శ్రీనివాసన్ సుందర్ రాజన్

ఒక వ్యక్తి ఎన్ని రంగాల్లో ఒకేవిధంగా రాణించగలడన్నది పూర్తిగా అతని సంసిధ్ధత, శక్తిసామర్థ్యాపైనే కాకుండా అతని మానసిక సహనశక్తిపై కూడా చాలా వరకూ ఆధారపడి ఉంటుంది. ఈరోజు మనం పరిచయం చేసుకోబోయే రచయిత, కవి పైన చెప్పుకున్న ప్రకటనకు పూర్తిన్యాయం చేసే వ్యక్తి.

వృత్తిరీత్యా చార్టెర్డ్ అకౌంటెంట్. సాహిత్యంలో బహుముఖప్రజ్ఞాశాలి. కవిగా, కథారచయితగా ఎన్నో ఉన్నత శిఖరాలనధిరోహించిన ఇతని పేరు సుందర్ రాజన్. చెన్నై వాసి. వృత్తిపరమైన పని ఒత్తిడిలో కూడా విరివిగా రచనలు చేస్తూవస్తున్న సీనియర్ రచయిత శ్రీ సుందర్ రాజన్. అతని ఆంగ్ల కవితల సంకలనం “Beyond the realms” మరియు ఆంగ్ల కథల సంపుటి “Eternal Art” బహుళప్రజాదరణ పొందటమే కాకుండా తమిళ్, హిందీ, మళయాళం, తెలుగు, కన్నడ మరియు గుజరాతీ భాషల్లోకి అనువదించబడ్డాయి. మరో కథల సంపుటి “Spice of Life” తమిళ మరియు మళయాళ భాషల్లోకి అనువదించబడింది.

వీరి తమిళ కథలసంకలనం “సుందర కథైగళ్” నుంచి కథలు కల్పక్కం రేడియో స్టేషన్ నుంచి ప్రతీవారాంతంలో ప్రసారమవుతున్నాయి.అలాగే కెనడా, మాంట్రియల్ తమిళ్ రేడియో స్టేషన్ నుంచి కూడా కొన్ని కథలు ప్రసారమవుతున్నాయి. సుందర్ రాజన్ చెన్నై పొయిట్రీ సర్కిల్ మరియు ఇండియన్ పొయిట్రీ సర్కిల్ సభ్యులు. అంతర్జాతీయ చిన్న కథలపోటీలో “Highly Recommended Writer” గా ఎంపికకాబడ్డారు. వీరి రచనలు పలు దేశ,విదేశీ పత్రికల్లో ప్రచురణకు నోచుకోవటంలో ఆశ్చర్యమేమీ లేదు.

సుందర్ రాజన్ సామాజిక కార్యక్రమాలలో చాల చురుకుగా పాల్గొనే కార్యకర్త. పదుల సంఖ్యలో వైద్యశిబిరాలు, మందులపంపిణీ, మొక్కలు నాటటం మున్నగునవి కొన్నిమాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.

సుందర్ రాజన్ తను చెప్పిన ధర్మసూత్రాన్నే “Boundless Boundaries Beckon” పాటిస్తూ చెన్నైలో ప్రశాంతంగా జీవిస్తున్నారు.

వీరితో జరిపిన ముఖాముఖిలో కొంతభాగం ఇక్కడ మీకోసం—

ఎన్నో సాహిత్యప్రక్రియల్లో మీరు ప్రయాణించినప్పటికీ కథకుడిగా స్థిరపడ్దానికి ప్రత్యేక కారణం?
సాహిత్యం ప్రధానంగా మూడు ప్రక్రియలుగా మనకు పరిచయం అవుతుంది. అవి– నాటకం, కథ, కవిత్వం. ప్రకృతి ప్రేమికుడిగా నా ప్రయాణం కవిత్వంతోనే ప్రారంభమయింది. విద్యార్థిదశలోనే ఆంగ్ల కవిత్వంఫై మక్కువతో రాయటం జరిగింది.

అయితే ఒకానొక దృశ్యం నాకొక ప్రాంప్ట్ నిచ్చింది.దానితో నాకొక కథ స్ఫురించింది.మనం గమనించాలే కాని జీవితంలో ఇలాంటివి ఇంకా చాల ఉన్నాయి వాటితో గొప్ప కథలు రాయొచ్చు అనే ప్రేరణతో కథలు రాయటం మొదలుపెట్టాను. నా కథల పాఠకులు అ కథలతో కథలోని ప్రధాన పాత్రతో తమనుతాము రిలేట్ చేసుకోవటం ప్రారంభించాక నేను మరిన్ని కథలు రాయాలనుకున్నాను. అలా కథలవైపు నాకలం యూ టర్న్ తీసుకుంది. అలాగే నాకథల్లో అంతర్లీనంగా ఓ మెలొడ్రామా ఉంటుంది. ఓ నాటకీయత ఉంటుంది. అందువలన నాకథలు కొన్నిటిని నాటకాలుగా ప్రదర్శించటం జరిగింది. ఆరకంగా సాహిత్యంలో మూడు ప్రక్రియలు ఒకదానికొకటి అనుసంధానంగా పనిచేస్తాయని అనుకుంటున్నాను.కథ, నాటకం, కవిత్వం మూడూ కలిసే ఉంటాయి.

