రాయటం ఒక జాలరిలా ఆలోచనల్ని ఒడిసిపట్టే ప్రక్రియ: ఫౌకియా వాజిద్

పువ్వు పుట్టగనే పరిమళించును అన్నది మనం చిన్నప్పట్నుంచీ వింటున్న నానుడి. ముఖ్యంగా కవుల్లో ఐ మీన్ కవయిత్రుల్లో కూడా ఇది నిజ్జంగా నిజం. చాలా మంది కవులు చిన్నప్పుడే రాయటం, కొన్ని ప్రపంచానికి తెలుస్తాయి. కొంతమంది కవిత్వం వాళ్ళిటికే పరిమితం అవుతుంది. ఈ రోజు మనం చదవబోయే కవయిత్రి బహుముఖ మరియు బహుభాషా ప్రజ్ఞాశాలి. ఆంగ్ల, ఉర్దూ మరియు హిందీ భాషల్లో అద్భుతమైన కవిత్వం రాస్తున్న ఫౌకియా వాజిద్ బెంగుళూరు నివాసి. 16 ఏళ్ల ప్రాయంలోనే స్క్రీచ్ అనే పేరుతో తన మొదటి కవితాసంపుటిని ప్రచురించిన ఘంత ఈమెది.

కవి, స్క్రీన్‌ప్లే రైటర్, కవితా సంపుటాల సంపాదకులు, నాటకరంగంలో నటిగా, ప్రొడ్యూసర్‌గా పలురంగాల్లో తనప్రావీణ్యతను ప్రదర్శించిన వ్యక్తిగా సాహితీ రంగానికి పరిచయం. జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజంలో పీజీచ్ చేసిన పిదప కలర్స్ కన్నడ టీవీ చానల్ లోనూ వైకాం 18 చానల్ లోను క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేసారు. “ఘర్ కా నా ఘ్ట్‌కా” అనే దూరదర్శన్ సీరియల్కి కథ రాయటమే కాకుండా దర్శకత్వం వహించారు.

“అన్ ఫైర్” అనే సంస్థను స్థాపించి యువకవులను ప్రోత్సహిస్తూ సీనియర్ కవులతో సమ్మిళితంగా కవితా సంపుటాలను ప్రచురించటం, సామాజిక సమస్యలపై స్పందనగా వీధినాటకాలను ప్రదర్శించటం ఫౌకియా వాజిద్ ప్రవృత్తిలో పెద్దభాగం. “The Great Indian Poetry Contest 2018.” నిర్వహించి ఆ ఈవెంట్ ద్వారా వచ్చిన కవితలతో ఆతిష్-2 అనే సంకలనం 2019 లో ప్రచురించటం కరోనా కాలానికి ముందు ఆమె సాధించిన ఘనకార్యాల్లో ఒకటి. మరిన్ని వివరాలకోసం stayonfire.in/fouqia లేదా Insta at Fouqiawajid ని చూడగలరు.

ఆమెతో జరిపిన ఇంటర్వ్యూలోని కొంతభాగం మీకోసం ఇక్కడ—

మీరు కవిత కానీ కథ కానీ రాసే ప్రక్రియ ఎలా ఉంటుంది?

నేను రాసే ప్రతిసారీ రాయటం అనే ప్రక్రియతో ప్రేమలో పడతాను. రాయటానికి చాలా టైమే తీసుకుంటాను. కానీ ఒకసారి రాయటం ప్రారంభించాక ఒకవిధమైన ఉద్వేగానికి లోనవుతాను. రాస్తున్న ప్రతిసారీ అది నా స్వంతమని ఒకరకంగా ప్రైవేట్ వ్యవహారంలా అనిపిస్తుంది. నా మిత్రునికో స్వంతమనిషికో రాసుకుంటున్న ఉత్తరంలా భావిస్తాను. తర్వాత దాంట్లో ఒక మెసేజో ఒక తాత్వికపరమైన భావనో స్వయంచలిత చర్యగా ఉద్భవిస్తుంది.

