రాత్రికి రాత్రి
నేను సుసంపన్నమౌతాను
పరిమళిస్తాను
నాన బెట్టిన విత్తనం
ముడి విప్పి మొలకెత్తినట్టు
తెల్లారుజాముకు బతుకుతాను
రాత్రిపూట
కన్ను కొరికిన క్షణం
మహా చిత్రమైన కునుకు
చిక్కని చీకటి పొద
ఎవరో తరిమినట్టుకల
కిందకు తోస్తున్నట్టు కల
మూసిన తలుపులు,కిటికీలు మధ్య
లేచిపోయిన మనస్సు
కలత కలత నిద్ర
ఉసిళ్ళు పిగిలినట్టు దృశ్యాలు
తెరలు తెరలు గా బతుకులు
పడగ విప్పి ఆడుతున్న
విష సర్పాల ఆట
కలత కలత నిద్ర
అదేపనిగా
కిందకు చూసే ఆకాశం
మాటిమాటికి ఉలిక్కిపడే సముద్రం
వణుకుతున్న రక్తం
ఆగుతున్న ఊపిరి
మబ్బులు పట్టిన నీడలు
ఊడలు దిగిన భయం
మసక మసక రహస్యాలు
కలవరింతల సందోహం
తొలకరిలా పట్టిన చెమట
మిత్రుడు పోయినట్టు కల
చెట్టు కూలిన చెడ్డ కల
పండిన పైరును
బెదిరిస్తున్న నల్లటి మేఘం
ఎండుతున్న పంటను
వెక్కిరిస్తున్న తెల్లటిమేఘం
మోగుతున్నఅతీంద్రియ శబ్దాల వీణ
ప్రతీ రాత్రి
ఒక తాత్కాలిక మరణం
తెల్లారిన
ప్రతీ క్షణం ఓ పురిటి బిడ్డ
Super sir
Thellarina prathi rathri oka purti bidda chala adbutham ga undi
Chala Chala baga rasaru sir meru. Conclusion adbhutam 👏👏👏❤️❤️👌👌👌
చాలా బాగుంది…
ప్రతి రాత్రి ఒక తాత్కాలిక మరణం….
పోయం చాలా బావుంది సర్
పదచిత్రాలు గొప్పగా వున్నాయి. మంచి కవిత. మిత్రునికి అభినందనలు
ఆహా
ప్రతీ క్షణం ఓ పురిటి బిడ్డ…👌సూపర్ సర్…💐అభినందనలు….