తిరుగుబాటు

వాడేమో పొలం వీడి

హలం పట్టి

వాడి పంటకి వాడు ధర నిర్ణయించ 

రాజధాని వీధుల దున్నుతుంటే

వీడికి వాడిలో తుపాకీ పట్టిన ఉగ్రవాది కానవచ్చే!

డ్రోన్లు దాడులు చేస్తుంటే

దారాలు పతంగులు ఎగురేస్తున్నాయ్!

పదునైన ఆలోచనలు ప్రణాళికల్లో

ధిక్కార పతాకలు!

పెల్లెట్లు దూసుకొస్తుంటే

ఎదురొడ్డిన ధైర్యం

లక్ష్య సాధన నిండిన వాడు

చావుకి వెనుకాడని స్థైర్యం సాక్షాత్కారం!

దళారీ ఆడే ఆటలో రాజ్యం వేట

హక్కుల దక్కించుకునే ఆటలో సిపాయి రైతు

పై చేయి కాదిక్కడ

భావి సౌధ నిర్మాణ పునాది ఈ పోరు!

మూడు స్తంభాలు మతం చుట్టూ మూగి పెచ్చులూడి

కూలిపోతుంటే

నాలుగోస్తంభం సైతం ప్రశ్నించక అదే దారిలో! 

శక్తులన్నీ ఓ వైపు

వాడు మాత్రం బాలచంద్రుడి లా రణరంగంలో…

పుట్టింది సూర్యాపేట. పెరిగింది నాగార్జున సాగర్. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్ మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్. విద్యార్థి దశలో ఎస్. ఎఫ్. ఐ. లో పని చేశారు. సామాజిక ఆర్థిక సమస్యలను కవితా వస్తువులు గా తీసుకుని  కవిత్వం రాస్తున్నారు.  వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.

Leave a Reply