ఋతువు తప్పిన ఋతుపవనాలు

సూర్యోదయం నుండే గస్తీకాస్తున్న రోహిణీ ఎండఏమాత్రం తలుపు తెరిచినా లోపలికి నిప్పుల్ని విసురుతుంది.మండిపడుతున్న గుల్మొహర్ పువ్వులుఎండకు వత్తాసుగా వడగాల్పుల్ని నిశ్వసిస్తుంటాయి. పారిశ్రామిక…

విరామ చిహ్నం

నీకు నాకు మధ్య గుప్పెడే దూరం  భూమ్యాకాశాల మధ్య క్షితిజరేఖకు మల్లే. నీకు నాకు మధ్య పలుచని తెర    నిశికి ప్రత్యూషానికి మధ్య మంచల్లే  నిన్ను చూసిన  తొలిక్షణంలోనే  శ్రావణమేఘమల్లే కమ్ముకున్న సంతోషపుదిగులు  మీరంతా అది ఈస్ట్రోజెన్ ప్రకోపం అని సూత్రీకరించవచ్చు  కానీ నాకు మాత్రం అది నేను నిజంగా జీవించిన క్షణం.  సిగ్గు విడిచి నా ప్రేమను నీకు వ్యక్తపరిచినప్పుడు నీవెంత సిగ్గుగా సంబరపడ్డావో గుర్తుందా? నేను సంకోచపుమడతల క్రింద దాచిపెట్టిన  ఊసులన్నిటినీ  నీ ఓరెగామి చూపులతో పిట్టల్ని చేసి ఎగరేసావు గుర్తుందా?  మల్లెలు విచ్చుకుంటున్న  నిశ్శబ్దాన్ని చెవులు రిక్కించి వింటున్న పూదోటలో  ఆషాఢమాసపు వెన్నెలరాత్రి నాఅరచేత ఉదయించిన సూర్యుణ్ణి  విస్మయంగా ముద్దిడిన నీ పెదవుల వెచ్చదనం ఎప్పటికీ నిత్యనూతనమే.…