అబార్షన్ మా జన్మ హక్కు

గర్భసంచీ తెగని బందిఖానాయో
పూల పొదరిల్లో
గర్భం బయటపడలేని సంకెలో
అపురూప బహుమతో
మాకు మేముగా నిర్ణయించుకుంటాం

కడుపుకోతైనా
తలరాతైనా
మాకు మేముగా రాసుకుంటాం

శాపపు మాతృత్వాలు
అవాంఛనీయ మాతృత్వాలు
మాకు మేముగా దిద్దుకుంటాం

ఆనందపు మాతృత్వాలు
హాయైన మాతృత్వాలు
మాకు మేముగా అందుకుంటాం

నిజానికి
మెలిపెట్టే
కడుపుకోత వెనక
ఎన్ని శిలువల
గర్భ సంచీల్ని
మోస్తున్నామో
ఎవరికి తెలుసు?

కోల్పోయే
ప్రతి గర్భం
వెనక
బిగబట్టాల్సిన కన్నీళ్లెనో
ఎవరికి తెలుసు?

గర్భం కావాలనుకోవడానికి
గర్భం అంటగట్టబడడానికి
తేడా మీకేం తెలుసు?

గర్భసంచి నా అవయవం
అబార్షన్ మా జన్మహక్కు

గర్భం
తెగిపడిన
చోటల్లా
మీరు రగిల్చే
పాపపుణ్యఘోషలు
న్యాయాన్యాయ చర్చలు
మాకొద్దు
మింగేసే సర్పాల్లాంటి
మతాలు మాకొద్దు

మా శరీరాల మీద
మా అవయవాల మీద
మా మనస్సుల మీద
మగవాడికే కాదు
న్యాయ వ్యవస్థకీ
హక్కు లేదు
ప్రభుత్వానికీ
హక్కు లేదు

మా గర్భాల్ని
శాసిస్తున్న
మీరు కడుపు తడుముకున్నంత
సులభం కాదు
కడుపు రావడం అంటే-

గర్భసంచి
పూర్తిగా నా అవయవం
గర్భం
పూర్తిగా స్త్రీల స్వంత విషయం
అబార్షన్ స్త్రీల జన్మహక్కు

(అమెరికాలో జరుగుతున్న అబార్షన్ హక్కుల ఉద్యమం సందర్భంగా)

రచయిత్రి. గాయని. భాషా నిపుణులు. “నెచ్చెలి” అంతర్జాల వనితా మాస పత్రిక వ్యవస్థాపక సంపాదకులు. కాలిఫోర్నియాలో నివాసం. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఫీల్డు లో "తెలుగు భాషా నిపుణురాలి" గా పనిచేస్తున్నారు. ద్రవ భాష(2001), శీత సుమాలు(2006), శతాబ్ది వెన్నెల (2013) , సెలయేటి దివిటీ (2017) కవితా సంపుటాలు, సిలికాన్ లోయ సాక్షిగా(2018) కథా సంపుటి, వెనుతిరగని వెన్నెల (2021) నవల ప్రచురింపబడ్డాయి. వివిధ పత్రికల్లో, సంకలనాల్లో కవిత్వం, కథలు, కాలమ్స్, ట్రావెలాగ్స్, వ్యాసాలు అనేకం ప్రచురింపబడ్డాయి. కవిత్వంలో అజంతా అవార్డు, దేవులపల్లి అవార్డు, కుందుర్తి అవార్డు మొ.న ప్రతిష్టాత్మక పురస్కారాలు ఎన్నో పొందారు. వీరి రచనలు ఇంగ్లీషు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లోకి అనువాదం అయ్యాయి.

5 thoughts on “అబార్షన్ మా జన్మ హక్కు

 1. స్త్రీ శరీరంపై పూర్తి హక్కు ముమ్మాటికీ స్త్రీదే.

  చాలా బాగుంది గీత గారూ ‌‌మీ కవిత

 2. Abortion and racism are both symptoms of a fundamental human error. The error is thinking that when someone stands in the way of our wants, we can justify getting that person out of our lives. Abortion and racism stem from the same poisonous root, selfishness. We create the deceptions that the other person is less important, less worthy, less human. We are all fully human. When we face this truth, there is no justification for treating those who look different than us as lesser beings. If we simply treat other people the way we’d like to be treated, racism, abortion, and other forms of inhumanity will be things of the past.

 3. గర్భసంచి నా అవయవం అన్నారు. మరి, గర్భసంచి లోపలి పసిగుడ్డు మీకేమీ అవ్వదా?

 4. Geeta Garu. U r right —madam
  Great poem
  It is personal —her choice — why govt and judicial interference —
  —————-buchireddy gangula

Leave a Reply