నీ జననం తెలంగాణ ధిక్కార దినం

పల్లవి :

ధీర ధీర ధిక్కారం
ధన్యమయ్య నీ జననం
వీర విప్లవ తెలంగాణం
నీ కలమాయె కరవాలం
రాష్ట్ర సాధనె సంకల్పం
ఆటు పోట్ల నీ పయనం ఎటు
అంతం కాదది ఆరంభం
దొర గడీలతో నీ సమరం
బహుజన శక్తి శంఖారావం

||దొర గడీలతో||

అనుపల్లవి :

ధిక్కారం ధిక్కారం
ధిక్కారమే సత్తన్నా
నీ జయంతే ధిక్కార దినం
ముచ్చర్ల సత్తన్నా

||ధిక్కారం ధిక్కారం||

ధీర ధీర ధిక్కారం
కోరస్ : ధిక్కారమే సత్తెన్నా
ధన్యమయ్య నీ జననం.
కోరస్ : ముచ్చర్ల సత్తెన్నా
వీర విప్లవ తెలంగాణ
కోరస్ :నీ జయంతే ధిక్కారం దినం
నీ కలమాయే కరవాలం
కోరస్ : ముచ్చర్ల సత్తెన్నా

చరణం : 1
తెల తెల్లవారగానె తొలికోడి కూసినట్లు
తెలంగాణ మోసపోతే గోస పడ్తామంటూ
ముల్కి రూలు కావాలి ఉద్యోగాలు రావాలి
భూమిపుత్రుల పోరాటానికి నాంది పలికినా ధీశాలి
బొగ్గు భూమి
సంపదలే మింగీ
నీళ్లు నిధులు
నిలువున దోసె
ముఖ్యమంత్రినె
మామా మామ అంటూ
పాటలతోనే
పోటెత్తించినవా
సలసల కాగే నీ యువ రక్తం
సాల్లు బోయగా తెలంగాణక

||ధిక్కారం ధిక్కారం||

చరణం : 2

న్యాయం దక్కని నిరుపేదలకు నల్లకోటుపై మెర్శావా
బడుగులకు అలజడి నేర్పిన జై తెలంగాణ వైనావా
స్థానిక సంస్థల అధికారంకై సాహసంతో పోరాడావా
రాష్ట్ర మంత్రివైనా రాజ్యం చేతుల లేదనుకున్నావా
అంటూ ముట్టు
తరిమీ కొట్టి
చదువులన్నీ
అందరివన్నావా
దేశమంతా
గిరగిర తిర్గీ
బడుగుల చిచ్చర
పిడుగని చాటి
అడుగడుగునా ఒక ముందడుగంటూ
సమతా రాజ్యం కలలే గంటూ

||ధిక్కారం||

||ధీర ధీర||

సాకి లాగ ఆలాపన : నీ జయంతి రోజే తెలంగాణ ధిక్కార దినం

పుట్టింది కరీంనగర్ జిల్లా వేములవాడ. కవి, రచయిత, గాయకుడు. విప్లవోద్యమ నాయకుడు. అసలు పేరు కూర దేవేందర్. కలం పేరు మిత్ర. అమర్ పేరుతో సీపీఐ(ఎం.ఎల్.) జనశక్తి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు. రచనలు : 1. మిత్ర తెలంగాణ పాటలు, 2. పొదుగు, 3. వరుపు, 4. మిత్ర జనం పాటల సవ్వడి (పాటలు); 5. చితాభస్మంలోంచి...(కవిత్వం); 6. తెలంగాణ డప్పు దరువు, 7. తెలంగాణ ధూం ధాం, 8. తెలంగాణ కోలాటం పాట, 9. ముంబై తెలంగాణం, 10. బహుజన బతుకమ్మ, 11. వీరతెలంగాణ (నృత్యరూప గానాలు).

Leave a Reply