కవిత్వం నా జీవితంలో అంతర్భాగం – రోహిణీ బెహ్రా

సాహిత్య నేపథ్యం లేకుండా ఉద్యోగ విరమణానంతరం కవిత్వంలోకి వచ్చి పతాకస్థాయిలో రాణించటం చాలా అరుదుగా జరిగే విషయం. ఇంకా అరుదైన విషయం భార్యాభర్తలిద్దరూ పదవీవిరమణ అనంతరం కవిత్వప్రస్థానంలో చెప్పుకోతగ్గ స్థాయికి చేరుకోవటం బహుదా ప్రశంసనీయం. భారతీయాంగ్ల కవుల్లో స్వప్నాబెహ్రా, రోహిణీ బెహ్రాలది ప్రత్యేకమైన స్థానం. ఈ శీర్షిక ప్రారంభం లోనే స్వప్నా బెహ్రా గురించి పరిచయం చెయ్యటం జరిగింది. ఈరోజు రోహిణీ బెహ్రా (స్వప్నా బెహ్రా భర్త) గురించి మాట్లాడుకుందాం.

ఒడిశా ప్రభుత్వంలో జౌళిశాఖలో మేనేజర్ స్థాయిలో పనిచేసి పదవీవిరమణ అనంతరం ఆంగ్ల సాహిత్యం వైపు అడుగులువేసి అనతికాలంలోనే తనదైన ముద్రతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు రోహిణీ బెహ్రా.

అమెరికా నుంచి వెలువడే ఇన్నర్ చైల్డ్ ప్రెస్ సంచికలో వీరు ఫీచర్డ్ పోయెట్. అలాగే ఇటలీ నుంచి పనిచేస్తున్న ప్రపంచకవుల సంఘానికి ఇంతకుమందు డిప్యూటీ సెక్రటరీ జనరల్ పదవిలో కొన్నాళ్ళు ఉన్నారు. ఇంకా చాలా అంతర్జాతీయ సంస్థలు రోహిణీ బెహ్రాను తమ పురస్కారాలతో సత్కరిసంచుకున్నాయి. అవేమిటో చూద్దాం.

  1. Motivational Strips conferred on him Golden Badge, Global Dove of Peace, Golden Literature Award & Ambassador de Literature awards.
  2. The World Institute of Peace, Nigeria bestowed upon him ”World Icon of Peace, Epitome of Humanity, Ambassador of Peace”.
  3. He is awarded “World Laureate in Literature “& World Poetic Star by WNWU, Kazhakstan.
  4. He is conferred with “World Award of Excellence in Culture & Literature by CUSCU, Peru Government.
  5. He is the Recipient of Golden Eagle Award from Hispanomundial UHE, Peru.
  6. Currently, he is senior consultant advisory in Motivational Strips, Principal Advisor of The Haven Group of 4 Sites, and Suryodaya Literary Foundation.

వీరి కవితలు అనువదింపబడ్డ భాషల్లో ఫ్రెంచ్, జర్మన్, రొమేనీన్, అల్బేనియన్, ఉర్దూ, మళయాళం ఇంకా మరికొన్ని భారతీయ భాషలు ఉన్నాయి.

వీరితో జరిపిన ముఖాముఖి నుంచి కొన్ని భాగాలు మీకోసం:

మీదృష్టిలో కవిత్వం ఏమిటి?

కవిత్వం కేవలం ఒక కళారూపం మాత్రమే కాదు. కళారూపమైన జీవనవిధానం. మనసులోని సున్నిత భావాలకు అతిసున్నిత భావోద్రేకాలను జోడించి ప్రకటించేదే కవిత్వం అని నాభిప్రాయం. అర్ధంకోసం ఆశపడకుండా కేవలం మానసికోల్లాసానికి పాడుకునే పాటలూ, రైంస్ నుంచి జీవితాన్ని ప్రభావితం చేసే గొప్ప వాక్యాలన్నీ కవిత్వమే. నామట్టుకు నాకు కవిత్వం జీవితంలో ఓ అంతర్భాగం. ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళూ చదవటం వరకూ వీలయ్యేది కానీ రాసేంత వెసులుబాటు దొరకలేదు. ఇప్పుడిప్పుడే ఓ పదేళ్ళుగా రాస్తున్నాను.

మీరు చదివిన కవిత్వం మిమ్మల్నెలా ప్రభావితం చేసింది?

