గురువు

సుద్ద పట్టుకుని సుద్దులు నేర్పాల్సిన
వేళ్ళే
పళ్ళ బండిని తోసుకుంటూ
బ్రతుకు బండిని తోస్తాయి !
పద్యం తో నిండి పోవాల్సిన నోరు
మద్యం షాపుల దగ్గర అదుపుల తో
ఎండి పోతుంది !
లెక్కలు నేర్పాల్సిన మెదళ్ళు
జనాభ లెక్కల ప్రవాహం లో
కుదేలవుతాయి !
అంతర్జాలం మొదలయ్యాక
తరగతి అంతర్ధానమై
గురువు తెర పై
మిధ్యా బింబమే !
పరువు లేని గురువు
రాజ్యానికి బరువా ?
ఇక ఇంజనీరు దోషమైతే
ఒక నిర్మాణమే ఆగిపోతుంది !
గురువు కరువైన నాడు
జాతి నిర్మాణమే
ధ్వంసమవుతుంది !

క‌వి, ర‌చ‌యిత‌. నిర్మాణ రంగంలో ఐటీ విభాగం మేనేజర్ గా ప‌నిచేస్తున్నారు. 1985 నుంచి రాస్తున్నారు. వివిధ పత్రికల్లో క‌థ‌లు, కవితలు, కార్టూన్‌లు, ఇంగ్లిష్‌లో కూడా వంద‌కు పైగా క‌విత‌లు వివిధ వెబ్ ప‌త్రిక‌ల్లో ప్ర‌చురిత‌మ‌య్యాయి.

2 thoughts on “గురువు

Leave a Reply