కరీబియన్  శకుంతలాలు

మూలం: పాబ్లో నెరుడా
అనువాదం : డా.జె.రవీంద్రనాథ్

మనుష్యులు లేని చిరు గాలి అలలో
నిన్ను ఆహ్వానిస్తున్నా పక్షుల పండుగకు,
గాలిలొ రివ్వున సాగే పిచ్చుక,
కనులు చెదిరే కాంతి తో హమ్మింగ్ బర్డ్
ఆకాశాన్ని చీల్చే గృహ ప్రక్షాళకుడు
విచారం లోని కొంగ కోసం
ఉషోదయాన
రాత్రి డేగ యొక్క రంగు అల్లినదాకా.
వో పిట్టల్లారా కరీబియన్ రత్నాల్లారా,
క్వెట్జల్ , దివి నుంచి తొలి కిరణం
సమీరంలో సాగే హరిత ఆభరణం
నారింజ రంగు పక్షులు
గగన నీలి చుక్కలతో
నగ్న బీభత్స నిప్పులో పుట్టినవి:
రండి నా చిరు మానవ గీతానికి,
వాటర్ ట్రూపియల్, కౌజు పిట్టలు,
అద్భుత రూపాల్లో పాడే పిట్టలు,
నేల పావురాలు,
బంగారు రంగులో గాలిలొ నర్తకులు
బల్లెం తోక తో అతి నీల లోహిత ” టిన్టోరాలు, “
రాళ్ళ కాకులు, నీటి పక్షులు,
సహచరులు, రహస్య నేస్తాలు,
ఎలా మీ ఈకలు పూలను మించిపోయాయి?
పసుపు వన్నె పిట్ట, అజేయమైన వడ్రంగి పిట్ట
నేనేమి చేయాలి పాడేందుకు
వెనిజువేలా మధ్యలో , మీ గూళ్ళ పక్క
దివ్య సంకేతం
మంచు యొక్క జాలర్లు పిచ్చుకలు
సుదూర దక్షిణాది నుంచి నా స్వరం
అస్పష్టంగా, ప్రశాంత హృదయ స్వరం,
కరీబియన్ ఇసుక పై నేను ఏమీ కానా
శీతల ప్రాంత శిలను తప్ప?
నేనెలా పాడగలను మధుర సంగీతం,
ఈకలు, కాంతి, శక్తి గురించి
నమ్మకం లేకున్నా నేను చూసింది లేదా
నేను విన్నాను అని నమ్మశక్యం కానిది?
ఏలన ఎర్ర కొంగలు నా సమీపానే సాగాయి:
అవి ఎగురుతున్నాయి ఎర్ర నదిలా
వెనిజువేలా వెలుగుకు ఎదురుగా,
నీల మణిలో మండే సూరీడు
లేచాడు అందానికి గ్రహణంలా:
ఈ విహంగాలు విహరించాయి పండుగ నుంచే.
నీవు చూడకుంటే కెంపు రంగులోని కొరోకోరో
వేలాడే గూడులా ఎగురుతూ
గాలిని కొడవలిలా కోస్తూ,
ఆకాశమంతా అల్లారుస్తూ
నారింజ రంగు ఈకల బారు సాగుతుంటే
మండే మెరుపు తీగలా,
నీవు చూడకుంటే కరేబియన్ గగనతలం
గాయం లేకుండా రుధిరంలా పారటం,
నీకు తెలియదు ఈ జగత్తు సౌందర్యం
నీకు లేదు నీవున్న ప్రపంచ చైతన్యం.
అందుకే నే మాటాడుతూ, పోరాడుతున్నా
అందరి కోసం చూసి, జీవిస్తా:
నా విధి మీకు తెలియంది చెప్పటం
మీకు తెలిసింది మీతో కలిసి పాడటం:
మీ కనులు నా మాటలను అనుసరిస్తాయి
నా మాటలు గోధుమలో బ్రతుకుతాయి
అవి కరీబియన్ రెక్కలతో ఎగురుతాయి
లేదా మీ శత్రువులతో పోరాడతాయి.
నాకు ఉన్నాయి బాధ్యతలు ఎన్నో, నేస్తాల్లారా, నేను
పోతున్నా మరో అంశానికి, సెలవు మరి.

Leave a Reply