మొక్కుడెంతసేపు…

బిడ్డలాపతిదీరే దేవుడి మొక్కుదీరే
యెవ్వలేమనుకుంటే నాకేంది
నేనేదనుకుంటే గజ్జేత్త
నా పేరే ఉద్దారకుడు
నేనే ఉద్దారకున్నీ
పాయిదా పనుల్జెయ్యటమే నా కెరుక
యెంగిలి మెతుకులకాసపడే గుంపుండనే ఉంటది
గదే తందానా అనేటోల్లహే
ఓట్లు గావాలే బల్లు షురూ
ఐనయ్ మూసిండ్లు గురూ
సానామంది జెప్పిండ్లు!! ఇంటరా?
యెవల్కు రోగాలత్తేంది? సత్తేంది?
మేం గెల్సినమా!! లేదా!!
పేదోని కట్టం ‘ప్రై’వేటు బల్లకు జేరాలే
జీతాలిప్పిచ్చినమని ఓట్లు దండుకోవాలే
ఖేల్ ఖతం దుక్నం బంద్
అయినా
బార్లు బార్లాదెరిసి నడిపిత్తండ్లు
గుడులు, మజీదులు, చర్చీలు ఖుల్లా జేసిండ్లు
పూటకూల్లిండ్లు పుల్లుగా నడుత్తానయ్
నాయకుల మీటింగ్ లల్ల
ముక్కుసిక్కాల్లేవు (మాస్క్),
దూరం యెన్నడో దూరం జరిగింది
ఈల్లెవ్వలకు అంటని రోగం
బల్లల్లకే యెందుకత్తందో!!
అంగట్ల కల్సి అవ్వ అంటే
యేదో అన్నట్టుంది కత
పత్తరాలైనా కోలుకోని నట్టం ఐతంది
బొత్తిగ సోయి లేకుండ జేత్తె యెట్ల?
మా అవ్వజెప్పినట్టు
మొక్కుడెంతసేపు యెగ్గొట్టుడెంత సేపు
మొక్కు బిడ్డా అన్నట్టుంది గదా!!??

Leave a Reply