బతుకు ఒక గొప్ప యుద్ధక్షేత్రమైనపుడు
కాలంతో నిత్యం పోరాటం చెయ్యకతప్పదు
జీవితం నిత్యపోరాటాల అనంతసాగరం
బతుకు ఒక కల్లోల కడలిని తలపించినపుడు
కష్టసుఖాల తీరాన్ని నిత్యం ఈదక తప్పదు
జీవితం అలజడుల సాగరసంగమం
బతుకు ఒక పూలతోటలా వికసించినపుడు
ప్రతిక్షణం ఆనందానుభూతిని పొందక తప్పదు
జీవితం పరిమళించే పరిమళాల ఊట
బతుకు ఒక నదిలా ప్రవాహమై సాగినపుడు
నిరంతరం రాళ్ళూరప్పలు తగలక తప్పదు
జీవితం గాయాలను మోసే దుఃఖసముద్రం
బతుకు ఒక సంగీతమై రాగాలను పలికినపుడు
సరిగమల గానామృతాలను ఆనందించక తప్పదు
జీవితం సప్తస్వరాల స్వరరాగ గంగాప్రవాహం
బావుంది
ధన్యవాదాలు సార్
సార్ చాలా బాగుంది..బతుకు చిత్రాన్ని మీ మొగ్గలలో చూపించారు.