స్వేచ్ఛ కోసం తపించే ఓ హృదయం – ఒక బాలిక దినచర్య

(రెండో ప్రపంచ యుద్ధం లక్షలాది యూదుల జీవితాల్లో చీకట్లు నింపింది. లక్షల మందిని బలితీసుకుంది. ఆ మారణ కాండలో నాజీల దురాగతాలకు ఎన్నెన్నో వికసిత పూలు నేలరాలాయి. ప్రజలందర్నీ కాన్సంట్రేషన్ క్యాంపులకు తరలించారు. వెలుగు రేఖల్లేని చీకటి నిండిన ఆ క్యాంపులో తమ కుటుంబంతో పాటు తలదాచుకుంది పదమూడేండ్ల ఆన్ ఫ్రాంక్. అక్కడే తల్లిని కోల్పోయింది. కొద్ది రోజుల్లోనే అక్క కూడా ఊపిరొదిలింది. దోస్తుల్లేరు. ఆటల్లేవు. పాటల్లేవు. అంతా చీకటే. ఊపిరాడని చీకటి. కనుచూపు మేరా కానరాని వెలుగు. ఆ ఒంటరి దు:ఖాన్నంతా ఆ బాలిక డైరీలో రాసుకుంది. డైరీనే ప్రాణ స్నేహితురాలిగా భావించి తన మనసులోని దు:ఖాన్ని, ఆనందాలను, సమస్త భావోద్వేగాలను చెప్పుకుంది. ప్రస్తుతం ఇండియా, చైనాల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న ఈ సందర్భంలో పదమూడేండ్ల అమ్మాయి సాన్విత శాక్య ‘ఆన్ ఫ్రాంక్ డైరీ’ గురించి రాసిన ఇంగ్లిష్ సమీక్ష వ్యాసానికి వెంకటకిషన్ శాక్య గారు చేసిన తెలుగు అనువాదం ‘స్వేచ్ఛ కోసం తపించే ఒక హృదయం’…)

ఒక మనిషి కోసం మరో మనిషి తపన.
ఒక సాధారణ జీవితాన్ని గడపాలనే కోరిక.
అతిశీతలమైన గాలిని అనుభవించాలనే తృష్ణ.
నీలి ఆకాశాన్ని చూడాలనే నిరీక్షణ.
యుద్ధానంతర జీవితాన్ని ఆస్వాదించాలనే ఆశ.

పదమూడేళ్ల అమ్మాయి డైరీలో ఏమి ఉంటుంది?
ఆమెని ఆనందింపజేసే చాక్లెట్లు, స్నేహితులు, సినిమాలు… ఉండి ఉండవచ్చు అనుకుంటాం. కానీ అది మనల్ని హిట్లర్ సమయానికి, ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలానికి తీసుకెళ్తుందని ఎవరు భావిస్తారు? మనం బతుకుతమో, బతకమో తెలియని పరిస్థితి అని ఎవరు అనుకుంటారు? ఒకవైపు మరణాన్ని నివారించడానికి యూదులు జర్మన్ల నుండి తమను తాము దాచుకోవలసి వచ్చినప్పుడు వారు ఎలా భయపడ్డారో ఆమె వివరిస్తుంది. ఈ డైరీ ఆ కాలానికి ఒక సాక్ష్యం. ఆమె చాలా చిన్న వయస్సుది అయినప్పటికి, అన్నె ఫ్రాంక్ వ్రాసిన డైరీ వాస్తవాలతో కూడిన పెద్దవాళ్ళు రాసినంత గొప్పది. దేశ బహిష్కారంలో ఉండి, పెద్దవాళ్ళ నుండి దూరం చేయబడ్డాననే భావనతో ఉన్న ఒక అమ్మాయి యొక్క ప్రతీ పరిస్థితి, సంఘటనలతో కూడిన ఈ పుస్తకం గొప్ప ప్రభావాన్ని చూపిస్తది మనపై.

