పొడిచే వేకువని చూడొద్దని..
పొద్దును పాడే పిచ్చుకల్ని వినొద్దని…
గంధకపు గాలి సంచారాన్ని
పీల్చద్దని
విరగ్గాసే రక్తపూల అందాన్ని
తాకొద్దని
మర్రి ఊడల
నిర్మానుష్యపు నిఘా…
చనుబాల తీపికి
చంటిపిల్లాడికి
వేగుచుక్కకు
ఉదయ జ్వాలకు
గుండె కలకు
కంటి నీరుకు
ఎడం పెంచుతూ
“జీవక్రియల” మీద
ఇనుప గజ్జెల నిఘా
ఆకురాలు ధ్వని చేసే అక్షరాలను
నెగడు బాటకే నడిచే పాదాలను
కొత్త కాంతుల మాటలను
వధ్యశిలకే కట్టేయాలని
అలవాటైన అంపశయ్యల మీది నిఘా….
గట్లుతెగే నదీ పుట్టుక మీద
సాయుధ కడలి హోరు మీద
“వసంతకాలపు ఎండ మీద”
రాబందు రెక్కల నిఘా…
బద్దలవ్వక తప్పని వెర్రి నిఘా…
బావుంది