(మూలం- మర్వా. ఎల్. మురాద్)
నాకు ఏడేళ్ళున్నప్పుడు బొటనవేలికి గాయమైంది.
అమ్మ నన్ను హత్తుకుని,
నేనెన్నడూ ఎరుగని పాలస్తీనా పిల్లల
బాధనూ, వేదననూ
ఒక్కసారి తలచుకోమన్నది.
నాకిప్పుడు ముప్ఫై రెండేళ్లు.
నా చిన్నారి కూతురిని జోకొడుతూ,
నేనెన్నడూ చూడని ఆ గాజాలో
తల్లుల గుండెకోతను తలుచుకుంటూ
నా బిడ్డ కాలివేళ్ళను ముద్దెట్టుకున్నా.
ఆ తల్లుల పసికూనల వలెనే
నా పాపాయి కూడా
తెల్లని దుప్పట్లో ఒదిగి పడుకుంది,
కానీ, నా పాప-
రేపు పొద్దున్నే నిద్ర లేస్తుంది.
(‘గాజా పొయెట్స్ సొసైటీ’ వెబ్సైట్ నుండి)