కానీ రాయటానికి ఉపక్రమించినప్పుడు ప్రపంచానికి దూరం జరుగుతాను. నాఫోన్ ఆఫ్ చేస్తాను. నా గదిలో ఒంటరిగా కూర్చుని రాయటానికి ఇష్టపడతాను. రాయటం మొదలెట్టాక ఒక జాలరిలా ఆలోచనల్ని ఒడిసిపట్టే ప్రక్రియలోకి సహజంగా వెళ్తుంటాను.

మిమ్మల్ని ప్రభావితం చేసిన మొదటి నవల లేదా కవిత లేదా మరేదైనా సాహిత్య పుస్తకం ఏది?

ఒకటని చెప్పలేను. నాకు చాలా నచ్చిన పుస్తకం ‘Sapiens: A Brief History of Humankind’ by Yuval Noah Harari. నేను అన్ని రకాల సాహిత్యాన్ని చదువుతాను. “Essentialism: The Disciplined Pursuit of Less” by Greg McKeown, మీర్జా గాలిబ్, జోష్ మలీహాబాదీ, ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవిత్వం చాలా ఇష్టంగా చదివే పుస్తకాలు. అలాగే Paulo Coelho’s ‘The Alchemist’ and Harper Lee’s ‘To Kill a Mockingbird’. నేను జీవితంలో ధృడంగా ఏర్పరచుకున్న అభిప్రాయాలని చిన్నాభిన్నం చేసి అవి తప్పని చెప్పే పుస్తకాలంటే నాకు ఇష్టం. నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలానే ఉందని నమ్ముతున్నాను. అది పుస్తకాల ద్వారానే జరుగుతుందని కూడా నమ్ముతున్నా.

మీరు ప్రచురణారంగంలో ఉన్నారుకదా, ఈ రంగంలో మీ అనుభవాలను మాపాఠకులకు చెప్తారా?

మేము కొంతమంది యువతీయువకులం కలసి ఓ ప్రచురాణలయం ప్రారంభించాము. యువకవులతో పాటు సీనియర్ కవులనూ వారి కవిత్వాన్ని ప్రపంచానికి పరిచయం చెయ్యాలనే సదుద్దేశ్యంతో ఆన్ ఫైర్ అనే సంస్థను ప్రారంభించాం. వీధినాటకలను ప్రదర్శించటంతో పాటు కవితా సంకలనాలను విభిన్నంగా తీసుకొచ్చే ప్రయత్నం చేసాం. ఈ క్రమంలో ఆతిష్ అనే మొదటి సంకలనంలో దేశంలోని ప్రముఖ ఆంగ్ల కవుల నుంచి కవితలను సేకరించి వాటికి గొప్ప కళాకారులచే బొమ్మలు వేయించాం. కొంతమంది కవులు వెంటనే బొమ్మలు నచ్చి ఓకే అనారు. కాని ఒకరిద్దరు చాలా ఇబ్బంది పెట్టారు. ఎన్ని బొమ్మలు పంపినా వారికి నచ్చలేదు. ఈ లిస్ట్ లో పేరొందిన నటులు కూడా ఉన్నారు. చివరికి వారి కవితలను బొమ్మలు లేకండానే ప్రచురించాం. ఇలా చాలా ఒడిదుడుకులు చూశాం.

ఆతిష్ 2 ప్రచురించే సమయంలో కూడా కొన్ని ఇబ్బందులు పడ్డాం. చివరికి హార్డ్ కాపీ వెయ్యకుండానే ఎమెజాన్ లోనే రిలీజ్ చేశాం. ఈ సంకలనం లో దేశంలోనే ప్రముఖకవులైన గుల్జార్. సచ్చినాందన్ (మళాయళం), ఉదయన్ ఠక్కర్ (గుజరాతి), మీర్ ఫైజల్(ఉర్దు), పవన్ కె.వర్మ, మైకేల్ క్రైటన్, గోపీ కుత్తూఋ, రఫీక్ అహ్మద్, వైదేహి (కన్నడ), దీప్తి నావల్, శశిథరూర్ లాంటివారినుంచి కవితలను ప్రచురించాం.

