చల్ నిఖ్లోఁ.!!!

ఒరేయ్ నరిగా…
అప్పుడెప్పుడో చెడ్డీలేసుకున్నపుడూ
టీ అమ్ముకున్నానని చెప్పిన నీ గాలి మాటలకు…
గుర్తింపు ఏదిరా..‌‌.??

అరేయ్…కా”షా”యి….
ఏందిరా నీ లోల్లి….
కల్ల బొల్లి మాటలను చెప్తూ,
మా మాయిముంతలను లెక్కబెట్టాలంటున్న నీ చేతల్లో ఇన్సాప్ కహాఁహైరే…

మీ తల్లీ…!
మిమ్మల్ని కన్నప్పుడు రక్తసిక్తమైన ఆ బట్టలుతికిన‌…
మా చాకలి బండనడిగినా మా గుర్తింపు చెప్తది…

మీ తల్లీ…!
మీకు చనుబాలు తాపి, మీ ముడ్లు బోర్లేసిన…
మా వడ్రంగి ఉయ్యాలనడిగినా మా గుర్తింపు చెప్తది…

మీ అయ్యా..!
ఆయాసంతో మిమ్మల్ని మోయ్యకపోతే…
వసంత పంచమి నాడు నాలుగు ముక్కలు నేర్పడానికి నిన్ను మోసిన మా వాళ్ళ బుజాలనడిగినా మా గుర్తింపు చెప్తది…

మీ ఖాన్దాన్..‌‌..!
ముచ్చటపడి పుట్టుఒల్లెలు చేసినప్పుడు…
మీ బుడ్డగోసిలకు బదులు పట్టుబట్టలను నేసిన ఆ మగ్గాలనడిగినా మా గుర్తింపు చెప్తది…

మీ జాతీ.‌…
మీరు మదమెక్కి కొట్టకుంటున్నప్పుడూ…
మీ అయ్యావ్వలు మీకు లగ్గంచేస్తే…
మీవాలంతా బగ్గా మెక్కిన కంచాలను ఎత్తిన ఆ చేతులనడిగినా మా గుర్తింపు చెప్తది…

మీ బతుకులు…
మీరు చేస్తున్న పాపాలు పండి మీరు చస్తే…
మీ శవాల ముందుండి అందరికీ చాటించే మా డప్పునడిగినా మా గుర్తింపు చెప్తది….

మగర్ తేరా నిసాన్ కాహా హైరే….!!
అరేయ్…
బట్టేబాజోఁ…
అబ్ మైబీ పూచ్ రహాఁహూ…
కహఁహై బతా తేరా దభ్బా…‌
చల్ నికాలో సాలే తుమ్హారాబీ ఖాగజ్…
నహీహై… తో
చల్ నిఖ్లో సాలే…

(NRC, CAP, NPR ల పేరున జాతీయతను పాడు చేస్తున్న వైనాన్ని నిరసిస్తూ…)

పుట్టింది సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం వడ్డీ. కవి, సామాజిక కార్యకర్త. ఎంబీఏ చదివారు. ప్రస్తుతం ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు.

One thought on “చల్ నిఖ్లోఁ.!!!

  1. ఇప్పటి పరిస్తితి వ వ్యతిరేకుస్తూ బాగా రాశారు

Leave a Reply