ట్రంప్ కొక్కొరు కో !

స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కి
కమలం సలాం
మొదలు పెడితే
అర్థ రాత్రి
నుండే
అమెరికా కోడులు కూస్తాయి!
అమెరికా కోళ్ల కాళ్ళతో
తన్నితే మా కోళ్ల
కడుపుల నుండి
గుడ్లన్నీ స్రావమై పోయాయి!
అమెరికా కోళ్ల కాళ్ళు
అమెజాన్ నుండి పుష్కలంగా అందుతాయి!
అమెరికా వైరస్ లూ
ఉచితంగా సరఫరా చేయ బడతాయి!
తరువాత మందులు
అధిక పన్నులతో దేశం గుండెలోకి
దిగబడతాయి
గద్దె మీద నిలబడ్డ గద్దలతో
జీవితాలు విశ్వ విపణి లో
తాకట్టు పెట్టబడతాయి
నీ ఇంటి మీద కూసే కోడి నీది కాదు
నీ గుడ్డు కి పేటెంట్ వాడిదే!
మళ్ళీ మళ్ళీ
అరిగిన పాట
పాడుకుందాం
మేరా భారత్ మహాన్

క‌వి, ర‌చ‌యిత‌. నిర్మాణ రంగంలో ఐటీ విభాగం మేనేజర్ గా ప‌నిచేస్తున్నారు. 1985 నుంచి రాస్తున్నారు. వివిధ పత్రికల్లో క‌థ‌లు, కవితలు, కార్టూన్‌లు, ఇంగ్లిష్‌లో కూడా వంద‌కు పైగా క‌విత‌లు వివిధ వెబ్ ప‌త్రిక‌ల్లో ప్ర‌చురిత‌మ‌య్యాయి.

2 thoughts on “ట్రంప్ కొక్కొరు కో !

Leave a Reply