ఒకచోట అన్నె ఫ్రాంక్ ఇలా రాసుకుంటది.
“నేను ఇతరుల కంటే నీతోనే (ఆమె కూర్చోని ఉండే టేబుల్, డైరీ ప్రదేశం) ఎక్కువగా మాట్లాడతాను. ఇది నాకు రెండు విధాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. మొదటిది నేను మాట్లాడకుంటే, అల్లరి చేయకుంటే అందరు సంతోషంగా ఉంటారు. రెండోది ఏమిటంటే నా అభిప్రాయాలు అందరిని ఆశ్చర్యపరచడానికి కాదు. నా అభిప్రాయాలు మూర్ఖమైనవనీ నేను అనుకోను. కానీ అందరు అలా భావిస్తారేమోననీ నాలోనే దాచుకుంటున్నాను”.
ఆమె వాళ్ళతో పాటు దాక్కున్న ఇంకో కుటుంబం (Mr & Mrs Vandaan) కుమారుడు ఐన పీటర్ తో ప్రేమలో పడతుందనే విషయం ఆమె డైరీలో నమోదైంది. ఏమి లేని చోట వెంపలి చెట్టునే మహా వృక్షమన్నట్లు అక్కడ ఆ నిర్భంధంలో ఒక అబ్బాయి ఉండడమే మహాభాగ్యం.

ప్రేమ అనేది అక్షరాలలో పెట్టలేనిదనీ, ఒక ఇష్టమైన వ్యక్తితో జీవితంలో మన సంతోషాలని దు:ఖాలని పంచుకునేది అని నేను నమ్ముతాను. ప్రేమ అనేది కేవలం మానసికం మాత్రమే కాదు. అది శారీరకం కూడా. మన సహచరత్వం, కలిసిమెలిసి బతకడం, పిల్లలను కనడం లాంటి జీవన ప్రయాణంలో ఒకరంటే ఒకరికి గౌరవం తగ్గిన ఒక మనిషి పట్ల ఉండే సహజ ప్రేమ అయితే చెదరదు అనే విషయం ఒక పదమూడేండ్ల అమ్మాయి రాసిన ఈ పుస్తక శైలిలో అస్పష్టంగా తెలుస్తుంది.

దీర్ఘకాలికంగా నిత్యం భయంతో బంధీయై బతకడమెంత కష్టమో అన్నె ఫ్రాంక్ కి తెలుసు. అన్నెకి ఒక యూదురాలిగా ఆమె ఎంత ప్రమాదకర స్థితిలో ఉన్నదో, బయట ఏం జరుగుతుందో అనే విషయం కూడా తెలుసు. తనతో పాటు దాక్కోని బతుకుతున్న వాళ్లు తరువాత ఏం చేస్తారో, ఏం చేయాలని చూస్తున్నారో … ఆ చర్యల ఫలితాలేమిటో విశ్లేషించుకుంటూ ఆ పెద్దవారి కంటే మిన్నగా నిరంతరం తన మనసులో సంఘర్షిస్తూనే ఉంది.
భయంకరమైన ఆ పరిస్థితులలో కూడా గొప్ప దైర్యంతో, ఆశతో ఉండగలిగిన ఆ వాతావరణమే ఆమె బలమైన ఆలోచనలని మనకు తెలిసేలా చేసినయి.

దేనికోసం ఇది ?

