మిగిలిందిక నువ్వే…

బిత్తరపోయిన పార్లమెంట్
పిచ్చి చూపులు చూస్తోంది
రాజ్యాంగం నిరాశగా
ఒక నవ్వు నవ్వింది

అంబేడ్కర్ చెప్పిన దెయ్యాలే
మొన్న పార్లమెంట్‌లో
ప్రమాణ స్వీకారం చేశాయి

రాజ్యాంగానికి
రోజులు దగ్గర పడ్డాయేమో
దేవుడ్ని నెత్తికెత్తుకుని
బిగ్గరగా అరుస్తూ..
దెయ్యాలు
అబద్ధపు వాగ్దానాలు చేశాయి.

వీధుల్లో గాంధీ విగ్రహాలు
రోజులు లెక్క పెట్టుకుంటూ
గజగజా వ‌ణుకుతున్నాయి

ఇవి మామూలు దెయ్యాలు కాదు
ఎవరినైనా ఒప్పించగలవు
తేడా వస్తే తప్పించగలవు కూడా

గాంధీని భ‌యపెట్టాయి
పటేల్ని వశం చేసుకున్నాయి
నెహ్రూని అసమర్దుడిని చేస్తున్నాయి

ఓ మై డియర్ బోస్…
ఇక మిగిలింది నువ్వే…
ఖరీదైన బొమ్మవే అవుతావా?
పాక్ పై యుద్ధానికి కాలు దువ్వుతావా?

How can we utilize your service
to form an orange nation?

పుట్టింది గౌరీపట్నం (పశ్చిమ గోదావరి జిల్లా), ప్రస్తుతం హైదరాబాద్ లో ఫ్రీలాన్స్ రైటర్, పోస్టర్ డిజైనర్ గా పని చేస్తున్నాడు.

Leave a Reply