అడవి పిలుస్తోంది

ఒక వర్షపు చినుకు పడగానే
నాలోంచి ఏదో అడవి సువాసనేస్తుంది

నిలవలేనితనం తో
కనపడిన చెట్లన్నీ చుట్టబెడతాను
ప్రతి మొక్కనీ పిట్టనీ పలకరిస్తాను

ఆ చోటులోని
ప్రతి పిందే నాకు పరిచయమే

ప్రతి ఆకూ
ఏదో ఒక చెట్టు చిగురించిన ప్రేమ పత్రమే

నడిచి నడిచి
ఓ లోయ అంచుకు చేరుకున్నాను

కిందంతా పచ్చదనపు తివాచీ
దూకేసి
దానిమీద నిదురించాలనిపించింది

ఆకాశం
ఉత్కంఠతో వర్షించడం ఆపేసింది

అడవి నన్ను పిలుస్తోంది
కానీ నేను వెళ్ళను

ఇక్కడే
మరిన్ని అడవులు తయారు చేయాలి

అప్పుడే
ప్రతి అడవీ అందర్నీ పిలుస్తుంది

అదిగో
వర్షం… సహర్షమై మళ్ళీ మొదలైంది

హైదరాబాద్ లో బీ. కామ్ చదివారు. ప్రస్తుతం Synchrony Financial కంపనీలో సీనియర్ కస్టమర్ సర్వీస్ రిప్రెసెంటేటివ్ గా పని చేస్తున్నారు. కవిత్వం, ముఖ్యంగా ప్రేమ కవిత్వం ఆమె ఆసక్తి.

One thought on “అడవి పిలుస్తోంది

Leave a Reply