24న ‘సాహితీ నాగసూర్యమ్'(డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ సాహిత్యంపై సదస్సు)

జానుడి – సెంటర్ ఫర్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ సాహిత్యంపై జనవరి 24 (ఆదివారం) సాయంత్రం 6 గంటల నుంచి ఆన్లైన్ సాహిత్య సదస్సు జరుగుతుంది.

  • సాహితీ వీక్షణం, సాహితీ స్పర్శ’పుస్తకాలపై డాక్టర్ కాళ్లకూరి శైలజ,
  • ‘విద్వాన్ విశ్వం’ పుస్తకంపై డాక్టర్ అప్పిరెడ్డి హరనాథరెడ్డి,
  • మదరాసు బతుకులు (కథలు)’పై సయ్యద్ సలీం,
  • చెరగని స్ఫూర్తి తాపీ ధర్మారావు’ పుస్తకంపై డాక్టర్ శ్రీమతీ రామ్ నాథ్,
  • కథా వరణం (పర్యావరణ కథలు)పై డాక్టర్ శిరంశెట్టి కాంతారావులు మాట్లాడుతారు.
  • ఈ సభలో ముఖ్య అతిథిగా ప్రముఖ రచయిత, విశ్రాంత ఐ ఏఎస్ అధికారి డాక్టర్ అంగలకుర్తి విద్యాసాగర్ పాల్గొని ప్రసంగిస్తారు.
  • ఈ సభలో జానుడి – సెంటర్ సలహాదారు మల్లవరపు ప్రభాకరరావు ఆప్త వాక్యం అందిస్తారు.
  • సమన్వయకర్తలుగా డాక్టర్ నూకతోటి రవికుమార్, జల్దా విశ్వనాథ కుమార్ వ్యవహరిస్తారు.

– డాక్టర్ నూకతోటి రవికుమార్,
డైరెక్టర్
జానుడి – సెంటర్ ఫర్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్

Leave a Reply