దేశం సిగ్గుపడాలి

అతను ఆదివాసీ అడవుల్లో
నడిచిన విప్లవ క్రీస్తు
ప్రభువుని నమ్మినట్టే
ప్రజలని ప్రేమించాడు
ప్రజల హక్కులే
దేవుని వాక్కులే అని !
కొందరికి ప్రేమంటే భయం
ఈ ప్రేమికుడు
మరఫిరంగి కన్నా డేంజర్ లాగున్నాడు
నిరంకుశ రాజ్యానికి
తుపాకీ పట్టుకున్న యేసుక్రీస్తూలా
కనిపించిన ఆ ముసలి యవ్వనుడు
జైలు గోడలనే వణికించిన నిర్మలత్వం
అతనెప్పుడూ వోడి పోలేదు
ఎత్తిన తలనెప్పుడూ దించలేదు
శరీరం ముడతలు పడుతున్నా
ఆ ప్రేమ మనసెప్పుడూ వడలిపోలె
ఆ మనిషి చివరి కోరిక
నా శరీరాన్ని ఆసుపత్రి పాలుచేయొద్దు
ఈ జైలు గోడల మధ్యే నిద్రపోనీయండి
ఈ దేశం సిగ్గుపడేలా !

ప్రత్యామ్నాయ సాహితీ, సాంస్కృతిక ఉద్యమాలపట్ల ఆసక్తి. తత్వశాస్త్ర అధ్యాపకుడు. "దళిత ఉద్యమం, వెలుగునీడలు" (వ్యాససంపుటి), "పొలిటికల్ ఫిలాసఫీ ఆఫ్ అంబేద్కర్," థీయరిటికల్ అండర్ స్టాండింగ్ ఆఫ్ దళిత్ మూవుమెంట్" రచయిత. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తుంటాడు.

Leave a Reply