life , రష్యన్ గీతాలు, ఎద లోతుల్లో, నల్ల కలువ,   ఏకాంత యానం ప్రచురించారు.

2 thoughts on “చెట్టు కూలిన రేయి ”

Leave a Reply