మిమ్మల్ని ప్రభావితం చేసిన రచయిత ఎవరు? ఎలా?
అయాన్ రాండ్ కథలంటే చాలా ఇష్టం.ఆమె కథలు ఎక్కువగా మనుషులూ వారి జీవితాల్లోని సంఘటనలు చుట్టూ తిరుగుతాయి. దాదాపు ప్రతీ పాత్ర అనుపమానంగా ఉండి పాఠకుడిపై చెరగని ముద్ర వేస్తాయి. ప్రతీ నవల విభిన్నంగా ఉండి ఓ తత్వాన్ని బోధిస్తుంది. ముఖ్యంగా Atlas Shrugged మరియు “ఫౌంటెయిన్ హెడ్” లాంటి నవలలు చదివినప్పుడు పాఠకుడికి ఆ నవలలోని ఏ పాత్రని తను ఓ రోల్ మోడల్‌గా తీసుకోవాలో అర్థంకాదు.

నా కథల్లో కూడా ప్రధానపాత్ర (ప్రొటగానిస్ట్) మిగతా పాత్రలకంటే పూర్తి భిన్నంగా ఉండి తనకంటూ ఓ ముద్రని సృష్టించుకుంటాడు. నిజానికి, నా చాలా కథల్లో అదే ప్రధానపాత్రగా చిత్రీకరించుకున్నాను. నాకు చాలా ఆనందం కలిగించే నిజం ఏంటంటే నా కథల్లో ప్రధానపాత్ర ఓ మైనా పక్షుల జంట.

మీకు రచనా వ్యాసంగం ఓ ఆధ్యాత్మిక అధ్యనం అని చెప్పుకుంటారు. వివరిస్తారా?
రచనా వ్యాసంగం మనిషికొక వివేచననిస్తుంది. మన ఏకాగ్రతకి తీక్షణతనిస్తుంది. మన అనుభవాలని స్పష్టంగా వ్యక్తపర్చటానికి కావల్సిన పనిముట్లనిస్తుంది.

దీనివలన మనం మనజీవితానికి ఓ కళాత్మకతని ఆపాదించటానికి అవకాశం వస్తుంది. తద్వారా మనలోని అంతర్లీనంగా ఉన్న సృజనాత్మకతకి వివిధరకాల పార్శ్వాలని ఇచ్చే విధంగా మనల్ని మనం మలచుకోవచ్చు. మన రచనల ద్వారా మనం కనీసం కొన్ని జీవితాలని ప్రభావితం చెయ్యగలిగినా ధన్యులమే. ముఖ్యంగా మన రచనలకు సార్థకత లభిస్తుంది. ఆవిధంగా మన రచనలు మన ఆలోచనలకు, భావోద్రేకాలకు ఓ రకమైన ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.

రచనా వ్యాసంగంలో ఆధ్యాత్మికత మూడు రకాలుగా ఉంటుంది–దార్శనికత, బాంధవ్యాలు, సంస్కార విధులు. సాహిత్యంలో అన్ని ప్రక్రియలూ ఈ మూడింటినీ ప్రతిఫలిస్తాయి. అందుకే నా వరకూ రచనా అభాస్యం, ఒక ఆధ్యాత్మిక వ్యాసంగమే.

సుందర్ రాజన్ రాసిన కవితల్లో రెండు మీకోసం:

FULL MOON NIGHT

Soft and sublime blows the sea breeze,
Sprinkles from the waves in the air ne’er cease,
Caressing the waves with a touch so sensuous,
Causing the waves to dance, look innocuous.

As the waves break on the shore,
Fine particles of sand it stores,
Smoothening it into a carpet, priceless,
Bejeweled with ornamental shells.

My neatly combed hair is in disarray,
As into the waves I stray.
Sand particles tickle my face,
Together, they impair my gaze.

As the sun wanes in the West,
The Eastern horizon is all dressed,
To herald the full moon in splendour,
Which ne’er can I conjure.

The resplendent moon with grace so feline,
Rises, waxing eloquence which words cannot define,
Clothed with the shining stars, well bound,
Across the silky sky all around.

In the soothing light of the moon,
The carpet of sand turn golden soon,
With designs on the sand carpet, embellished,
By homing crabs, for the day, finished.

In rapture, I watch the waves gleaming,
Is it real or am I dreaming?
It is an experience so surreal,
Drinking in the beauty of this terrain.

The cloud cover envelops the moon from sight,
Drawing out from the sea, it’s light,
Leaving a vast expanse of dark space,
Sending a chill across my face.

It does leave me forlorn,
But it was not for long,
As the cloud cover gives way,
Unable to keep the moon at bay.

So too on our journey of life,
You pass thro’ spice and strife.
If you take it in your stride,
You are an inspired winner alright.

THE GREAT BANYAN TREE
(ROUNDEL FORM)

Yes, over fifteen decades have rolled,
Adorning the highway like brocade,
Having grown steadily, manifold.
Yes, over fifteen decades.

Over frightful storms, I carry crusades,
I became a landmark, I am told,
As I stand unscathed through the promades.

A protective umbrella, I hold,
Each passerby, in comfort evades,
Sweltering heat and showers untold.
Yes over fifteen decades.

(Adjudged the third place in the Metverse contest)

విశాఖలో పుట్టి అక్కడే డాక్టరేట్ వరకూ చదివి ఆపై విదేశాల్లో వివిధ యూనివర్శిటీల్లో పనిచేసి ఇప్పుడు బెంగ్లూరు లో స్థిరపడి ఇక్కడ ఫ్రీలాన్సర్ గా పనిచేస్తున్నారు. రోజంతా పాఠం చెప్పటం... రాత్రైతే ఏదో రాసుకోవటం లాంటివి చేస్తుంటానంటారు. కవిత్వం అంటే ఇష్టం. కవిత్వం గురించిన చర్చలు కూడా ఇష్టమే.

2 thoughts on “శ్రీనివాసన్ సుందర్ రాజన్

  1. I am very much inspired this Monday morning on seeing my interview published on your esteemed fortnightly. It’s really motivating for an ameture writer like me. Thank you Srinivas Vasudev ji for your coverage

Leave a Reply