ఇదొక చారిత్రక సందర్భం. రాజ్యాంగం రద్దు, రిజర్వేషన్ల తొలగింపు మొదలైన ప్రకటనల మధ్య దేశవ్యాప్తంగా దళితులు అలజడి పరిస్థితుల్లో జీవిస్తున్న సమయం.…
Author: రత్నాకర్ పెనుమాక
పుట్టింది కుతులూరు. కవి, కథకుడు, సామాజిక కార్యకర్త. బి. ఎస్సీ, ఎమ్.బి.ఏ చదివాడు. వివిధ బహుళ జాతి కంపెనీల్లో హెచ్. ఆర్. మేనేజర్ గా పనిచేశాడు. తర్వాత పూర్తికాల సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. యానాంలో 2005లో స్వచ్ఛంద సేవాసంస్థ నెలకొల్పాడు. సొంత నిధులతో నిర్విరామంగా సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. 11 కథలతో మొదటి కథా సంపుటి "గౌతమీ తీరం " (2022) ప్రచురితమైంది. అముద్రిత రచనలు: 60 కథలు, 30 కవితలు, 5 నవలలు రాశాడు. వివిధ కథా పోటీలలో 16 పురస్కారాలు వచ్చాయి. ఈ సంవత్సరం 12 బహుమతి కథలతో "గౌతమీ ఒడ్డున " అనే రెండవ కథా సంపుటి ఆవిష్కరించ బోతున్నాడు.