ముందే చెప్పినట్లు జీవితాంతం చదివాను. ఒడిశా సాహిత్యం, ఆంగ్లసాహిత్యం చాలా చదివాను. అప్పట్లో చదవటం కేవలం ఒక వ్యాపకంగా ఉండేది. రాను రానూ అదొక సీరియస్ ప్రవృత్తిగా మారింది. అప్పట్లో రాద్దామంటె కుదరలేదు.

ఐతే కవిత్వం నాకు సహజసిధ్ధంగానే అలవడింది అన్న ఒక నిజం బలపడ్డానికి ఎంతో సమయం పట్టలేదు. నేను మాములుగా ప్రజలతో ఎక్కువ మాట్లాడటానికి ఇష్టపడను కానీ మాట్లాడితే కవిత్వం గురించే ఎక్కువ మాట్లాట్టానికి మక్కువగా ఉంటుంది. కవిత్వం వచ్చినంత సులభంగా నాకు మాములు మాటలురావు.

కవిత్వం నాపై అన్నివిధాలుగా తీవ్రమైన ప్రభావాన్నే చూపించింది. కవిత్వం చదువుతున్నప్పుడు ఒకవిధమైన అనుభూతిపరమైన భావోద్రేకానికి లోనైతే రాస్తున్నప్పుడు ప్రశాంతమైన భావోద్రేకపు అలజడి నన్ను కమ్ముకుంటుంది.

అంతర్జాతీయ కవిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న మీకు భారతీయ కవిత్వానికి అంతర్జాతీయ కవిత్వానికి ఉన్న ప్రధాన తేడా చెప్తారా?

భారతీయ సాహిత్యం వేదకాలం నాటిది. ఇంతటి చరిత్ర, సంస్కృతి మరే ఇతర భాషల్లోనూ సాహిత్యంలోనూ కనపడదు. షేక్స్‌పియర్ లాంటివారి సాహిత్యం కూడా మహా అయితే ఐదువందల ఏళ్ళక్రిందటిదే. కానీ ఆధునిక భారత సాహిత్యంపై వేదాల, ఉపనిషిత్తుల ప్రభావం చాలానే ఉంది. అది ఎప్పటికీ కొనసాగుతుంది కూడా. అందుకే మన సాహిత్యాంశాలు వేరేగా ఉంటాయి. మన ప్రక్రియలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. మనం కొద్దిపాటి మాటల్లో గొప్ప భావాలను చెప్పగలం. అందుకే నేను కేవలం ఏడు వాక్యాల్లోనే నా కవిత రాస్తుంటాను. దానికి విశేష ప్రాచుర్యం లభించింది.

My Scripts

I compose my poems
Emotions flash words
I ornament my scripts
From deepest sorrows
And highest happiness
With rhyming creations
Glow in speaking truths
My scripts of magnificence.
Dawn invigorates my hopes
Sprinkling sensational waves
Reconcile cherished fantasies
Blooming the optimistic rays
Ushering my frolic aspirations
Of revelling in sheer ecstasies
Innocence of balmy whispers
Kindles unfathomable yearnings.

Light of Life

I have lived my life
With happiness and sorrows
That came in my way.
But neither am overwhelmed
With joys nor broken
By storm of sorrows.
Now also am living my life
With happiness and sorrows
Navigating positivity in my
Outlook and temperament
Enabling to lead the days
With reverence and contentment
Discerning the sacred Light
That awaits patiently ahead
For the glory of His Kingdom.

(Mr Rohini Kumar Behera is known for his Septet kind of poetry i.e. poems written in Seven lines. His other poems can be read from his Facebook Wall. He is there with the same name as his id.)

విశాఖలో పుట్టి అక్కడే డాక్టరేట్ వరకూ చదివి ఆపై విదేశాల్లో వివిధ యూనివర్శిటీల్లో పనిచేసి ఇప్పుడు బెంగ్లూరు లో స్థిరపడి ఇక్కడ ఫ్రీలాన్సర్ గా పనిచేస్తున్నారు. రోజంతా పాఠం చెప్పటం... రాత్రైతే ఏదో రాసుకోవటం లాంటివి చేస్తుంటానంటారు. కవిత్వం అంటే ఇష్టం. కవిత్వం గురించిన చర్చలు కూడా ఇష్టమే.

Leave a Reply