రేప్ అయ్యాక ఎలా ఉంటుందో మీకు చెప్పాలి..!రేప్ కాబడ్డానికి… సిమెంట్ మెట్ల మీద నుంచి పడిపోవడానికి పెద్ద తేడా ఏమీ లేదు.కాకపోతే……
Author: మార్జ్ పైయర్సీ
అమెరికాకి చెందిన ప్రగతిశీల హక్కుల కార్యకర్త, రచయిత్రి. ఫెమినిస్ట్ రచనలు విస్తృతంగా చేశారు. 31మార్చ్ 1936 లో డెట్రాయిట్ లో జన్మించారు. నానమ్మ చెప్పే కథలూ.. అమ్మకున్న విస్తృతమైన సాహిత్య పఠనానుభవం..మార్జి పైర్సీ లో సాహిత్య సృజన పట్ల ఆసక్తిని కలిగించాయి. యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్,నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీల్లో B.A., M.A. చదివారు.1976 లో స్త్రీవాద ఉద్యమాలు ఉధృతంగా మొదలైన రోజుల్లో స్త్రీల.. హక్కుల సంఘాలు నడిపించిన స్త్రీల పై హింసకు వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనల కు సంఘీభావంగా రాసిన కవిత ఈ రేప్ పోయెమ్. రేప్ బాధితురాళ్ల అంతర బాహ్యఘర్షణలను అత్యంత ఆర్ద్రంగా.. వాస్తవిక మెటఫర్ లను ఉపయోగించి రాసారు. రచనలు: ఉమెన్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ టైం., హి, షి& ఇట్, గాన్ టు సొల్జేర్స్. తన సాహిత్య అభిరుచిని గౌరవించని మొదటి భర్తకి విడాకులు ఇచ్చింది. తరువాత హక్కుల ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నది. ఆర్థర్ సి క్లార్క్ అవార్డ్, బ్రాడ్లీ అవార్డ్,బ్రిట్-హా-డోరోధ్ అవార్డ్,లాంటి చాలా అవార్డులు అందుకున్నారు.