ఈ యుద్ధం వల్ల ఎవరికి లాభం, ఏమి లాభం ?
ఎందుకు కొద్ది మంది కూడా మిగలకుండా లక్షలాది జనం రోజు రోజుకి ఆ యుద్ధంలో పాల్గొనాల్సి వస్తుంది? యుద్ధ ప్రభావానికి లోను కావలసి వస్తుంది అనేది అన్నె ఫ్రాంక్ డైరీ చదివే కొద్ది అర్ధమవ్వడానికి నాకు కొంచెం సమయం పట్టింది. కానీ ఒక యుద్ధకాలంలో – ఆందోళన, సంఘర్షణయుతమైన పరిస్థితులనీ ప్రతిబింబచేసేలా ఒక అమ్మాయి చేసిన అనివార్యమైన ప్రయత్నం, తీర్పునిచ్చేలా ఉండే నిర్ణయాలు తీసుకునే ఆమె వైఖరిలోని అందం నన్ను ఈ పుస్తకాన్ని చదివేలా చేసింది. ఈ పుస్తకం వల్ల నేను చాలా ఏడ్చాను. కేవలం వాళ్ళు యూదులైనందుకే అలా బతకాలిసి వచ్చిన పరిస్థితిని చూసి చాలా దు:ఖం కలిగింది నాకు. ఈ పుస్తకంలోని ప్రతి పదమూ ఆనాటి పరిస్థితుల లోతైన గాఢతను తెలియజేసింది.

ఒక పదమూడో ఏట అన్నే తన పుట్టిన రోజు సంధర్భంగా గిఫ్ట్ గా వచ్చిన డైరీతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు యూదుల వైపు చూసేలా చేసింది. ఆమె ఒక దివ్యమైన తెలివైన టీనేజీ అమ్మాయిగా తనకు ఎవరు తోడు లేక డైరీలో రాయడానికి ” కిట్టీ” అనే స్నేహితురాలి పేరుతో ఉత్తరాలు రాసింది. కానీ నిజానికి అటువంటి వ్యక్తి ఎవరు లేరు. క్రూరమైన కాలంలో, దారుణమైన పరిస్థితుల మధ్య, బతికే ఉండే ప్రతి క్షణాన్ని లెక్కించుకుంటూ దాక్కుంటూ ఆమె బ్రతికింది. ఎలాంటి ఉద్దేశ్యపూర్వక ప్రభావం లేకుండా, ఆమె ప్రేమ, అనుభూతులని డైరీలో కిట్టీ పేరుతో పంచుకుంటూ ఒక కాలాన్ని రికార్డ్ చేస్తూ సాగిన ఈ పుస్తకం రాయడానికి అన్నె ఫ్రాంక్ సరైన వ్యక్తిగా కనపడుతుంది.

ఈ డైరీ ఒక అపరిపక్వ (మెచ్యూరిటి చెందనీ), బలహీనమైన, ఏమి మనసులో దాచుకోవడం చేతకానీ, ప్రేమ, బాధ్యత, స్నేహం, మానవ మనస్తత్వాలు, భయం, ఆశ, చావు వరకు జరిగే ఒక ప్రయాణం.

అన్నే డైరీలో ఒకచోట చెప్తుంది “ప్రతి ఒక్కరూ అంటున్నట్లుగా ఇక్కడ అంత చెడు ఏమి లేదు” అని.
ఇది నా సొంత జీవితం గురించి, నా జీవితంలో ఉన్న సాఫీ తత్వముని, పరిస్థితులని ఆలోచించుకున్నపుడు – అన్నె జీవితం ఎంతో లోతైన ఫిలాసఫీ కష్టాల మధ్య ఉండాల్సి వచ్చిందనే విషయాన్ని అర్థం చేసుకొని బయటపడడానికి నాకు చాలా సమయం పట్టింది. ఆశ్చర్యమేసింది.
ఈ పుస్తకం చదువుతున్నపుడు కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే నేను బోర్ గా ఫీల్ అయ్యాను. యుద్ధ సమయంలో జరిగిన ఒక సహజ, రొటీన్ లైఫ్ యొక్క చిత్రణగా భావించాను.

