దాసరి శిరీష జ్ఞాపిక – 2024

రచనలకు ఆహ్వానం

సంగీతాన్ని, సాహిత్యాన్ని, మనుషులని ప్రేమించిన రచయిత్రి దాసరి శిరీష. ఆమె ఇష్టాలని celebrate చేసుకోటమే ఆమెని తలుచుకోటం అనుకున్నారు శిరీష కుటుంబసభ్యులు. రచయితల పట్ల ఆమెకి ఉన్న ఆపేక్ష, అభిమానాలకు గుర్తుగా ‘దాసరి శిరీష జ్ఞాపిక’ను అందజేయాలి అనుకున్నారు. ఎంపిక చేసిన ఒక రచనను ముద్రించి, ఆ పుస్తకాలను ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 3న రచయితకు అందించాలి అన్నది వారి కోరిక. ప్రచురణపై సర్వహక్కులు రచయితవే. కేవలం పది శాతం పుస్తకాలను శిరీష కుటుంబ సభ్యులు, జ్యూరీ సభ్యులు తీసుకుని మిగిలిన 90 శాతం పుస్తకాలను రచయితకు ‘శిరీష జ్ఞాపిక’గా అందజేస్తారు.


2023 సంవత్సరానికి ‘దాసరి శిరీష జ్ఞాపిక’కు ఎండపల్లి భారతి గారు రాసిన ‘జక్కీకు’ దేశినవల ఎంపికైనది.


నిబంధనలు :
1. కథ / కవిత్వం / నవల / జీవిత చరిత్ర / ఆత్మకథ సారాంశాన్ని A4 size పేజీని మించకుండా dasarisireeshagnaapika2024@gmail.com 2. సినాప్సిస్ తప్పనిసరిగా unicode లేదా pdf ఫార్మాట్ లో మాత్రమే ఉండాలి.
3. తమ రచన ఏ ప్రక్రియకి చెందినదో తెలియజేయాలి. ఏ ప్రక్రియకి చెందిన రచన అయినా 200 పేజీలు మించకుండా ఉండాలి.
4. స్వీయపరిచయంతో పాటు రచయిత ఫోన్ నెంబర్, అడ్రెస్ కూడా mail చేయాలి.
5. ఈ వివరాలన్నీ June 5వ తేదీలోగా పంపాలి.

* పుస్తక ముద్రణలో తోడ్పాటు కోరే కొత్త తరం రచయితలకు ప్రాధాన్యం ఉంటుంది.

Leave a Reply