యూనివర్సిటీలో చేరి రెండు నెలలు కావొస్తున్నా ఇంకా కొత్తగానే ఉంది ప్రభాకర్ కి. విశ్వమంతా అక్కడే ఉందా అనేంత విశాలమైంది ఆ…
Author: మానస ఎండ్లూరి
తల్లి దండ్రులు : పుట్ల హేమలత, ఎండ్లూరి సుధాకర్; పుట్టి పెరిగిన ప్రాంతం : పుట్టిన ఊరు నెల్లూరు, పెరిగినది రాజమండ్రి; విద్యారహతలు : MA, Linguistics, HCU. కేంద్ర సాహిత్య అకాడెమీ వారు 2016 లో త్రిపురలో, 2018లో అస్సాం లో నిర్వహించిన All India Young writers fests కి స్వీయ రచనా పఠణంకి తెలుగు నుండి ఏకైక రచయిత్రిగా ఆహ్వానం అందుకున్నారు. 2018 లో తన 22 కథలతో మిళింద అనే కథా సంపుటి తెచ్చారు. 2017 లో స్మైల్ స్మారక పురస్కారం, వెంకట సబ్బు స్మారక పురస్కారం. 2021 లో మాడభూషి పురస్కారం. పుట్ల హేమలత స్థాపించిన మొట్టమొదటి మహిళా అంతర్జాల సాహిత్య పత్రిక ' విహంగ ' కు సంపాదకులు గా ఉన్నారు. 2015 లో వచ్చిన మరాఠీ నవల 'ఓ' ని, 2021 లో 'ఊరికి దక్షిణాన' గా ఇంగ్లీష్ లోంచి తెలుగు లోకి అనువదించారు. భారత దేశంలో వచ్చిన మొట్ట మొదటి దళిత ఆత్మకథ 'బలూత' ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి త్వరలో అనువదించనున్నారు.