ఈ పుస్తకాన్ని చదువుతూ పోతుంటే నేను చాలా సందర్భాల్లో వణికిపోయాను. ఆమె నాజీలకు దొరకకూడదనీ, పట్టుబడకూడదనీ, ఆమె కాన్సెంట్రేషన్ క్యాంప్ కి పోతదనీ ఈ పుస్తకం చివరి ఫలితం తెలిసికూడా నాకు యుద్ధానంతరం ఆమె బతికి ఉండాలనే చిన్న ఆశ నాకు ఉండేది. కానీ వారి ప్రయత్నాలన్నీ విఫలమై నాజీలకు దొరికిపోయి తిండి తిప్పలు లేకుండా కాన్సెంట్రేషన్ క్యాంప్ లో ఉండి, యుద్ధం ముగిసే ముందు జబ్బుపడి ఉన్న (ఆ తర్వాత చనిపోయిన) ఆమె గురించి తెలియజేస్తూ ముగిసిన ఈ డైరీ నా హృదయాన్ని ద్రవీంపజేసింది.

ఒక పదమూడేండ్ల టీనేజీ అమ్మాయిగా అన్నె ఫ్రాంక్ దాటి వచ్చిన భావాలు అదే పదమూడేండ్ల టీనేజీలోకి అడుగుపెట్టిన అమ్మాయిగా నేను అర్థం చేసుకోగలిగేలా పోలి ఉన్నాయి. మా మనో భావనలు, ఈ వయసు ఆతృతలు ఒకేలా ఉండవచ్చు. కానీ మా ఇద్దరి పెరుగుదల, ఉన్న పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. దీంతో ఈ పుస్తకం నన్ను అమితంగా ఆకట్టుకుంది.

ఒక అమాయకురాలైన ఏ మతం కుళ్లు తెలియని ఒక టీనేజీ అమ్మాయి ఆమె కేవలం తన ప్రమేయం ఎంత మాత్రం లేని యూదు మతంలో పుట్టినందువల్లే చంపబడడం అనేది అంతులేని మూర్ఖత్వం. మన ఎన్ని జాతులుగా దాటివచ్చినా గానీ, ఎన్ని సిద్ధాంతాలు, తత్వాలు చెప్పుకున్నాగానీ …, తరతరాలుగా జాత్యహంకారపు తప్పుని పదే పదే చేస్తూనే ఉన్నాం. అన్నే ఫ్రాంక్ యొక్క చిన్న వయసు అంత అనేకమైన సమస్యలతోనే ముగిసిపోయింది. ఆమె పదాలని వాడిన తీరు, వివరించే విధానం నాకు చాలా నచ్చింది.

చాలాకాలం పాటు నేను అన్నే ఫ్రాంక్ డైరీని చదివే ఆలోచనను పక్కన పెట్టాను. ఆ పుస్తకం గురించి కొంత ఐడియా ఉంది. అయితే తరువాత ఈ అన్నె ఫ్రాంక్ జీవితానికి నా ప్రస్తుత జీవితానికి కొంత సారూప్యత కనిపించడంతో, ఈ మద్య కరోనా కాలంలో సెల్ఫ్ లాక్ డౌన్ తో బంధీగా దీర్ఘకాలికంగా బ్రతుకుతున్న సమయంలో, ఈ మధ్యనే ఇండియా, చైనా యుద్ధం – అంతర్గత సంఘర్షణలు జరుగుతున్న సమయంలో ఎందుకో ఈ “ఏ డైరీ ఆఫ్ ఏ యంగ్ గర్ల్” పుస్తకాన్ని ఎట్లైనా చదువాలనిపించింది. అస్థిరమైన భయంకరమైన పరిస్థితుల మధ్య, హిట్లర్‌ నుండి దాక్కుంటూ అన్నే ఫ్రాంక్ చిన్న వయస్సులోనే, తక్కువ సమయంలోనే బలమైన రచనను చేసింది. ఆ కాలాన ఆ అమ్మాయి ఎలా ఉండి వుంటుందనేది మనం ఊహించలేం.

