వలస బతుకులు

గాల్లో వేలాడే బతుకుదీపాలు
ఎప్పుడారిపోతాయో తెలువదు
ఉగ్గబట్టిన గాలి
ఊపిరాడ నీయడంలేదు

విరిగిన పెన్సిల్ మొనలా
వ్యర్థపు బతుకులువాల్లవి

విద్యుత్ కన్న వేగంగా
వ్యాపించే వదంతులు
ఎడారిలో ఎండమావులు
కూడుబెట్టేవికావు
సేద దీర్చేవికావు

దగ్ధమై
ధూళిలో కలిసిపోయే
వలసబతుకులు వాళ్ళవి
ఒక దైన్యంనుండి మరొకదైన్యానికి
నిరంతర పయనంలో
మృత్యువెపుడూ
కొండచిలువలా కాచుకొనిఉంటది

కరోనా…
ఇండ్లను కూలుస్తది
కుటుంబాలచీలుస్తది

నెపం దానిమీదబెట్టి
చేతులు దులుపుకోవొద్దు.
విధ్వంస పాలకులారా!
ఇపుడన్నివేళ్ళూ
మీవైపే ఎత్తి చూపిస్తున్నవి

పైన మండే సూర్యుడు
కింద భగ్గుమనే భూమి
అడుగుదీసి అడుగేస్తే
అనంతమైన బాధ

ఉగ్గబట్టినగాలి
ఊపిరాడనీయడంలేదు

(మూలం – రేలా (10)
స్వేచ్ఛానువాదం – ఉదయమిత్ర)

(నేను ‘కొలిమి’ పత్రిక పని చేస్తుంటే రేల నా పక్కన చేరింది. ‘అమ్మా! ఈసారి మీ పత్రిక సంచిక దేని గురించి తెస్తున్నరు’ అని అడిగింది. ‘స్పెషల్ ఫోకస్ ఏమీ లేదు బిడ్డా ఈసారి’ అని చెప్పిన. ‘అదేంది ఇండియాల migrant workers కరోనా వైరస్ లాక్డౌన్ వల్ల వందల మైళ్ళు సొంత ఊర్లకు నడుస్తున్నరని చెప్పినవ్ కదా. దాని గురించి ఎవరూ రాస్తలేరా’ అని అడిగింది. ‘ఇప్పటికయితే ఎవరూ ఏమీ పంపలేదు’ అని అన్నా. ‘నేను రాస్తే వేస్కుంటావా కొలిమి లో’ అన్నది. ఏమి రాస్తదో చూద్దామని, ‘రాయి, వేస్తా’ అని చెప్పిన. పది, పదిహేను నిమిషాలు కూర్చొని ఈ కవిత రాసి తీసుకొచ్చింది. ఆశ్చర్యపడడం నా వంతు అయింది. ‘బాగుంది బిడ్డా’ అని ముద్దు పెట్టిన. ‘కొలిమి ల వేస్తావా’ అన్నది. నవ్వి ‘ఇంగ్లిష్ కదా ఫేస్బుక్ ల పెడ్తతీ’ అని చెప్పిన. ఉదయమిత్ర గారు తెలుగు చేయడం, కొలిమి లో వేసే అవకాశం దొరికింది. రేలకి చాలా సంతోషంగా ఉంది. ఫేస్బుక్ లో చదివిన వెంటనే తెలుగులోకి అనువాదం చేసి, ఫోన్ లో మాట్లాడి ఆమెని ప్రోత్సహించిన ఉదయమిత్ర గారికి థాంక్యూ! కింద రేల ఇంగ్లిష్ లో రాసిన ఒరిజినల్ కవిత చదవండి. – చైతన్య చెక్కిళ్ల)

It is a lost soul who is
floating in the breeze,
and the breeze is fading
This soul is as lost as a
pencil that has nothing
good to create

The electricity surging
through their veins turns
them into one of the
universe’s many enemies,
only wreaking great havoc

Those hearts burn to dust
as one step leads to the next
And then an eternity awaits them

This virus causes homes
to crumble, families to separate
not because of it, because of you

Every step is longer, every day
longer, and hotter, and the
breeze is fading as they are…

జననం: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల. విశ్రాంత ఆంగ్లోపన్యాసకుడు. కవితా సంకలనాలు: పాట సంద్రమై(2008), కాలిబాట(2014), నదిలాంటి మనిషి(2018). కథా సంకలనాలు: అమ్మను చూడాలె(2006), ఆఖరి కుందేలు(2011), దోసెడు పల్లీలు(2017). నాటకం: నేను గౌరీ(2017).

రేల అమెరికాలోని ఇండియనాపోలిస్ లో అయిదో తరగతి చదువుతుంది. హాబీస్: ఆర్ట్ వేయడం, jewelry తయారు చేయడం, టి‌వి చూడడం, అప్పుడప్పుడూ కథలు, కవితలు రాయడం.

5 thoughts on “వలస బతుకులు

  1. ఉండలేనితనమే అక్షర సృజనకు దారి తీస్తుందనటానికీ రేల నిదర్శ నం. రెండూ బాగున్నయి

  2. చాల అన్యాయం..ఈ కవిత రేలా రాసింది..నేను అనువాదం మాత్రమే చేశాను
    కవిత కింద నాపేరువేశారు..తనపేరుండాలి

Leave a Reply