కవిత్వం సహజంగా రావాలి: శరణ్యా ఫ్రాన్సిస్

మీరు చదివింది కరక్టె. రెండు భిన్నమతాల కలయికగా పేరున్న ఈమె ఓ భిన్నమైన కవయిత్రి, విభిన్నమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా కూడా పేరుంది. బహుముఖీన ప్రజ్ఞాశాలి మాత్రమే కాదు బహుభాషా కోవిదురాలు. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ,హిందీ, బెంగాలీ ఇలా చెప్పుకుంటూపోతే భాషలు ఇన్ని ఉన్నాయా అని వెతకాల్సివస్తుంది. వృత్తి రీత్యా ఆంగ్ల ఆధ్యాపకురాలు. మరి ప్రవృత్తి రీత్యా ఏంటి అంటారా? అలా అడిగితే చాలానే ఉన్నాయి. బహుభాషా కవయిత్రి, సామాజిక సేవకురాలు, లైఫ్ స్కిల్స్ ట్రెయినర్, ఫాకల్టీ ఫెసిలిటేటర్, మహిళా సాధికారికత కార్యకర్త. అన్నింటి కంటే ముఖ్యంగా సమాజంలో తన చుట్టుపక్కల ఎక్కడ ఏ విధమైన సమస్య వచ్చినా, అది ఆమె దృష్టికి వస్తే వెంటనే స్పందించే వ్యక్తి శ్రీమతి శరణ్య. ఇంతవరకూ ఆమె అంగ్లంలో మూడు కవితా సంపుటాలని వెలువరించారు.

ZAV ఫౌండేషన్ ఆధ్వర్యంలో ReGuru పర్యవేక్షణలో కొన్ని వేలమందిని ఉపాధ్యాయులుగా తయారుచేసిన వ్యక్తి శరణ్య. అలాగే కర్ణాటకలోని శిక్షణా కేంద్రంలో అధ్యాపకులకు భాషా బోధనా ప్రక్రియలపై అవగాహనా సదస్సు నిర్వహించిన ప్రజ్ఞాశాలి. చాలా కవితా సంపుటాలకు సంపాదకత్వం వహిస్తూ బహుభాషాకవిత్వంలో తనకంటూ ఓ ప్రముఖ స్థానాన్ని సంపాదించుకున్న కవయిత్రి శ్రీమతి శరణ్య.

ఆమె తన ప్రొఫైల్‌లో చెప్పినట్లుగా… ఇలా ఇక్కడ మీకు అర్థమయ్యేలా! ఆమె గురించి ఆమె భాషలోనే, ఆమె వాక్యాల్లోనే చూడండి:
An accomplished poet, Saranya is the recipient of Star Ambassador of World Poetry (2019), Bharat Award for Literature (2018) and Rabindranath Tagore Award for Poetry (2017).

ఈమెతొ కల్సి రవీంద్రనాథ్ టాగోర్ పురస్కారాన్ని అందుకోవటం నాకొక గొప్ప జ్ఞాపకం. అయితే అది ఒకే సంవత్సరంలో కాదు.

“అంతర్గత” (2020) మరియు “కాంఫ్లుఎన్స్” కవిత్వ సంపుతాలకు ఎడిటర్ గా పనిచేసారు. బెంగ్లూరులో ప్రతి నెలా జరిగే బెంగ్లూర్ పొయిట్రి సర్కిల్ కవిత్వ కార్యక్రమాలకు ప్రధాన సంధాత్రిగా వ్యవహరిస్తుంటారు. పలుదేశ విదేశీ పత్రికల్లో ఆమె కవితలూ, రచనలూ ప్రచురితం. పదుల సంఖ్యలో సాహితీ వ్యాసాలు పేరెన్నికగన్న జర్నల్స్‌లో ప్రచురింపబడ్డాయి. రోం, బంగ్లాదేశ్ మరియు కెనడా దేశాల్లో జరిగిన యువజన ఉత్సవాల్లో భారతదేశ ప్రతినిధిగా పాల్గొన్నారు. ప్రస్తుతం బెంగ్లూరులోని సెంట్ పాల్స్ కళాశాలలో ఆంగ్లభాషా శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