నాజీల వెతుకులాట నుండి ఆమెని ఆమె ఒక రహస్య సొరుగులో దాచుకుంటూ ఆమె జీవితంలోని నిత్య సంఘర్షణలని, ఆమె తల్లిదండ్రులతో సోదరితో , తను ప్రేమలో పడిన పీటర్ తో తన అనుభూతులని చాలా నిజాయితీగా రాసిన విషయాలు నా ఊహలో వాస్తవాలుగా తోచినాయి. నేను ఆమె పొందిన భయంలో భయమునెై , ఆమె ఆనందాల్లో ఆనందపడుతూ ఆమెలో మమేకమైపోయాను.

అన్నే ఫ్రాంక్ తన డైరీని చాలా రహస్యంగా ఉంచింది. ఆమె మొత్తంగా తన డైరీలో వ్యక్తం అయింది. ఇది సాంఘిక జీవన పరిస్థితుల రికార్డును పట్టి ఉంచే ఒక కేటలాగ్. విశాలమైన మనసు కలిగి ఉన్న ఖచ్చితమైన వైఖరిగల ఒక టీనేజీ అమ్మాయి కథ. కొందరు టీనేజీ అమ్మాయిలు పెద్దలను విశ్వసించక వారి మనసులోని భావాలని వారి డైరీకే పరిమితం చేసుకుంటారు.

అన్నే ఫ్రాంక్, హంగరీని జర్మనీ దళాలను ఆక్రమించిన సంధర్భాన్ని క్లుప్తంగా ఇలా చెప్పుతది ” ఇంకా లక్షల కొద్ది యూదులున్నరు. బహుశా వాళ్ళు కూడా యుద్దంలో మా లాగే కాబోతున్నారు. “

అయినప్పటికీ, వారి జీవితాల్లో సాధారణమైన రోజులు వచ్చే పరిస్థితులేమి లేవు. ఆమెకి తెలిసిన ప్రమాదం స్థిరంగా మెడపై కత్తివలే వేలాడుతుంది. ఆ ప్రమాదంలో భాగమైన ఆమెకి ఏమి జరుగబోతుందో క్షుణ్ణంగా తెలుసు. మీరు ఆమె ఉన్న పరిస్థితిని బాగా అర్థం చేసుకోగలరు. పదమూడేండ్ల ఒక అమ్మాయి ఆ రహస్య స్థావరంలో, ఒంటరిగా కాలాన్ని గడుపుతూ పెరుగుతుంది. ఆమె వయసు ఎంత? ఆ విషాధ భయంకరమైన పరిస్థితుల మధ్య ఉంటున్న ఆమె పరిణితి ఎంత అనేది మనం అర్ధం చేసుకోవచ్చు. ఆమె ఫీలింగ్స్, భావోద్వేగాలు స్పష్టంగా ఆమెలోని గొప్ప సాహిత్య ప్రతిభను, పెద్ద రచయితగా ఎదిగే విషయాన్ని తెలియజేస్తాయి. ప్రస్తుతం యుద్ధ వాతావరణంలో ఉన్న మనం, రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఏమి జరిగిందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. మరీ ముఖ్యంగా ప్రస్తుతం ఏమి జరుగుతుందో గమనించండి. ఈ పుస్తకం మనకు ఒకే ముక్కలో ఏం సందేశమిస్తుందంటే – ప్రతిదీ మీరే స్వంతగా తెలుసుకొని, మిమ్మల్ని మీరు కాపాడుకోవలసిన అవసరాన్ని తెలియజేస్తది. ఈ డైరీలో అంతా థియారిటికల్ కాన్సెప్ట్, జ్ఞానం, తెలివైన విషయాల కమ్యూనికేషన్ ఉంది. ఆచరణలో అన్నే ఫ్రాంక్ ఒక అజ్ఞానం, పక్షపాతం, ద్వేషానికి వ్యతిరేకంగా బతుకు పోరాటంలో పాల్గొంటుంది.

