లెనిన్ గీతాలు

అనువాదం : గీతాంజలి

రష్యాకి చెందిన కామ్రేడ్ లెనిన్
ఎత్తుగా ఉన్న మార్బుల్ సమాధిలో విశ్రాంతి తీసుకుంటూన్నావా ?
కొంచెం పక్కకి జరుగు కామ్రేడ్…
లేచి నాకు కూడా కొంచెం చోటివ్వు

విను లెనిన్
నా పేరు ఇవాన్
నేను రైతుని
బురదతో నిండిన బూట్లు వేసుకున్న వాడిని
నేను కూడా నీతో కలిసి పోరాడాను
కామ్రేడ్ లెనిన్…
ఇప్పుడు నా పని పూర్తయింది.

ఓ రష్యా కామ్రేడ్ లెనిన్
మార్బుల్ సమాధిలో సజీవంగా ఉన్నావా?
కొంచెం పక్కకు జరిగి నాకు కూడా కాస్త నీ పక్కనే చోటు కల్పించు

నేను చీకోని నల్ల జాతికి చెందిన నీగ్రోని
మండే ఎండలో చెరుకు నరుకుతున్నాను
చూడు నేను నీకోసమే బతికాను
కామ్రేడ్ లెనిన్, ఇప్పుడు నా పని ముగిసింది

రష్యా కామ్రేడ్ లెనిన్
అత్యంత గౌరవాన్ని పొందిన వాడా
మార్బుల్ సమాధిలో ఉన్నావు కానీ
కొంచెం పక్కకు జరుగు కామ్రేడ్
లేచి నాకు కూడా కొంచెం చోటు ఇవ్వు

నేను షాంగై వీధుల్లో సమ్మె చేస్తున్న కర్మాగార కార్మికుడిని
నా పేరు సాంగ్
విప్లవం కోసం ఏమైనా చేస్తాను
పోరాడుతాను… ఆకలితోనైనా ఉంటాను
అవును విప్లవం కోసం ప్రాణ త్యాగం చేస్తాను

రష్యా కామ్రేడ్,
మనకందరికీ ప్రియమైన లెనిన్
మార్బుల్ సమాధి నుండి ఇలా చెబుతున్నాడు వినండి
కార్మికులతో కలిసి జాగరూకతతో ఉంటాం
ఎప్పటికీ మేమీ ప్రపంచానికి కాపలాదారులమే
గుర్తు పెట్టుకోండి
ప్రపంచమంతా మన స్థావరమే

ప్రముఖ అమెరికన్ ఆఫ్రికన్ కవి. నవలా రచయిత, నాటక కర్త. హార్లెం పునర్జీవన ఉద్యమ నాయకుడు. ఆఫ్రో అమెరికన్ల జీవితాలను వారి కష్టాలను జాజ్ సంగీత శైలిలో తన కవిత్వంలో ప్రతిబింబించిన మొదటి జాజ్ కవిగా ఆయన ప్రసిద్ధులు. "ది నీగ్రో స్పీక్స్ ఆఫ్ రివర్స్", "ది వెరీ బ్లూ స్", "లెట్ అమెరికా బి అమెరికా అగైన్"! హ్యూజ్ ప్రసిద్ధ రచనలు. 1ఫిబ్రవరి, 1901 మిస్సోరీ లోని జోప్లిన్ లో జన్మించారు. కొలంబియా యూనివర్సిటీలో బీయే (BA) చేశారు. 1920 నుండి 1960 వరకు కవిత్వం, నాటకాలు, నవలలు వ్యాసాలు రాశారు. హార్లెం పునరుజ్జీవన ఉద్యమంలో కీలకపాత్ర పోషించి నల్లజాతీయుల సంస్కృతిని హక్కులను తన రచనల ద్వారా బలంగా వినిపించారు. సామాజిక అసమానతలను జాత్యహంకారాన్ని తన రచనలలో ప్రశ్నించారు. సాధారణ ప్రజల భాషలో వారి అనుభవాలను జాజ్ బ్లూ స్కీమ్స్ తో కవిత్వంగా రాశారు . జాజ్ సంగీత కవిత్వాన్ని రాసిన మొదటి కవి.

Leave a Reply