తాటక దండకం

దేశమంటే మట్టీ మశానాలూ
మల మూత్రాలూ,
గుడి గోపురాలూ కాదురా!
కష్ట జీవుల్ది ఈదేశం…
దేవుడి పేరు చెప్పి
మనుషుల్ని దెయ్యంలా పీడించే
సైతాన్, అసలు నువ్వేరా,
ఈదేశానికి పట్టిన చీడ పుగుగువి!


ఒరే,
నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా!
తిండి పేరు చెప్పి
నరమాంసం బొక్కుతున్నావ్!
పరిశుద్ధం, స్వచ్ఛ అంటా
దేశాన్ని గంగానదిని చేసేవ్ కదరా!
నీ దేశభక్తి సంబడం
చెవులకి బో ఇంపుగా ఉందిలేగానీ
నీ మనుషుల్లో ఒక్కడంటే ఒక్కడు
మిలిట్రీకెల్లిన మొగోడున్నాడా చెప్పు !


అందరి మాయ ముంతలూ అడిగే
మొనగోడు సిమింటువి
ఏదీ, నీ అజాంబ్రం చూపియ్!
ఎక్కడోడివి… యాడోడివిరా!
అసలు నువ్వు
ఏవూరికన్నా గడ్డెత్తినోడివేనా?
ఆడి కన్ను మన్నైపోను!
ఏ దేవుడు చెప్పేడురా నీకు
ఈ నేలని నెత్తురులో ముంచమనీ!


నీకు దూం తగల…
నీకు అచ్చరం విలువేందో తెలుసా!
చదువుకునే పిల్లోళ్ళ మీదపడి
ఏడిసి చస్తన్నావ్ ముదనష్టపోడా!
నీకు గత్తరొచ్చిపోను!
ఎన్నడన్నా నువ్ పుస్తకాల మొకం చూస్తే
గ్రంధాలయం తగలబెట్టవురా
తలకి మాసిన సన్నాసీ!


మా ఉసురు తగులుద్ది సూడు నీకు
ఆడపిల్లలని ఆగం చేసే
నీ ఇత్తనం ఇలమీద లేకుండా పోద్ది!
నీ ఇంట్లో ఇరవయ్యొక్క పీనుగెల్ల…
మల్లీ చెబుతున్నా యిను,
ఈ ఇలాకాలో ఎవురినన్నా
ఇంకోసారి ‘దేశద్రోహి’ అన్నావంటే
ముచ్చిలిగుంటలో తంతా!

జ‌న‌నం: గుంటూరు జిల్లా ప్యాప‌ర్రు. నాగార్జున విశ్వ‌విద్యాలయంలో బుద్ధిస్ట్ స్ట‌డీస్‌లో అసోసియేట్ ప్రొఫెస‌ర్ గా ప‌నిచేస్తున్నారు. ర‌చ‌న‌లు: అస్తిత్వ గానం, మంకెనపువ్వు(క‌వితా సంక‌ల‌నాలు), 'Caste, Religion and State in Medieval South India', 'Facets of Gender Discrimination and Violence, 'Tribe- Peasant- Elite Dynamics in Medieval Andhra'.

One thought on “తాటక దండకం

Leave a Reply