తెలుగు అనువాదం : గీతాంజలి
నా నేరమేంటి అని వాళ్ళని నేను అడుగుతాను
నువ్వు పదునైన నాలుకని కలిగి ఉండడమే నేరం అని వాళ్లు సమాధానం ఇస్తారు
ఓహో అదొక్కటే కదా అని నేనంటాను
లేదు… అంటూ
చాలా నే రారోపణలున్న ఛార్జ్ షీట్ ని నా చేతుల్లో పెడతారు
**
ఆ చార్జి షీట్ లో పనిచేయని నా సర్వనామాలు
అంటే అది, ఇది, ఆమె, ఆవిడ లాంటి పేర్లతో ఉన్న స్త్రీ అని ఉంటుంది
ధృడంగా ఉన్న వెన్నుముకతో పెద్దగా అరిచే స్త్రీ, కరిచే స్త్రీ అని కూడా ఉంటుంది ఆ చార్జి షీట్ లో
**
అంతేనా…
తన వాళ్ళు ఆకలిగా ఉన్నప్పుడైతే,
సౌమ్యతతో ఉండే అత్యున్నత ధర్మపన్నా లను, కుట్రా మౌనాలను
కోపంగా కొట్టిపడేసే స్త్రీ అని కూడా రాయబడుతుంది
**
చాలా మంది పోలీసులు నన్ను చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు
తల్లిదండ్రులు, సమాజం, స్కూల్స్,రాజ్యం, ఇంకా NIA
ఓహ్ నాకు ఎన్ని పేర్లో చూసారా?
**
కొంతమందికి నేను పారిపోయిన నేరస్థురాలిని
ఇంకా చాలా మందికి తీవ్రవాదిని
నా దగ్గర తుపాకులు లేవనే వాళ్లంటారు
కానీ వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే…
నేను అరుంధతీ రాయ్ నీ, మీనా కందస్వామిని కూడా చదువుతానని
బహుశా అందుకే వాళ్లకి
తుపాకి కన్నా పదునైన నాలుక ఉన్న స్త్రీగా నేనంటే అంటే భయమే మరి
NICE ONE
ARUNDHATHI ROY IS A GREAT WRITER — BUT ON KASHMIR ISSUE SHE IS DIFFERENT
-DOUBLE STANDARDS
============BUCHIREDDY GANGULA