రెండవ ప్రపంచ యుద్ధ కాలంనాటి, హిట్లర్ నియంతృత్వంలో గడిపిన, ఆ దుర్మార్గానికి బలైపోయిన ఓ పదమూడేండ్ల అమ్మాయి అన్నే ఫ్రాంక్ గొంతు ఇప్పటికీ మన కాలంలో అనునాదమై ప్రతిధ్వనిస్తూనే ఉంది.

** **

(ఒరిజినల్ వ్యాసం… )

A Craving Soul of Liberty

The Diary of a Young Girl

The Craving of a human being for another human. The Craving to live a usual life. The Craving to feel the frosty air. The Craving to see the blue Sky. The Craving to live once the War will be over.

A diary of 13 year girl what contains in it? May be about Chocolates, friends, movies which entertains her but who thought that would take near the time period of Hitler when the world war is going on. When you don’t known will you survive or not?

Even she was very young she describes how Jews fared when they had to hide from the Germans to avoid death on the one hand it is a testimony to the times and it is also remarkable with what adult realism the girl Anne writes. A book that the events of the she feels excluded from the adults as a “youth” in this exile every situation has a more extreme effect. I talk more to myself at table than to other. This is beneficial in two ways. ” First everyone is happier if I don’t chat all the time and second I need opinions not to amaze other people, I don’t think my own opinion is stupid but others do so I might as well keep it myself.”

She falls in love with the son of the second family (Mr & Mrs Vandaan) in hiding and this reflected in the diary entries here remoteness is more extreme love what is love? I believe that love is something that cannot put into words love is to understand someone to like him to share happiness and misfortune with him in the long run, this also includes psychical love you shared something have something up and received something and whether you have a children not, whether the honor is gone, everything comes down to it you can tell from this writing style that this book was written by a young girl it is unimaginable to be locked up for such a long time to be discovered with daily fear Anne knows very well what is she doing on outside and is aware of danger for her as Jew she puts her own theories on what the allies should do next and how they go on she is constantly reflecting on herself and for actions and has analyzed her conflicting innerself as most adult could not. I am very impressed how courage and hopeful was she. Scary now extreme circumstances force her to grew incredible reflected in their long and thoughts.

***

For what, so what is the use of War, why cant Jewish live in peace, why do millions go to war day after day and not a cent left it was a bit taken or to get into it, but after that it was very readable in these moments I do not think about the misery but the beauty that remains recovering the judgment written by a adolescent during a n era of war, anxiety and dissension bring into reflect on the need for the desire I cried a lot with this book, its obscure insense its unfair the way they had to live but its worthiness each word.

As a thirteen year (13) girl, Anne received a diary which changed the world looked at the Jewish people. She was a bright minded teenager and had got a very good friend Kitty she named her because Anne never got a person she was waiting for. ln the most despotic state many handed we get an awareness into the ity-bitsh particular of living in hiding. Anne is just the capable person to be writing this work without any intension of making it as a tract. She shares her feelings to Kitty diary.

A Journey through immature weakness of openness, love, dutiful, friendship, human psychologies, fear,hope and the death.

When Anne says “ Everyone is complaining so much its not even that bad here”. It made me think about my own life and how much it take for granted in my life her deep credo about life drizzling through the dairy also caught me off guard.

There were a few instances in this book that I thought it was getting boring, nothing happening just a arim story of a sopoforic and routine life during war. There were many passage of this book that sent shivers through me even knowing the outcome of the story in real life it is difficult not to continually wish that they wouldn’t be found, wouldn’t be caught and would survive the war to think that Anne was succumbed to illness just a few days before the end of the war makes the story even more heart rending conclusive and powerful book.

As a teenager all the feelings Anne went through was similar to the feelings i felt and viewed as teen. The feeling and anxiety felt might have been the same, but of course our fostering and condition were entirely different what makes the book so eye catching.

