నిర్మాణం
మన లక్షణం
చీమల మల్లే-
ఈ ఇల్లు
మనది!
ఇక్కడే, ఇదే
ఎప్పటిదో!
కూలదోస్తూ
వాళ్ళు-
మనమే అందించిన
మన మౌనమే, ఆ–
కమండలం –
త్రిశూలం –
కోదండం –
చిందరవందరగా
శకలాలు
నీడలు
దాసులు,
నేను, నువ్వూ!
ఇక్కడ ఇప్పుడు
పువ్వులేవీ, నవ్వులేవీ?
శిశిరం
పూనినట్టు
మన
వేరు చివరనుండి
చిటారుకొమ్మ దాకా–
ఇప్పుడిక ఏవీ?
కలలు!
ఎక్కడ?
నేను, నువ్వు?
తలగడపై
పాములజాడలు
చిక్కులుబడ్డ
కేశాల జ్ఞాపకాలు
ఇంతేగదా?
వేదన
దీపంకింది నీడంత
చింత
చీమనెత్తిన బరువంత
అయినా
మరలా, మరలా-
ఐనా సరే
దివ్వెగూడు కట్టుకోవాలి
చీకటికురులు సవరించాలి
నువ్వు,నేను- చస్తే
మనకలలలోనే మునిగి చావాలి.
మనవైన కలలకోసమే–!
వాస్తవిక కవిత్వం