“సమూహ”లో భాగమవుదాం! విద్వేష విషానికి విరుగుడవుదాం!

పడగవిప్పిన హిందుత్వ ఫాసిజం సమాజంలోని అన్ని అణగారిన వర్గాల, కులాల, జాతుల, లింగాల మీద నిరంతరంగా విద్వేష విషాన్ని చిమ్ముతోంది. మన సమాజంలోని అనేక రాజకీయ, మత విశ్వాసాలను, సంస్కృతులను రద్దుచేసి “ఏకాత్మ మానవుణ్ణి” నిర్మాణం చేయడానికి ఫాసిజం తన చేతిలోని అన్ని సాధనాలను వాడుతోంది.

ఈ “ఏకాత్మ మానవుడి”కి వెన్నుముక వుండదు. స్పృహ, చలనం వుండదు. మెదడు మొద్దుబారిపోతుంది. ఇక హేతుబద్దతకు, ప్రశ్నలకు, క్రియాశీలతకు అవకాశమే ఉండదు. మనిషి కేవలం కొన్ని పిడివాద స్లోగన్లకు, పైనుండి వచ్చే కమాండ్స్ కు స్పందించే ఒక మొరటు యాంత్రికతకు గురవుతాడు/ గురవుతుంది. చరిత్రలో ఈ మనిషినే “ఫాసిస్టు నూతన మానవుడు” అని అన్నారు.

ఆ “నూతన” మానవుడి నిర్మాణ క్రమంలో మనిషి నడిసొచ్చిన చరిత్ర, పోగేసుకున్న జ్ఞానం, పెనువేసుకున్న మానవసంబంధాలు, సామూహిక జీవితం, ఇంకా మరెన్నో మనిషితనపు ఆనవాల్లు ధ్వంసం చేయబడుతాయి. ఈ పని కోసం ఫాసిస్టులు తమ చేతిలో ఉన్న అన్ని రాజ్య సాధనాలను వాడుతూనే, భావజాలరంగంలో ప్రతిక్షణం విద్వేష విషాన్ని కక్కుతుంటారు.

ఆ విద్వేషాల ప్రచారం కోసం ఫాసిజం అన్ని రకాల దారులలో సమాజాన్నంతా చుట్టుముడుతుంది. విద్వేషాన్నే దేశభక్తికి గీటురాయి చేస్తుంది. దేశభక్తి నిరూపించుకోవాలంటే ఆ విద్వేషాలకు వంత పాడాలి. తమవంతుగా మరింత విషం చిమ్మాలి. ఇది రోజురోజుకూ పెరిగిపోతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాము .

అయితే ఏకాత్మ భారత్ నిర్మాణానికి విభిన్న జీవన విధానాలు, ఆలోచనలు, సంస్కృతులు ఇంకా అడ్డంకిగానే ఉన్నాయి. వాటికి రాజ్యాంగం కొంతైనా రక్షణ కల్పిస్తుంది. పౌరసమాజంలో ఉద్యమాల ద్వారా పరిమితంగానైనా సాధించిన ప్రజాస్వామ్య విలువలు, లౌకికవాద భావనలు ఏకాత్మ వాదాన్ని ఎదిరిస్తూనే వున్నాయి. కాబట్టి ఏకకాలంలో తమ కలల హిందుత్వ రాజ్యవ్యవస్థను (అందులో భాగంగానే అనేక చట్టాలలో, రాజ్యాంగంలో చేస్తున్న మార్పులు), దానికి సమ్మతినిచ్చే పౌరసమాజాన్ని తయారుచేస్తున్నారు.

మనుషుల మధ్య అభద్రత, విద్వేషాలు నింపుతూ మనిషిని మనిషి నుండి, మనిషిని సమూహం నుండి వేరు చేస్తున్న పరాయీకరణ ప్రక్రియకు అడ్డుతగలడం నేటి మనిషి కర్తవ్యం. రంగు రంగుల సింగిడిని రద్దుచేసి మొత్తంగా కాషాయమయం చేయాలనుకుంటున్న కుటిల నీతిని కుండబద్దలు కొట్టాల్సిందే. మనోభావాల పేరిట మనిషిని అంతం చేయాలనుకుంటున్న మనువాద కుట్రలను ఎండకట్టాల్సిందే.

ఇవన్నీ కేవలం సామూహిక సృజన ద్వారనే మొదలవుతాయి. మనమందరం భావజాల రంగంలో చేసే కృషే ఫాసిస్టు ఆధిపత్య వ్యతిరేక సమాజానికి దారులు వేస్తుంది. ఆ సోయిలో నుండి వచ్చే చైతన్యం, ఆచరణ కేవలం ఫాసిజాన్నే కాదు, అన్ని రకాల దోపిడీ, పీడనలను ఎదిరించే సమాజ మార్పుకు దోహదం చేస్తుంది.

ఈ సందర్భంలో ఆవిర్భవిస్తున్న “సమూహ” కు “కొలిమి” ఆహ్వానం పలుకుతోంది. సంఘీభావం తెలుపుతోంది. “సమూహ” ఒక సంఘటనగా మాత్రమే కాకుండా ప్రతికూల వాతావరణంలో కొనసాగబోతున్న ఒక ప్రక్రియగా కొలిమి భావిస్తోంది. “సమూహ”లోని వ్యక్తుల, సంస్థల ఆలోచనల ప్రచారానికి వేదిక కావడానికి కొలిమి సిద్ధంగా వుంది. “సమూహ”లో భాగం కావడం చారిత్రక కర్తవ్యంగా కొలిమి భావిస్తోంది.

2 thoughts on ““సమూహ”లో భాగమవుదాం! విద్వేష విషానికి విరుగుడవుదాం!

 1. SAMOOHA LO BHAGAM KAVADAM CHARITRIKA KARTHVYAM GA KOLIMI BHAAVISTHUNDHI —
  Big joke — just buttering Vaysam —nothing is going to change —first check SAMOOHAM people all
  Are honest /sincere / ideal /stand / vision —people –
  THE BUCK STARTS FROM YOU —-needs to understand
  Raayadam varake —paatinchadam. Zero – mana nadaka lo nadathalo – commitment undaali
  For example — kcr doing yagalu – poojalu -yadadri remodeling — how many these SAMOOHA people
  Questioned -all are in telangana only // any one talks about corruption
  —avaneethi —akalichaavulu — rapes – murders —athmahathyalu —no importance to ryithulu — no one
  Questions //asks —
  50 years congress ruled the country /any progress /any change —openly agrakulalu benefitted by congress party —Telugu state ruled by 13 reddy c.ms —-why not bc or sc or Muslim-//when change comes
  There is no bjp in Telugu states — but check everyday what is going on
  I respect Prakash raj garu — i follow his ASK SITE -/ he always questions —without fear
  But other people in SAMOOHA — dig —dig
  Rahul Gandhi p.m /revanth reddy c.m — then country becomes bangaru India -bangaru telangana??
  How many years one family rule SAMOOHA. Leaders ??
  U guys think it is democracey ??
  Country needs leaders —-
  Lokesh —is c.m
  Pavan —c.m—??
  Babu — cheater /worst politician — NO ARTICLE ON HIM
  WHY NOT SIRS

  Bathakadaaniki – Kulam- matham – devudu avasaramaa sirs ???
  *************************************************************************
  ===================BUCHI REDDY GANGULA

Leave a Reply