స్త్రీవాద కవితలకు ఆహ్వానం

నెచ్చెలి & జె.డి.పబ్లికేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో స్త్రీవాద కవితాసంకలనం కోసం స్త్రీవాద కవితలకు ఆహ్వానం!

2010 నుండి ఇప్పటి వరకు స్త్రీల సమస్యలపై కవయిత్రులు రాసిన కవితలను మాత్రమే పంపాలి.

ప్రచురింపబడినవైనా సరే పంపవచ్చు. ఎప్పుడు రాసినది, ఏ పత్రికలో ప్రచురితమైంది మొ.న వివరాలు కవిత చివర రాసి పంపాలి.

కవితతో బాటూ విధిగా ఒక ఫోటో, ఒక చిన్న పారాగ్రాఫులో మీ (మీపేరు, ఊరు, వృత్తి, రచనలు, చిరునామా, ఫోన్, ఈ-మెయిల్) వివరాలు ఈ-మెయిలుకి జతపరచండి.

ఒక్కొక్కరు ఒక్క కవిత మాత్రమే పంపాలి. పంక్తుల నిబంధన లేదు. సహకార పద్ధతిలో పేజీకి రూ. మూడువందల చొప్పున అచ్చులో మూడు పేజీలకు మించకూడదు.

కవితతో పాటే డబ్బు చెల్లింపు GooglePay, PAYTM, PhonePay 9989198943 నంబరుకు జరగాలి. రిసీప్టు కవితతో బాటు ఈ-మెయిలుకి జతచేయండి. కవిత ప్రచురణకు ఎంపిక కాకపోతే డబ్బు తిరిగి చెల్లించబడుతుంది.

ప్రతి కవయిత్రికి ఒక పుస్తకం పంపబడుతుంది. పోస్టేజీ ఒక పుస్తకానికి రూ.50 అదనం. పోస్టేజీ కూడా కవిత రుసుముతో కలిపి చెల్లించాలి. ఒకటి కంటే ఎక్కువ కాపీలు కూడా ముందే డబ్బు చెల్లించి కొనుక్కోవచ్చు.

కవిత తప్పనిసరిగా యూనికోడ్ లో ఉండాలి. వర్డ్ ఫైల్ పంపాలి. పిడిఎఫ్, పి.ఎమ్.డి లు స్వీకరించబడవు.

ఎంపిక చేయబడిన కవితలు “నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక” లో కూడా నెలనెలా ప్రచురింపబడతాయి.

కవితలు పంపడానికి చివరి తేదీ: మార్చ్10, 2021.

కవితా సంకలనం నెచ్చెలి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా జూలై10, 2021న ఆవిష్కరింపబడుతుంది.

ఈ-మెయిలు మీద “జెడి & నెచ్చెలి స్త్రీవాద కవితాసంకలనం-2021కి” అని రాసి editor.neccheli@gmail.com మరియు jdpublicationsjwalitha@gmail.com రెండిటికీ పంపాలి.

  • నిర్వాహకులు
    నెచ్చెలి & జె.డి. పబ్లికేషన్స్
    ఫోన్- 9989198943

రచయిత్రి. గాయని. భాషా నిపుణులు. “నెచ్చెలి” అంతర్జాల వనితా మాస పత్రిక వ్యవస్థాపక సంపాదకులు. కాలిఫోర్నియాలో నివాసం. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఫీల్డు లో "తెలుగు భాషా నిపుణురాలి" గా పనిచేస్తున్నారు. ద్రవ భాష(2001), శీత సుమాలు(2006), శతాబ్ది వెన్నెల (2013) , సెలయేటి దివిటీ (2017) కవితా సంపుటాలు, సిలికాన్ లోయ సాక్షిగా(2018) కథా సంపుటి, వెనుతిరగని వెన్నెల (2021) నవల ప్రచురింపబడ్డాయి. వివిధ పత్రికల్లో, సంకలనాల్లో కవిత్వం, కథలు, కాలమ్స్, ట్రావెలాగ్స్, వ్యాసాలు అనేకం ప్రచురింపబడ్డాయి. కవిత్వంలో అజంతా అవార్డు, దేవులపల్లి అవార్డు, కుందుర్తి అవార్డు మొ.న ప్రతిష్టాత్మక పురస్కారాలు ఎన్నో పొందారు. వీరి రచనలు ఇంగ్లీషు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లోకి అనువాదం అయ్యాయి.

Leave a Reply