ఇంగ్లీష్ : మౌమితా ఆలం
అనువాదం : గీతాంజలి
ప్రియా
ఏ భాషలో నిన్ను ప్రేమించను చెప్పు?
నా యోనికి సంబంధించిన నా మాతృభాష
నా తండ్రి తరచూ వాడే బూతుల్లో ఉంటుంది
అది వినకుండా మా అమ్మీ ఎప్పుడూ
మా చెవులు మూసేస్తూ ఉంటుంది
మా అన్న తన స్నేహితురాళ్లని
చుతియా (హిందీ, ఉర్దూ భాషల్లో స్త్రీ యోని అని అర్థం) అంటూ ఉంటాడు
అందుకు శిక్షగా మా నాన్న
వాడితో వంద గుంజీలు తీయిస్తాడు
ఈ లోకంలోకి ఎలా వచ్చామని
మా చిన్న చెల్లెలు నన్ను అడుగుతుంది
మా అమ్మ ఖంగారుగా మా నోర్లు మూసేస్తుంది
ఎన్నో ప్రార్థనల తరువాత,
మేము స్వర్గం నుంచి జారవిడువ బడ్డ,
ఆ అల్లాహ్ ఇచ్చిన పవిత్రమైన కానుకలమని చెబుతుంది
మా దేహంలో ఉన్న రంధ్రం
కేవలం శరీర విసర్జనాలకి మాత్రమే అని కూడా చెబుతుంది
మేమప్పుడు అసహ్యంతో ముడుచుకు పోతాం
రక రకాల భాషలతో మాట్లాడే
నాలుకలు ఉన్న మా భర్తలకు
అసలు యోని అంటేనే తెలీదు
వాళ్ళ భాషలో నేను
కేవలం రెండు అంగుళాల లోతున్న రంధ్రాన్ని మాత్రమే
ఇక నేనెలా నిన్ను ప్రేమించను నా ప్రియుడా చెప్పు?
నా దేహంలో నాకు సుఖాన్నిచ్చే భాగం
అత్యంత సిగ్గు పడాల్సింది గా మార్చబడినప్పుడు
ఎలా ప్రేమించాలి నిన్ను?
నా ప్రియుడా…
ఇకనైనా
నన్ను గాఢంగా అదుముకుంటావా?
దేహానికి, శృంగారానికి సంబంధించి
నీకు మునుపు నేర్పించిన భాషని వదిలేస్తావా?
ఇకప్పుడు ఏ మొహమాటం లేని,
అద్భుతమైన ఆనందాన్ని ఆస్వాదించే ప్రేమికుడిలా
నా లోపల విరబూస్తావా చెప్పు?
ఈ భాషా బంధనాల పరిమితులను అతిక్రమించి,
ప్రేమించుకునే భాషాంతర శకంలో,
నా ప్రేమికుడా…
రా నన్ను గట్టిగా హత్తుకో!
(భారత దేశంలో చాలామంది స్త్రీలకి భావప్రాప్తి అంటే ఏంటో కూడా తెలీదు. శృంగారంలో ఆనందం ఒక్క పురుషుడికి మాత్రమే సంబంధించినదిగా చెలామణి అవుతున్నది. చాలా భాషల్లో స్త్రీల శరీర భాగాలు ముఖ్యంగా లైంగిక అవయవాల పేర్లు బూతులుగా వాడబడుతున్నాయి. భాషలు స్త్రీల లైంగిక అవయవాలను హీనంగా చూసినప్పుడు పురుషులకి మల్లె సహజసిద్ధమైన స్త్రీల శృంగార కోరికలు కూడా వక్రీకరణలకి, నిషేధాలకి గురి అవుతాయి.)
*
రక్షణనిచ్చే పిన్నీసుల రాణిని
ఇంగ్లీష్ : మౌమితా ఆలం
అనువాదం : గీతాంజలి
ఆశపోతు మగవాళ్ళ కళ్ళు
నా నడుము మీద పడకుండా ఉండడానికి
చీర కుచ్చులకి సేఫ్టీ పిన్నులు ఎలా పెట్టుకోవాలో
మా అమ్మ నాకు చాలా బాగా నేర్పించింది!
పుష్టిగా ఉండే నా వక్షోజాలు
ఎక్కడ మగవాళ్ళ గుండెల్లో తుఫాను రేపుతాయో అని
అమ్మ ఎప్పుడు జాగ్రత్త పడుతూనే ఉండేది
నిజానికి నేను సేఫ్టీ పిన్ రాణిని అన్న పేరుని అక్షరాలా స్వీకరించాను
నా చనుమొనల్లో, జననాంగాల చుట్టూ ఉండే వెంట్రుకల చుట్టూ
సేఫ్టీ పిన్నులతోటే పెరిగాను మరి!
ఇప్పుడు సేఫ్టీ పిన్నులు
నా బొడ్డు కింద నుంచి మోచేతులకి,
వేళ్ళతో పాటు నా శరీరంలోని అన్ని భాగాల నుంచి
ఎలా వేలాడుతూ ఉన్నాయో చూడండి!
ఇంకోసారి ఒంటినిండా పిన్నులు గుచ్చుకున్న మగాడు
ఇంటికి వచ్చినప్పుడు
అతనికి నొప్పి తగ్గించే ఆయింట్మెంట్ ఇచ్చేముందు
అతడు నా దారిలోకి ఎవరూ పిలవకుండానే వచ్చాడని గ్రహించాలి!
ఎందుకంటే
నేనిప్పుడు సేఫ్టీ పిన్నుల మహారాణి ని మరి!
alam ji
Great poems madam
Done great job gitanjali garu
All her poems publish a book madam
Plus guys -minus girls —this kind of mentality needs to go
Both are equal -respect each other
Using foul language —needs education — family values —discipline
These values comes from family not from modi ji— or govt
————-buchireddy gangula