గజ్జె ముడి

గూన పెంకల కవేలు మచ్చు బండల కింద ఊరవిష్కెల
కాపురం. తల్లి పిట్ట అంగిట్ల గాసం యేరుకుతింటున్న
రెక్కలు మొలవని పిట్టపిల్లల అలికిడి. కరువు
సుట్టుకున్న కసరు పొట్టకు మేత దొర్కని కాలం.

యిత్తన కంకుల్ని నలిశిపొసే శేతుల నెనరుకు పేరువెట్టే
లోకంలో గాజు పెంకులు మింగుతున్న సాధనాసురుడు
పోకచెక్కకు దింపిన సూది మొన మీద
శీర్షాసనమేసిండు…

అయిదుమోటల బాయిమీద దుక్కులు నెరిసిన ఎద్దుకు
ఎనకకు ముందుకు నడిసినా తొండం మునగని లోతొకటి
తాకుడురాయై తగులుతున్నది. మోటదారులు నెత్తురు
ఊటలై పసురం పాదాలు పొట్టలువల్గుతున్నయి…

నాయనా కమ్మరి పిచ్చయ్య, పిన్నీసు కోసను చీల్చి
రవ్వగాలంగా వంచిన వొడుపును నాను,
పుస్తెలతాళ్ళల్లుతున్న శిల్ల ఎన్నుకు సుత్తె సాటేస్తున్న
ఇగురంల పంటికిందికిరాలేని నాగుకిచ్చిన కట్టడెంత…

కండ్లనిండా కురిసిన వనగండ్లలో
ఝాముఝాముకు కట్టెసర్సుకుపోతున్న గండదీపం
నాల్కె సందులేకుట్ట పచ్చలైన పరిమర్క
నెత్తిన సూరుడు అరికాలి కింద మట్టితల్లి
సాలెటివానకు తడువని కొప్పెర
ఒల్లెవడుతున్న వొక్కొక్క కన్నీటిబొట్టుకు
అమ్మ జంగమ్మ వొడువని వొలపోతయితున్నది

జననం: బ్రాహ్మణ వెల్లెంల, నార్కెట్ పల్లి మండలం, నల్లగొండ జిల్లా. కవి, రచయిత.  విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ వ్యవస్థాపకుడు. రచనలు: నరమాంస భక్షణ(దీర్ఘ కవిత), కైవారం.

Leave a Reply