మాతృ హంతకులు

బెంగాలీ మూలం: మౌమితా ఆలం

ఓహ్,
నా ప్రియమైన కుకీ అమ్మలారా,
మన శరీర భాగాలు వార్‌జోన్‌లు,
వాటర్ బాటిళ్ల కోసం
వాళ్ళు ఎగబడుతున్నప్పుడు
మొదటగా వారు మనల్ని చూస్తారు
అప్పుడు వాళ్ళ దాహం నీళ్ళతో తీరదని
మన యోనుల్లోనే తీరుతుందని తెలుసుకుంటారు

కలిసికట్టుగా అమ్మల్ని శపిస్తారు.
ప్రమాణం చేయిస్తారు
మీ తల్లిని ఫక్ చేయండి,
మీ సోదరిని ఫక్ చేయండి-
సంధ్యావందనంలో వందేమాతరానికి బదులు
ముప్పూటలా …
వాళ్ళు ఇవే ప్రతిజ్ఞ చేసే ఆచార నినాదాలు

మనల్ని వివస్త్రల్ని చేసి ఊరేగిస్తారు
బట్టలు విప్పి అత్యాచారం చేస్తారు
వీళ్ళే భారతజాతి క్రీడాకారులని
మైదానాల్లో ప్రకటన విడుదల చేస్తారు
మన శరీర భాగాలు
వారి విజయ ట్రోఫీలని ప్రకటిస్తారు

నిత్యం ఇక్కడ ఇలా చేయడం వాళ్ళకు ఇష్టం

వాళ్ళు మృగాళ్లు
మన శరీరాల కోసం యుద్దాలు చేస్తారు
వాళ్ళు మా రొమ్ముల్ని కాల్చివేస్తారు
అంతటితోనే వదిలేయరు
మమ్మల్ని యుద్ధ బాధితులని కూడా
పిలుస్తారు.

ఓ నా కుకీ తల్లీ
ONE SIDE WAR లో
వాళ్ళ యుద్ధం వాళ్ళే ఆడతారు
విందు ఆరగించాక
ఖాళీ సీసాల్లా మన శరీరాలను పొదల్లో విసిరిపారేస్తారు

ఈ మృగాళ్ల దేశంలో
మనల్ని ఒక తాటి మీదకు రానివ్వకుండా చీల్చి
రకరకాల పేర్లతో పిలుస్తారు
మరియు
V గుర్తులతో మమ్మల్ని ఊరేగిస్తారు.

ముచర్ల గ్రామం, ఖమ్మం జిల్లా. 2014 నుంచి కవిత్వం రాస్తున్నారు. 'ఇప్పుడేది రహస్యం కాదు' కవితా సంపుటి ప్రచురించారు. 2019 విమల శాంతి పురస్కారం, 2019 ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం అందుకున్నారు.

Leave a Reply