శరణ్య ఫ్రాన్సిస్ తో ఇష్టాగోష్టి:

  1. ఇన్ని భాషలతో అనుబంధం ఎలా ఏర్పడింది?బహుభాషా కవిగా మీరు ఏభాషలో రాయాటానికి ఇష్టపడతారు?

నేను ప్రథమంగా తమిళ్ అమ్మాయిని. నాన్నగారు ప్రముఖ తమిళ కవి సుబ్రమణ్య భారతి కవితలను రోజూ చదివి వినిపించేవారు. అయితే కవిత్వ పరంగా నాకు మొదటిగా ఆంగ్లభాషతోనే పరిచయం. నా విద్యాభ్యాసం కారణంగా మొదటిగా ఆంగ్లసాహిత్యంతో సాన్నిహిత్యం కూడా నన్ను రాసేలా చేసింది. తర్వాత కన్నడ నేలపై స్థిరపడిన కారణంగా కన్నడ సాహిత్యంతో పరిచయం కన్నడలో రాసేలా ప్రేరేపించింది. ఈ విధంగా నా ప్రస్థానం ఆంగ్ల మరియు కన్నడలోనే మొదలు. నాన్నగారు బహుభాషాకోవిదులు. వారికి మళయాళంపై ఉన్న పట్టు నన్ను ఆభాషని దగ్గర చేసింది. తరువాత నాన్నగారి ప్రభావంతో తమిళ సాహిత్యంలొ నా ప్రయత్నం సఫలీకృతమయింది. అమ్మ హైద్రాబాద్ నుంచి రావటం వలన తెలుగు భాషతో కూడా పరిచయం. ఈ విధంగా దక్షిణాది భాషలైన తమిళ తెలుగు కన్నడ మళయాళం భాషల్లోనే రాస్తున్నా ఆంగ్లభాషతోనే నా అనుబంధం. అయితే ఆంగ్లంలోనే నా గళం బలంగా వినిపిస్తానని నా నమ్మకం.

  1. మీ సాహితీ ప్రస్థానం గురించీ, మీ కవితా వస్తువు గురించి చెప్పండి.

ఇంట్లో ఉన్న సాహితీ వాతావరణం తల్లిదండ్రులిద్దరూ సాహితీవేత్తలు, సాహితీప్రేమికులు కావటం వారి ప్రోత్సాహం, ప్రభావం నన్ను రాయించేలా చేసింది. సామాజిక మాధ్యమం ద్వారా దేశ, ప్రపంచ కవులని నాకు దగ్గిరచేసింది. వారి ప్రభావం కూడా నా కవిత్వాన్ని దిశా నిర్దేశం చేసింది. మొదట్లో నా రచనలను పబ్లిషర్స్‌కి పంపినప్పుడు వారినుంచి ఎటువంటి స్పందన లేదు. చాలా నిరుత్సాహపడ్డాను. 2016 లో నా మొదటి సంపుటి “బీయింగ్ పర్పిల్” (Being Purple) ప్రచురించాక నా గుర్తింపు నన్ను ప్రచరణ సంస్థలకు సాహితీవేత్తలకు, గ్రంథాలయాలకు విద్యాసంస్థలకు దగ్గరచేసింది. 2017 లో ” ఎంబిడో” (Embedo) తర్వాత నా మూడో సంకలనం “శాండర్” (Sonder) ప్రచురింపబడ్డాక ఇక వెనుతిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. నా కవితాంశాలు ముఖ్యంగా ఫెమినిస్ట్ ఆలోచనలు, ప్రకృతి మరియు జీవితం. కేవలం రాయటం కోసం రాయను కాబట్టి మిగతా కవులను అనుకరించటమో వారి ఇతివృత్తాలను అనుసరించటమో చేయను. ఈ దృక్పథం వలనేనేమో నాకంటూ సాహిత్యంలో ఓ ప్రత్యేక స్థానం, ముద్ర కల్పించుకోగలిగాను.

