విరసం సభలకు అరుణోదయ సందేశం

చితిమంట సాక్షిగా
ఇద్దరే ఇద్దరు
ఒక్కటయ్యి పోయారా
తన చుట్టె ఉన్నారని
తల్లి బొజ్జా మాట
నిజమైపోతున్నదా
ఒకటే జీవితం- ఒకటే ఆశయం
ఒక చోటే దహనం- ప్రజలకై త్యాగం

                ||చితిమంట||

నడుముకు చుట్టుకునే గజం గుడ్డాలేని
అడవి తల్లి భారతమ్మా
తాటి కమ్మల గుడిసె తాజ్ మహలాయె
అడవమ్మ ఎన్నెలమ్మ
ఆదివాసుల హక్కు అడవిపై భూమిపై
నేల పోరలో దాగే ఖనిజ సంపదపై
విప్లవాల వార్త విశ్వవ్యాప్త చర్చ

                 ||చితిమంట||

గతాన్ని సమీక్షిస్తూ, వర్తమానాన్ని చర్చిస్తూ
భవిష్యత్తును లెక్కిస్తున్న విరసం సభలకు
అరుణోదయ జేజేలు. ప్రజల కోసం
నిత్యం ప్రాణాలర్పిస్తున్న వందలాది
అమరులకు విప్లవ జోహార్లు.

మీ పేరు అమరం
మీ వృత్తి సమరం
మీ ఊరే ఈ విశ్వము – మీ
వారసులె పోరాట జనమూ

                 ||మీ పేరు||

పుట్టింది కరీంనగర్ జిల్లా వేములవాడ. కవి, రచయిత, గాయకుడు. విప్లవోద్యమ నాయకుడు. అసలు పేరు కూర దేవేందర్. కలం పేరు మిత్ర. అమర్ పేరుతో సీపీఐ(ఎం.ఎల్.) జనశక్తి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు. రచనలు : 1. మిత్ర తెలంగాణ పాటలు, 2. పొదుగు, 3. వరుపు, 4. మిత్ర జనం పాటల సవ్వడి (పాటలు); 5. చితాభస్మంలోంచి...(కవిత్వం); 6. తెలంగాణ డప్పు దరువు, 7. తెలంగాణ ధూం ధాం, 8. తెలంగాణ కోలాటం పాట, 9. ముంబై తెలంగాణం, 10. బహుజన బతుకమ్మ, 11. వీరతెలంగాణ (నృత్యరూప గానాలు).

Leave a Reply