పుస్తకావిష్కరణ

ఇపుడే రాల్చిన పూలరేకు
మీద
ఎవరో ఈ భూమిపుత్రుడు
నెత్తుటితో తన పేరు రాసి
సభకు పంపాడు

‘సబ్ ఠీక్ హై, మైతో నహీ హారా
లేకిన్ హార్ రహాఁహై మేరాదేశ్’

మీరు సీతాకోకచిలుకలనెగురేసి,
పావురాల బొకేలు అతిథులకివ్వవచ్చు
అధ్యక్షా,
అంత గాయం అంతరాయంగా మారినందుకు చింతించు
వాయిదా వేయకు
జరిగితీరాల్సిందే
సభానంతరం ఊరేగింపు

మళ్ళీ పూలరేకులు రాలవచ్చు

జనగణమన అధి…

ఆలేరు, యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా. విశ్రాంత ఉపాధ్యాయుడు, చ‌రిత్ర ప‌రిశోధ‌కుడు. పుస్తకాలు: మట్టి పొత్తిళ్ళు, మూలకం, రెండు దోసిళ్ళ కాలం(కవితా సంకలనాలు), పాడాలని(పాటలు), ఆలేటి కంపణం, ఠాకూర్ రాజారాం సింగ్ (చరిత్ర రచనలు), సాహిత్య వ్యాసాలు, కథలు, నాటికలు.

Leave a Reply