సకల
సంకెళ్ళను
తెగ నరకగ
సాగుతున్న
సమరాన్ని
సాగిల
పరిచామంటిరి..
కాల చక్రానికి
నా కాళ్ళను
బిగ గట్టేసి
గమ్ముగ
శాంతిది
సర్దుకు
పొమ్మంటిరి..
లెక్కకు మించిన
దాడుల చిక్కిన
చితికిన కన్నుల
అడవి జింకల
బెదురు చూపులు
నడిచే కాలపు
నయ వంచనలకు
అద్దం పట్టెను..
ఏరి తవ్విన
బారెడు బొందల
కోరి దూరిన
గత్తర గోతుల
మతలబు ఎరిగే
జూదపు ఆటల
జాతర పోటికి..
కోట్లకు కోట్లు
చేతులు మారె
కన్నుల ముందే
నలుపు తెలుపుల
రీతులు తేలే..
తొలిగెనా భ్రమలని
కరిగెనా పొరలని
కనులెర్ర జేసుక
నిలదీసె నింగి
శ్రామిక మహిళా
సంబర మంటూ
అంబరమంటిన
కేకలు జూపుతు..