అవున్రా అయ్యా
టన్నులకొద్దీ ప్రజాస్వామ్యం
మేము మోయలేపోతున్నాం
తిన్నదరక్క
అయినదానికీ కానిదానికీ
మేము రోడ్డుమీదకొచ్చి చిందులేస్తున్నాం
షహీన్బాగ్లో పండుముసలోళ్లం
పనీ పాట లేని ఆడోళ్ళం పసిపిల్లలతో
పోని పౌరసత్వం కోసం పోట్లాటకొచ్చాం
రాజధాని సరిహద్దుల్లో పిక్నిక్కి వచ్చాము
పొలం పనులొదిలేసి
చలి కాసుకుంటూ పిజ్జాలు తిందామని
కనీస కామన్ సెన్స్ లేకుండా
రోడ్డుకడ్డంగా ట్రాక్టర్లు విడిచేసి
నీళ్ల ఫిరంగులుతో నాట్యమాడుతూ
ప్రజాస్వామ్యంలో పరవశిస్తూ !
దేశమంతా ఎటుచూసినా
ప్రజాస్వామ్యమే
తాండవిస్తుందిరా అయ్యా
ఢిల్లీ డ్రైనేజీల్లో కొట్టుకొచ్చిన శవాలు
జామియా లైబ్రరీలోకిదూరిన లాఠీలు
జేఎన్యూలో ముసుగేసుకొచ్చిన బాటన్లు
హత్రాస్లో ఆరని రహస్య చితి మంటలు
అంతా ప్రజాస్వామ్యంగానే !
ఆకలి అన్యాయం ఆత్మగౌరవం అంటూ
నోరేసుకుని న్యూసెన్స్ చేసేటోల్లని
లోపలకి తోసేయండహే
లైన్ అఫ్ కంట్రోల్ లేకపోతే
ప్రజాస్వామ్యం వెర్రితలలేస్తుందిరో !
Veryveryvery nice
వాస్తవానికి అక్షర రూపం
Today’s reality