Would You?

O my mother in heaven
You left us five years ago
Nature was kind to you

You never craved for a nudge
Never isolated yourself in madness
Never stopped conversing face to face
Never feared the human race

You left in dignity, from a nicer world,
where cuddles, kisses, handshakes,
patting on the back, caressing a friend,
tickling a baby, stroking his hairlock
and tying her tie, was just fine.

Where embrace was care
Walking hand in hand was love
Physical fights were fun
Hugs were a must
Where human touch was normal

Now, if I could tell you
If I could only tell you where we are at
Would you believe me?

Breathe

This frail thread of breaths
May rip apart at any point
Gigantic functioning of the body
May come to a jittering halt

Each step taken carefully
Still gave in to an infection
Some gamble away their entire life,
Still sail through to safety.

No matter what the cause,
Once the drama ends
Everything crumbles into a black hole
There is no coming back.
Empty hands can’t seize your soul and lock it into a satchel;
No wealth, no prayer can stand by you
No switch to the former
No pass, no alternative
Stacked in the pile of insecurity
Mankind is reminded of its
Lasting vulnerability

Hanging between two worlds
Craving for just a few more breaths
About to be torn like a twig from life

Does death give you a second chance?

ఊపిరి

ఇదొక దుర్బల ఊపిరుల దేహం
ఈ తాడు ఎప్పుడైనా తెగిపోవచ్చు
బ్రహ్మాండమైన ఈ శరీర నిర్వహణ
ఏ క్షణమైనా ఆగిపోవచ్చు

జాగరూకతతో వేసిన ప్రతి అడుగు
మరో అంటురోగానికి దారితీస్తున్నదే
కొంతమంది జీవితంతోనే జూదమాడుతుంటారు
ఐనా క్షేమంగా తీరానికి చేరుకుంటారు

కారణమేదైనా
ఒకసారి నాటకం ముగిసాక
ప్రతీది చీకటికోణాల గదిలో పొడిపొడి కావాల్సిందే,
వెనుకకు మరలే అవకాశమేలేదు
రిక్తహస్తాలతో నీ ఆత్మను జప్తుచేసి
జోలెలో బంధించలేవు
అఖరికి
ఏ ఐశ్వర్యమూ, ఏ ప్రార్థనా నీపక్కనుండవు
పూర్వస్థితికి మరల్చేదేదీ నీవద్ద ఉండదు
మార్గాలూ లేవు, ప్రత్యామ్నానాలూ ఉండవు
అభద్రతాభావం నిన్ను కప్పేస్తుంది
మానవాళి దౌర్బల్యాన్ని ఎప్పటికప్పుడు
గుర్తుచేసేవే అన్నీ

కొన్ని పదాలమధ్య వేలాడుతూ
మరికొన్ని ఊపిరులకోసం అర్రులుచాచటం
సగం విరిగిన కొమ్మలా మిగిలిపోవటమే

మరణమైనా నీకు మరో అవకాశం ఇస్తుందా?

(అనుసృజన: వాసుదేవ్)

విశాఖలో పుట్టి అక్కడే డాక్టరేట్ వరకూ చదివి ఆపై విదేశాల్లో వివిధ యూనివర్శిటీల్లో పనిచేసి ఇప్పుడు బెంగ్లూరు లో స్థిరపడి ఇక్కడ ఫ్రీలాన్సర్ గా పనిచేస్తున్నారు. రోజంతా పాఠం చెప్పటం... రాత్రైతే ఏదో రాసుకోవటం లాంటివి చేస్తుంటానంటారు. కవిత్వం అంటే ఇష్టం. కవిత్వం గురించిన చర్చలు కూడా ఇష్టమే.

Leave a Reply