ఇక మనుషులుండరు

ఇక మనుషులుండరు

మనిషి నుండి మనిషిని
దూరం చేసేవారుంటారు

మనిషిలోని మనిషిని
చీల్చేవారుంటారు

మనిషికున్న మనిషిని
తీసుకెళ్లిపోయేవారుంటారు

మనిషికో మనిషి
వద్దనేవారుంటారు

మనిషితో మనిషిప్పుడు
అమానవీయం

మనిషి వెంట మనిషి
ఆశాశ్వతం

మనిషికో మనిషి
అసంభవం

మనిషి లాంటి మనిషి
అసందర్భం

లోపలి,బయటి మనుషులు
అపరిచితం..

అందుకే
ఇక మనుషులుండరు..
మనసులూ ఉండవు..

కవయిత్రి, కథా రచయిత. న్యూస్ ప్రజెంటర్. రచనలు: మట్టిపూల గాలి(కవిత్వం). ఓ న్యూస్ చానెల్ లో న్యూస్ ప్రజెంటర్ గా పనిచేస్తున్నారు.

3 thoughts on “ఇక మనుషులుండరు

  1. beautiful poem with less and simple words.

Leave a Reply