ప్రతి నిత్యం

(స్పానిష్ మూలం: రోసారియో కాస్తెల్లానోస్
అనువాదం : జె. బాల్ రెడ్డి
)

ప్రేమకు స్వర్గం లేదు
ప్రేమ, ఇది ఈ రోజుకే
అద్దం ముందు నిల్చొని దువ్వుకుంటున్నప్పుడు
విడివడని వెంట్రుకల చిక్కుల్లాంటి దుఃఖంలో
సుధీర్ఘ సొరంగాల ప్రయాణంలో
కళ్ళులేని ధరుల మధ్య శ్వాస కోసం తడుములాట
శూన్యం నిండిన గోడల మధ్య దాగిన
అర్థరహితమై గొంతు ప్రతి ధ్వని
ప్రేమకు విరామం లేదు. ప్రేమను, రాత్రిని
హఠాత్తుగా భరించడం అతి కష్టం
తోరణంలో తెగిన తార వెర్రిగా వంకర టింకర నడకతో
పరుగెట్టి కనుమరుగవుతుంది.
దీని కోసం ప్రకృతి తన పట్టును సడలించదు
చీకటి రేయిన ఎదురు పడ్డప్పుడు
నేనందిన చుంబనంలో కలగలిసిన కన్నీటి రుచి
హృదయానికి వత్తుకొని హత్తుకొనే ఆలింగనంలో
ఆ దిక్కులేని చావుకు సంబంధించి
నీ జ్ఞాపకాలను గట్టిగా నిలుపుకో

పుట్టింది బొమ్మాయిపల్లి, నల్లగొండ జిల్లా(పూర్వపు). రచయిత, జర్నలిస్టు, అనువాదకుడు, రైతు. వివిధ పత్రికల్లో ఫ్రెంచ్ అనువాదాలు ప్రచురితమయ్యాయి.   ప్రస్తుతం  కృతి వ్యవసాయం చేస్తున్నారు.

Leave a Reply