  1. మీరు రాసే విధానం ఎలా ఉంటుంది?

నా రచనా విధానం దీర్ఘంగానూ, సాంప్రదాయంగాను ఉంటుంది. జీవితంలో జరిగిన ఒక బలమైన సంఘటన కారణంగానో, నాపై ప్రభావం చూపిన ఓ సంఘటనో, భావోద్రేకంలో నేను ఓ అగాథంలో పడిపోతున్న భావన కలిగినప్పుడో రాయాలనే ఆలోచన బలంగా ఉండి నాచేత రాయిస్తుంది. ఒకసారి నేనో కవిత రాసాక దాన్ని మళ్ళీ ఎక్కువసార్లు ఎడిట్ చేయను. నా ఉద్దేశ్యంలో కవిత్వం “చెట్లకు ఆకులు ఎలా వస్తాయో” అంతే సహజంగా రావాలి.

I Am Woman

I am a seed… The same one you buried in a hurry to kill the voice you didn’t want anyone to heed to or hear
I am that bolt of lightning intensifying the darkness of the ages then igniting that cleansing forest fire.

I am a vessel that fills, empties, overflows in its emptiness then fills again with versely deliverance,
I am a cloud laden with life giving water that you take for granted in your whimsical arrogance.

I am that refusal of selective privilege bowing only to the collective conscious
I am that reversal of the norm breathing reason over every covenant, stale and vicious

I am woman… Born of life, tasting freedom, redefining every control line,
I am woman… Made of greatness, the elixir nourishing the sacred trine,
I am woman… Broken thus beautiful, challenging norms, placing love in its befitting sacred shrine
I am woman… Radiant, unbridled, human, breathing meaning into everything mortal yet divine.

Don’t Foot My Bill

Don’t care to pull me a chair,
Don’t help open my kitchenware.
Don’t think my time is always spare,
Don’t say I’m born only to cook n care.
Don’t believe it is okay to stare
Touch me at whim – don’t you dare!
Don’t decide it’s okay to tell me what to wear,
Don’t clothe me and let your thoughts lay bare!
Don’t say “after you” or hold my door,
Don’t seat me at your foot when sore.
Don’t be my provider nor keep each score,
Don’t decide what’s best for me nor say I can’t be more!
Don’t call me childish names,
Don’t engage me in empty games.
Don’t! Oh don’t decide for me now,
Don’t expect me to be your sacrificial cow.
Don’t expect me to love the pill.
Don’t sound the horn at your will.
Don’t seat me at the window sill.
Don’t you ever – ever foot my bill!

విశాఖలో పుట్టి అక్కడే డాక్టరేట్ వరకూ చదివి ఆపై విదేశాల్లో వివిధ యూనివర్శిటీల్లో పనిచేసి ఇప్పుడు బెంగ్లూరు లో స్థిరపడి ఇక్కడ ఫ్రీలాన్సర్ గా పనిచేస్తున్నారు. రోజంతా పాఠం చెప్పటం... రాత్రైతే ఏదో రాసుకోవటం లాంటివి చేస్తుంటానంటారు. కవిత్వం అంటే ఇష్టం. కవిత్వం గురించిన చర్చలు కూడా ఇష్టమే.

One thought on “కవిత్వం సహజంగా రావాలి: శరణ్యా ఫ్రాన్సిస్

  1. Best wishes to Kolimi. Thank you Dr. Vasudev Srinivas for the opportunity and Kolimi for this space. May your yeomen service to the Literary world be blessed! Ugadi Subakaakshalu

Leave a Reply