For an innocent Jewish teenager from a family that wasn’t even exceptional to holy have been killed because she was a jew just seems so and pointless and stupid it seems a pitiable fact that nothing has been relieved as from antecedents and the human race repeats its error over and over. Recite to some of the typical teenage issues she talks to and being dumb folded by the ending. I loved the words just skipped off the pages.

For a long time I turn down the idea of reading Anne frank’s diary. Because of the both have in common around during this Corona time, I have been self locked down for a long period and in the other hand the Indo-China war and internal war made me to stubborn to read this. Then I took a possibility what Anne Frank has accomplished in such early age of her life and during staggering horrible situation is really and her text very powerful place where she spent so many days hidden from Hitler. We can’t imagine the time like that and what it must have been like for a teenager.

She wrote all her thoughts and experience about hiding in the secret annex from Nazi occupation she wrote about their daily struggle her honest feeling with her parents and sister and the boy peter with whom she fell in Love it is so realistic in my imagination. I felt the fear she was fearing and all the joy she was feeling.

Anne was very confidential to her diary. She expressed the whole in her diary. It was a catalogue which tracted the record of the social living conditions, the mindset attitudes of a broad minded i.e., teen’s.Some teens don’t have another trusted adults they confide in so they term to their diary.

She shares in a nut shell that Hungary was also occupied by the Germany troops she adds.”There are still a million Jews there, who will probably go for it now”. Nevertheless, nothing is normal. The constant danger of being discovered is lurking in the neck . In part she knows what happening. You can empathise well with the situation. She is growing more and more in the time of secret annexe .How a young person becomes very mature for her age ,her emotions clearly testify to her literary talent and her desires to become a well known writer. It is important now a days to know what happened during the second world war, especially in view of what is happening right now.This book summarises, in a watermark, everything you need to know and how to protect yourself. Everything lies in theoritical concept, knowledge and communication of intelligent texts, the work is part of it,she participates in the fight against ignorance, prejudice and hatred.

During the period of the Second World war and in the tyranny of Hitler in that stupid crisis an innocent child is gone. Still the voice of a young girl reasonates today as a good thing.

స్వస్థలం మంచిర్యాల, విద్యార్థిని. పుస్తకాలు చదవడం, డ్రాయింగ్, కవిత్వం రాయడం హాబీలు. ఐదో తరగతిలో " ఫేమస్ ఫైవ్ " అనే పుస్తకాన్ని చదివిన తరువాత సాహిత్యం పట్ల ఆసక్తి పెరిగింది. చదువుతో పాటు మానసిక పరిణితి కోసం సాహిత్యాన్ని చదువుతోంది.

పుట్టిన ఊరు: కనగర్తి. ఓదెల మండలం, పెద్దపల్లి జిల్లా. SRR డిగ్రీ కాలేజీ కరీంనగర్ లో బీ.కామ్ . చదివి కాకతీయ విశ్వవిద్యాలయంలో బీ.ఎడ్ చేసారు.
సాహిత్యం పరిచయం: చిన్నతనంలో కమ్యూనిస్టు పార్టీ పాటలు, పాఠశాల స్థాయిలో ఠాగోర్ జీవిత చరిత్ర(7వ తరగతి తెలుగు ఉపవాచకం), గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర(ఇంటర్ లో), డిగ్రీ చదివేటపుడు మాక్సిం గోర్కీ అమ్మ, నేను హిందువునెట్లయిత?, చలం సాహిత్యం.
రచనలు: 'ఒక మూల్నివాసీ గీతం' పేరుతో త్వరలో కవితా సంకలనం రానుంది. 'మహానీయుల జీవిత చరిత్ర'ల వ్యాసాలు (దినపత్రికల్లో). ప్రస్తుతపు కథ ఆరవది . మంచిర్యాల్ జిల్లా జన్నారం తహసీల్దార్ గా పనిచేస్తున్నారు.

 

3 thoughts on “స్వేచ్ఛ కోసం తపించే ఓ హృదయం – ఒక బాలిక దినచర్య

Leave a Reply