ప్రియమైన కశ్మీర్,అందమైన లోయ,నీలో సమ్మిళితమైనజమ్ము, శ్రీనగర్, లదాఖ్మనసంతా నువ్వే శాంతికి, అశాంతికి మధ్య, సుదీర్ఘంగా నలిగినpolitical sandwich నువ్వు70 వసంతాల విషాదానివి!ఆజాదీ…
Author: మహెజబీన్
కవయిత్రి మహెజబీన్ మానవ హక్కుల న్యాయవాది. యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో వామపక్ష విద్యార్ధి ఉద్యమాలలో పాల్గొన్నారు. కాలేజీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితులై కవిత్వం రాయడం మొదలుపెట్టారు. జబీన్ కవిత్వంలో ఉద్యమ ఛాయలు కనిపిస్తాయి. ఆమె తొలి కవితాసంపుటి "ఆకురాలు కాలం " 1997 లో ప్రచురించారు. ముఖ్యంగా ఆమె కవిత్వాన్ని రెండు కోణాల్లో చూడచ్చు. Feminist perspective and Revolutionary romanticism. పొలిటికల్ ఎన్కౌంటర్లకు సంబంధించిన ఆవేదన ఆమె కవిత్వం లో ప్రముఖంగా కనిపిస్తుంది. ఒకప్పుడు విరసం సభ్యురాలు. నెల్లూరు, తిరుపతి, హైదరాబాద్ లో విరసం యూనిట్ లో పనిచేశారు. ఆమె మీద సివిల్ లిబర్టీస్ (civil liberties), మానవ హక్కుల (Human rights) ఉద్యమాలు ప్రభావం చూపాయి. ఇప్పటి వరకు సీరియస్ కవిత్వమే రాశారు. ప్రొఫెసర్ హరగోపాల్ కు స్టూడెంట్. MA(సోషల్ వర్క్ ), LLB, Human Rights (PDGHR) చదివారు. Formal fellow DAAD, Germany. కవిత్వంతో పాటు fiction, prose కూడా రాసారు. హైదరాబాద్ హై కోర్ట్ లో క్రిమినల్ లాయర్ గా ఉన్నారు.