పచ్చబొట్టు

రోజుకొక్కసారైనా
రాంగ్ నెంబర్ ఫోన్ వస్తుంది
నా గుండె లోతుల్లో ఎక్కడో
చిక్కటి రింగ్టోన్ మెల్లగా మోగుతుంది

సంబంధం లేని విషయాలేవో
మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది
చెప్పాల్సిన సంగతులన్నీ
అలవొకగా చెప్పేయడం
నాకు మాత్రమే అర్ధమౌతుంది

పనుల ఒత్తిడిలో వున్నప్పుడు
మిస్డ్ కాల్ ఒకటి పలకరిస్తుంది
ఓ మర్కజీ…
నన్ను మరిచిపోలేదుగా అంటూ
సరికొత్త పేరుతో ఉడికిస్తుంది

ఓ రోజు పొద్దున్నే
ఐడియా నుంచి మెసేజ్ వస్తుంది
కలల కనుపాపల్లో దాచుకున్న తాజ్ మహాల్
సుందరయ్య విజ్ఞాన భవన్లో
సాక్షి సంతకం చేస్తుంది

నీ నుదుటి మీది ఎర్రటి తిలకం
బతుకు గుమ్మం ఎదుట
రేపటి ఉదయాన్ని ముద్దాడే సూర్యోదయమౌతుంది
మిత్రులతో కలిసి మనం తీసుకున్న సెల్ఫీ
గుండె మీది పచ్చబొట్టులా మిగిలిపోతుంది…!

పుట్టిన ఊరు ఎర్రగొండపాలెం. ప్రస్తుత నివాసం ఒంగోలు. కవి, రచయిత, జర్నలిస్టు.  సాహిత్యం : ఖిబ్లా ( సంపాదకత్వం), జంగ్ ( సంపాదకత్వం ), నిప్పు ( సంకలనం ), ఒక దేశద్రోహి ప్రేమ కథ ( సంకలనం ), కథలు : లాకప్ డెత్,  ప్రతిజ్ఞ, నీకి - నాకి, ధక్కా.

Leave a Reply