‘దళిత కథావార్షిక- 2020’కి కథల ఆహ్వానం

ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో 1 జనవరి 2020 నుండి డిసెంబర్ 31, 2020 వరకు వివిధ దిన, వార, పక్ష, మాస పత్రికలలోనూ, అంతర్జాల పత్రికలలోనూ ప్రచురితమైన దళిత కథలు నుంచి ఎంపిక చేసిన కథలతో ‘దళిత కథావార్షిక – 2020’ పేరిట కథా సంకలనం (isbn నంబర్ తో) ప్రచురించాలని సంకల్పించాం. దళిత కథకులు తమ కథలను ఫాంట్ సైజ్ 15 తో అను పేజి మేకర్ ఓపెన్ ఫైల్, పిడిఎఫ్ ఫైల్ లేదా యూనికోడ్ ఓపెన్ ఫైల్ పంపగలరు. కింది ఈమెయిల్ కు జనవరి 10, 2021 లోగా పంపగలరని కోరుతున్నాం.

Email: sygiri773@gmail.com

ఫోన్:
9441244773,
94933 19878,
9441641702

సంపాదకులు:
డా. సిద్దెంకి యాదగిరి
గుడిపల్లి నిరంజన్
తప్పెట ఓదయ్య

జ‌న‌నం: గోనెపల్లి గ్రామం, చిన్నకోడూరు మండలం, సిద్ధిపేట జిల్లా, తెలంగాణ. కవి, రచ‌యిత, ఉపాధ్యాయుడు. జంబూ సాహితీ వ్యవస్థాపకులు. ఉస్మానియా విశ్వవిద్యాలయం (2009–2016) నుంచి “తెలంగాణ పాటల్లో సామాజిక చిత్రణ” అంశంపై పీఎచ్.డి. పరిశోధన చేశారు  (2017). రచనలు : కవిత్వం : 'మా తొవ్వ‌'(క‌విత్వం), 'బ‌తుకు పాఠం'(క‌విత్వం), కథలు :  'త‌ప్ష‌'(క‌థ‌); సాహిత్య విమర్శ : ముక్వారు (సాహిత్య వ్యాసాలు) - 2025, పాట ముచ్చట (పాటలపై విశ్లేషణ - 2026) ప్రచురించారు. జంబూ సాహితీ ఆధ్వర్యంలో గుడిపల్లి నిరంజన్, తప్పెట ఓదయ్య గారలతో కలిసి దళిత కథా సిరీస్ కు సంపాదకత్వం వహిస్తున్నారు. సంపాదకత్వం : 1. తొండం బొక్కెన - తొలి తెలుగు దళిత కథా వార్షిక (2020), 2. చిందూ నేల - దళిత కథ (2021), 3. సాక - దళిత కథ (2022), 4. కొమ్ము - దళిత కథ (2023), 5. గండదీపం - దళిత కథ (2024). డిజిటల్ రిసోర్స్ : siddenky.blogspot.com, యూట్యూబ్ ఛానల్ : “తెలుగు సిరి – డా. సిద్దెంకి”, ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇబ్రహీంనగర్, చిన్నకోడూరు మండలం, సిద్ధిపేట జిల్లా, తెలంగాణలో స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) గా పనిచేస్తున్నారు.

 

 

Leave a Reply